kosta
-
ఏ ప్రాంతంలో ఏ అంశం?
వివిధ ప్రాంతాల్లో ఓటర్లను ప్రభావితం చేయనున్న అంశాలు.. హైదరాబాద్ కర్ణాటక... తెలుగువారు ఎక్కువగా ఉండే బళ్లారి, రాయ్‌చూర్, కొప్పళ్, బీదర్, యాద్గిర్, కలబురిగి (గుల్బర్గా) జిల్లాలు ఈ ప్రాంతం కిందకు వస్తాయి. సామాజిక, ఆర్థిక వెనకబాటుదనంతో పాటు నీటివనరులు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్య. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించాలనే నాలుగుదశాబ్దాల డిమాండ్ 2012లో యూపీఏ హయాంలో నెరవేరింది. వ్యవసాయానికి నీటివనరులు, అభివృద్ది, మౌలికసదుపాయాలు, ఉపాధి ఇక్కడి స్థానాల్లోని ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. బాంబే కర్ణాటక... భిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతంలో మరాఠీ ప్రజలు ఎక్కువగానే ఉన్నారు. బెళగావి ప్రాంతాన్ని మహారాష్ట్రలో విలీనం చేయాలంటూ ఓ సంస్థ ఉద్యమం కూడా సాగిస్తోంది. కళసా బండూరి నాలా ప్రాజెక్టు ద్వారా బెళగావి, హుబ్బళ్ళి (హుబ్లీ)–ధార్వాడ్, గదగ్ ప్రాంతాలకు మహదాయీ నది నీటి పంపిణీపై మహారాష్ట్ర, గోవాలతో కర్ణాటకకు వివాదం తలెత్తింది. పాత మైసూరు ప్రాంతం... ఇక్కడ కావేరి జలాల వివాదం నివురుగప్పిన నిప్పులా రగులుతోంది. ఇక్కడి రైతుల జీవనోపాధికి, వ్యవసాయానికి ఈ నీరే కీలకం. కొడగు జిల్లా మీదుగా పశ్చిమ కనుమల్లో కాఫీ, నారింజ తోటల పెంపకం పెరగడంతో పర్యావరణ సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ ప్రాంతంలో చేపట్టనున్న రైల్వేలైన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పలు సంస్థలు ఉద్యమం నిర్వహిస్తున్నాయి. ఈ అంశాలు ఇక్కడ ఎన్నికల్లో ప్రభావితం చూపనుండగా జేడీఎస్–కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. కోస్తా, మల్నాడు ప్రాంతాలు... దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపి జిల్లాల్లో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. గోరక్షక దళాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, మోరల్ పోలీసింగ్ హిందుత్వ అనుకూల శక్తుల ప్రమేయంతో మత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మంగళూరు నగరంలో ఉగ్రవాద జాడలను పోలీసులు కనుక్కున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా హిందు, ముస్లింల మధ్య బాబాబుడన్‌గిరి ప్రార్థనా స్థలంపై వివాదం సాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్రపోటీ ఏర్పడింది. ఇవేకాక ప్రముఖ హేతువాది, చరిత్రకారుడు ఎంఎం కలబురిగీ, విలేకరి గౌరీ లంకేష్‌ల హత్యలు కూడా ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. శిరహట్టిలో గెలిస్తే..! బాంబే కర్ణాటకలోని గదగ్ జిల్లాలో ఉన్న ఓ నియోజవర్గం శిరహట్టి. 1972 నుంచి 2013 వరకు జరిగిన అన్ని విధానసభ ఎన్నికల్లోనూ ఈ స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీదే రాష్ట్రంలో అధికారం. స్వతంత్ర అభ్యర్థి గెలిచినప్పటికీ, ఆ అభ్యర్థి ఓ పార్టీలో చేరిన తర్వాతనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు న్నాయి. ఇక్కడ దాదాపు 2 లక్షల మంది ఓటర్లుంటారు. 1972లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వదిరాజ్ ఆచార్య గెలిచారు. 1983 వరకు ఈ సీటుపై పట్టును కాంగ్రెస్ కొనసాగించి అధికారంలో ఉంది. 1983లో నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపనల్ గులప్ప ఫకీరప్ప స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి జనతాపార్టీకి మద్దతిచ్చారు. ఆ తర్వాతే రామకృష్ణ హెగ్డే నేతృత్వంలో జనతా ప్రభుత్వం ఏర్పడింది. 1985లోనూ జనతాపార్టీనే ఆ సీటును నిలుపుకోగా మళ్లీ హెగ్డే సీఎం అయ్యారు. ఆ తర్వాతా ఈ స్థానంలో గెలిచిన పార్టీనే ఎప్పుడూ అధికారంలోకి వచ్చింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ప్రత్యేక రైళ్లన్నీ కోస్తా వైపే
