ముఖ్యమంత్రికి కోస్తాపైనే ప్రేమ
ముఖ్యమంత్రికి కోస్తాపైనే ప్రేమ
Published Sun, Sep 4 2016 9:37 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
– శ్రీశైలం నీటిని దిగువకు తరలిస్తున్నారు
– సీమ రైతాంగాన్ని విస్మరిస్తున్నారు
– ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్
నూనెపల్లె: ముఖ్యమంత్రి చంద్రబాబుకు కోస్తాపైనే ప్రేమ ఎక్కువని, అందుకే శ్రీశైలం జలాశయం నీటిని దిగవకు తీసుకెళ్తున్నారని రాయలసీమ అభివద్ధి వేదిక కన్వీనర్, ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ అన్నారు. వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన రాయలసీమ అభివద్ధి యాత్రలో భాగంగా ఆదివారం పట్టణంలోని వివేకానంద ఆడిటోరియంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గేయానంద్ మాట్లాడుతూ శ్రీశైలం జలాశయం నీటిమట్టం 854 అడుగులు ఉండాలన్నారు. కాదని శ్రీశైలం నీటిని నాగార్జున సాగర్‌కు తీసుకెళ్లితే అడ్డుకుంటామన్నారు. ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం వారిని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. నంద్యాల ప్రాంతాన్ని సీడ్‌హబ్‌గా మార్చుతామని చెప్పి నేటికి ఆచరణలో పెట్టలేదన్నారు. రామకష్ణా విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకష్ణారెడ్డి మాట్లాడుతూ నంద్యాల ప్రాంతాన్ని విద్యాకేంద్రంగా మార్చాలన్నారు. అప్పుడే విద్యతో పాటు నిరుద్యోగుకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కైపరాముడు, రాయలసీమ అభివద్ధి వేదిక కో కన్వీనర్ శ్రీనివాసమూర్తి, నందిరైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు మేరువ చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మణిశేఖర్ రెడ్డి, హుసేన్‌రెడ్డి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి జాకీర్ హుసేన్, ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ముర్తుజా, ప్రై వేటు విద్యాసంస్థల అధ్యక్షుడు దస్తగిరి, పీఎంఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ బాలచంద్రుడు, సీఐటీయూ సీనియర్ నాయకులు తోటమద్దులు, వేదిక నాయకులు శ్రీనివాసరెడ్డి, శేషఫణి, లక్ష్మణ్, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement