'భారత్లోని అవకాశాలు అందిపుచ్చుకోండి'
సియెల్ : దక్షిణ కొరియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. ఆయన మంగళవారం సియోల్లో పలువురు కొరియన్ పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. భారత్కు పెట్టుబడుతలతో తరలి రావాలని పారిశ్రామిక వేత్తలకు ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. అలాగే భారత్లోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు.
కాగా భారత్లో మౌలిక వసతుల కల్పన కోసం 1,000 కోట్ల డాలర్లు(రూ. 63.67 వేల కోట్లు) అందించేందుకు దక్షిణ కొరియా సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అందులో వంద కోట్ల డాలర్లను ఆర్థికాభివృద్ధి సహకార నిధికి అందజేయనుంది. మిగతా 9 బిలియన్ డాలర్లను స్మార్ట్ సిటీల అభివృద్ధి, రైల్వే, విద్యుదుత్పత్తి, సరఫరా రంగాలు సహా పలు మౌలిక వసతుల రంగాల అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించేందుకు దక్షిణ కొరియా ఆర్థిక శాఖ, ఆ దేశ ఎగ్జిమ్ బ్యాంక్లు అంగీకరించాయి. మూడు దేశాల పర్యటనలో భాగంగా చైనా, మంగోలియాల అనంతరం చివరగా దక్షిణ కొరియా చేరుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశాధ్యక్షురాలు పార్క్ క్వెన్ హెతో సోమవారం చర్చలు జరిపారు.