– దసరా సందర్భంగా స్పెషల్స్ నడుపుతున్న ద.మ. రైల్వే – సర్వీసులన్నీ విజయవాడ, విశాఖ వైపే.. కర్నూలుకు లభించని స్థానం – సాధారణ రైళ్లలో భోగీలన్నీ ఫుల్లు కర్నూలు(రాజ్‌విహార్): దసరా పండుగను పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ప్రత్యేక రైళ్లన్నీ కోస్తా వైపుగానే పరుగులు తీస్తున్నాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా కర్నూలు మీదుగా లేకపోవడం ఇక్కడి ప్రయాణికులను అసంతప్తికి గురి చేస్తోంది. పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 12రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో సొంతూరు వెళ్లి సంబరాలు నిర్వహించుకునేవారంతా ప్రయాణానికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే .. ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే ఇప్పటికే 20రైళ్లను ప్రవేశపెట్టిన ఉన్నతాధికారులు తాజాగా మరో 22 రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఒక్కటి కూడా కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ మీదుగా నడపడం లేదు. అన్ని విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి తదితర ప్రాంతాలకే నడుస్తున్నాయి. దీంతో జిల్లా వాసులు ప్రయాణాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. స్పెషల్ ట్రై న్స్ లేకపోవడం, ఉన్నవాటిలో బెర్తులు, జనరల్ కంపార్ట్మెంట్లు కిక్కిరిసి ఉండడం, పెరిగిన అర్టీసీ చార్జీల కారణంగా జిల్లా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నో బెర్త్.. నో రూం. దసరా ప్రయాణాలుండడంతో రోజువారీ∙రైళ్లన్నీ కిక్కిరిసి నడుస్తున్నాయి. వాటిలో బెర్తులన్నీ నిండిపోవడంతోపాటు జనరల్ కంపార్ట్మెంట్లు కిటకిటలాడుతున్నాయి. టికెట్ తీసుకొని రైలెక్కిన ప్రయాణికులకు కూర్చునే సీటు దొరక్క డోర్లు, బాత్రూముల వద్ద, లగేజీ బోగీల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దూర ప్రాంత ప్రయాణికులు బాధలు ఇక చెప్పాల్సిన పని లేదు. రిజర్వేషన్ల కోసం క్యూలో నిల్చున్న ప్రయాణికులకు నో బెర్త్.. వెయిటింగ్ లిస్టు.. నో రూమ్ సమాచారం ఇస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాదు నుంచి కర్నూలు మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే రోజువారి ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు వారంతపు రైళ్లు, ఇంటర్సిటీ (హంద్రీ), తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైళ్లేవి ఇందుకు మినహాయింపు కాదు. -
ముఖ్యమంత్రికి కోస్తాపైనే ప్రేమ
– శ్రీశైలం నీటిని దిగువకు తరలిస్తున్నారు – సీమ రైతాంగాన్ని విస్మరిస్తున్నారు – ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ నూనెపల్లె: ముఖ్యమంత్రి చంద్రబాబుకు కోస్తాపైనే ప్రేమ ఎక్కువని, అందుకే శ్రీశైలం జలాశయం నీటిని దిగవకు తీసుకెళ్తున్నారని రాయలసీమ అభివద్ధి వేదిక కన్వీనర్, ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ అన్నారు. వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన రాయలసీమ అభివద్ధి యాత్రలో భాగంగా ఆదివారం పట్టణంలోని వివేకానంద ఆడిటోరియంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గేయానంద్ మాట్లాడుతూ శ్రీశైలం జలాశయం నీటిమట్టం 854 అడుగులు ఉండాలన్నారు. కాదని శ్రీశైలం నీటిని నాగార్జున సాగర్‌కు తీసుకెళ్లితే అడ్డుకుంటామన్నారు. ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం వారిని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. నంద్యాల ప్రాంతాన్ని సీడ్‌హబ్‌గా మార్చుతామని చెప్పి నేటికి ఆచరణలో పెట్టలేదన్నారు. రామకష్ణా విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకష్ణారెడ్డి మాట్లాడుతూ నంద్యాల ప్రాంతాన్ని విద్యాకేంద్రంగా మార్చాలన్నారు. అప్పుడే విద్యతో పాటు నిరుద్యోగుకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కైపరాముడు, రాయలసీమ అభివద్ధి వేదిక కో కన్వీనర్ శ్రీనివాసమూర్తి, నందిరైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు మేరువ చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మణిశేఖర్ రెడ్డి, హుసేన్‌రెడ్డి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి జాకీర్ హుసేన్, ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ముర్తుజా, ప్రై వేటు విద్యాసంస్థల అధ్యక్షుడు దస్తగిరి, పీఎంఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ బాలచంద్రుడు, సీఐటీయూ సీనియర్ నాయకులు తోటమద్దులు, వేదిక నాయకులు శ్రీనివాసరెడ్డి, శేషఫణి, లక్ష్మణ్, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.