ఇంచియోన్ (దక్షిణ కొరియా): కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ జోరు కొనసాగుతోంది. సహచర భారత స్టార్ షట్లర్లు తొలి రౌండ్‌లోనే వెనుదిరిగినా... పతకం ఆశలను సజీవంగా ఉంచుతూ కశ్యప్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోరులో కశ్యప్ 24–22, 21–8తో జాన్ ఒ జార్గెన్‌సెన్ (డెన్మార్క్)ను చిత్తుచేశాడు. నేటి సెమీస్ పోరులో కశ్యప్ ప్రపంచ నంబర్ వన్ కెంటో మొమాటా (జపాన్)తో తలపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment