రాజేశం కుటుంబానికి రాహుల్ పరామర్శ
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కొరిటికల్లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు వెల్మ రాజేశం కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. రాజేశం కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరపున రెండు లక్షల రుపాయల ఆర్థిక సాయాన్ని అందచేశారు.
అంతకు ముందు రాహుల్ కొరిటికల్ నుంచి కిసాన్ సందేశ్ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో అయిదు రైతు కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. అయిదు గ్రామాల్లో 15 కిలోమీటర్ల మేర కిసాన్ సందేశ్ యాత్ర కొనసాగనుంది. కొరిటికల్, లక్ష్మణచాంద, పొట్టుపల్లి, రాచాపూర్, వడ్యాల గ్రామాల్లో రాహుల్ పాదయాత్ర చేస్తారు. వడ్యాలలో 3 గంటలకు రైతు సదస్సు నిర్వహిస్తారు. రాహుల్ వెంట అసోం ముఖ్యమంత్రి కుమారుడు గౌరవ్ గొగోయ్, ఎంపీలు సుస్మిత, రాజ్బబ్బర్తో పాటు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీతో దిగ్విజయ్ సింగ్, వి.హనుమంతరావు తదితరులు ఉన్నారు.