రాజేశం కుటుంబానికి రాహుల్ పరామర్శ | Rahulgandhi kisan sandesh yatra begin in adilabad disitrict Koritical | Sakshi
Sakshi News home page

రాజేశం కుటుంబానికి రాహుల్ పరామర్శ

Published Fri, May 15 2015 8:53 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

రాజేశం కుటుంబానికి రాహుల్ పరామర్శ - Sakshi

రాజేశం కుటుంబానికి రాహుల్ పరామర్శ

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కొరిటికల్లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు వెల్మ రాజేశం కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు.  రాజేశం కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరపున రెండు లక్షల రుపాయల ఆర్థిక సాయాన్ని అందచేశారు.

అంతకు ముందు రాహుల్ కొరిటికల్ నుంచి కిసాన్ సందేశ్ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో అయిదు రైతు కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. అయిదు గ్రామాల్లో 15 కిలోమీటర్ల మేర కిసాన్ సందేశ్ యాత్ర కొనసాగనుంది. కొరిటికల్, లక్ష్మణచాంద, పొట్టుపల్లి, రాచాపూర్, వడ్యాల గ్రామాల్లో రాహుల్ పాదయాత్ర చేస్తారు. వడ్యాలలో 3 గంటలకు రైతు సదస్సు నిర్వహిస్తారు. రాహుల్ వెంట అసోం ముఖ్యమంత్రి కుమారుడు గౌరవ్ గొగోయ్, ఎంపీలు సుస్మిత, రాజ్బబ్బర్తో పాటు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీతో దిగ్విజయ్ సింగ్, వి.హనుమంతరావు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement