breaking news
Kotha Lokah Chapter 1: Chandra
-
'లోక'తో డబ్బులు పోతాయని ఫిక్సయ్యా: దుల్కర్ సల్మాన్
సినిమాలు తీయడం అనేది జూదం లాంటిది. వస్తే భారీ లాభాలు. లేదంటే భారీ నష్టాలు. కొన్నిసార్లు మాత్రం ఊహించని సక్సెస్, కోట్ల కొద్దీ కలెక్షన్ వస్తుంటాయి. తాజాగా రిలీజైన సినిమాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. తెలుగులో 'లిటిల్ హార్ట్స్' ఎంతలా సంచలనం సృష్టిస్తుందో చూస్తునే ఉన్నాం. దీని కంటే ముందు రిలీజైన ఓ మలయాళ చిత్రం కూడా ఊహించని వసూళ్లతో రికార్డ్స్ బద్దలుకొడుతుంది. ఈ మూవీ గురించి హీరో కమ్ నిర్మాత దుల్కర్ సల్మాన్ ఆసక్తికర విషయాలు చెప్పాడు.(ఇదీ చదవండి: కోర్ట్ని ఆశ్రయించిన 'కాంతార' నిర్మాతలు?)'నిర్మాతగా 'లోక' కోసం పెట్టిందంతా నష్టపోతానని అనుకున్నాను. స్టోరీ బాగా నచ్చింది. మంచి సినిమా అవుతుందని తెలుసు. కానీ బడ్జెట్ ఎక్కువైపోయింది. మలయాళంలో ఇంత బడ్జెట్ చాలా రిస్క్. కానీ కథని నమ్మి పెట్టాను. థియేటర్లలో రిలీజ్ చేద్దామంటే డిస్ట్రిబ్యూటర్స్ అంతగా ఆసక్తి చూపించలేదు. లోక ఫ్రాంచైజీ మొదలుపెడితే సీక్వెల్స్‌తో లాభాలొస్తాయని అనుకున్నాను. ఆ నమ్మకంతోనే రిలీజ్ చేశాం. కానీ ఈ సక్సెస్ మాత్రం ఊహించలేదు. మొదటిరోజు నుంచే సూపర్ హిట్ టాక్, భారీ కలెక్షన్‌తో సెన్సేషన్ సృష్టిస్తోంది. మా సంస్థకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది' అని దుల్కర్.. లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.మలయాళంలో వచ్చిన తొలి లేడీ సూపర్ హీరో సినిమా ఇది. తెలుగులోనూ దీన్ని 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేశారు గానీ ఇక్కడ ఓ మాదిరిగానే లాభపడింది. కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకుడు కాగా.. ఇందులో దుల్కర్ సల్మాన్, టొవినో థామస్, సౌబిన్ షాహిర్ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించారు. థియేటర్లలోకి వచ్చి మూడు వారాలైనా సరే ఇప్పటికీ ఈ చిత్రానికి థియేటర్లలో రెస్పాన్స్ వస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: సింపతీ కార్డ్ ప్లే చేయొద్దు.. రీతూని ఏడిపించిన మాస్క్ మ్యాన్!)"As Producer, we thought that we'll lose money on #Lokah😳. we know it's good film, but Budget is high & Buyers are not interested🙁. I thought if this franchise is established, we might do profit🤞. But this success was unimaginable🥶♥️"- #DulquerSalmaanpic.twitter.com/pmy1Bum8a1— AmuthaBharathi (@CinemaWithAB) September 15, 2025 -
'లోక' @ రూ.200 కోట్లు.. గర్వాన్ని తలకెక్కించుకోవద్దన్న తండ్రి
లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కలెక్షన్స్ పెద్దగా రావంటుంటారు! కానీ కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ప్రధాన పాత్రలో నటించిన 'కొత్త లోక మూవీ' ఆ వాదనను కొట్టిపారేసింది. సెంచరీలు కొడుతోంది. బాక్సాఫీస్ వద్ద రిలీజైన 13 రోజుల్లోనే రూ.202 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇంతటి ఘన విజయం సాధించినందుకు అందరూ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఇదే నా సలహా: తండ్రి మెసేజ్ఇలాంటి సమయంలో కల్యాణికి తండ్రి, దర్శకుడు ప్రియదర్శన్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. అదేంటనేది ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసింది. 'ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో.. విజయ గర్వాన్ని తలకెక్కించుకోకు, ఫ్లాప్ వచ్చినప్పుడు ఆ బాధను మనసులో మోయకు.. నేను నీకు ఇచ్చే మంచి సలహా ఇదే! లవ్యూ..' అని కూతురికి మెసేజ్ పెట్టాడు. అందుకు కల్యాణి.. తప్పకుండా మీరు చెప్పింది పాటిస్తాను నాన్నా, లవ్యూ అని రిప్లై ఇచ్చింది.సినిమాతన సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు సైతం అభినందనలు తెలిపింది. 'మీ వల్లే సినిమాకు ఈ రేంజ్లో కలెక్షన్స్ వస్తున్నాయి. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నాకు మాటలు రావడం లేదు. మన ఇండస్ట్రీలో కంటెంటే కింగ్. కథలో దమ్ముంటే మీరు దాన్ని అందలం ఎక్కిస్తారని మరోసారి రుజువు చేశారు' అని రాసుకొచ్చింది. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో వచ్చిన మూవీ 'కొత్త లోక: చాప్టర్ 1 చంద్ర'. కల్యాణి ప్రియదర్శన్, నస్లీన్ ప్రధాన పాత్రలు పోషించారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్ నిర్మించాడు. ఈ మూవీ ఆగస్టు 28న మలయాళంలో రిలీజైంది. ఒకరోజు ఆలస్యంగా ఆగస్టు 29న సాయంత్రం తెలుగులో విడుదలైంది. View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) చదవండి: అంత వైరల్ చేశారేంటి? నేనేదో సరదాగా అన్నా!: హీరో -
ఆ హీరోయిన్ నాకు చెల్లెలు లాంటిది: దుల్కర్ సల్మాన్
‘‘కల్యాణి ప్రియదర్శన్ నాకు చెల్లిలాంటిది. మేమిద్దరం ఒకేలా ఉంటాం, ఒకేలా ఆలోచిస్తాం. చంద్ర పాత్ర కోసం తను తప్ప మా మైండ్లోకి వేరే ఎవరి పేరు రాలేదు. నన్ను ఎలాగైతే మీవాడిగా భావించారో అలాగే నేను నిర్మించిన ‘కొత్త లోక’ చిత్రాన్ని కూడా మీ సినిమాగా భావించి ఆదరిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని దుల్కర్ సల్మాన్ అన్నారు. కల్యాణీ ప్రియదర్శన్ లీడ్ రోల్లో, నస్లెన్ కీలక పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘లోక చాప్టర్ 1: చంద్ర’. ఈ మూవీ వారం రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది.బడ్జెట్ గురించి ఆలోచించలేడొమినిక్ అరుణ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో ఆగస్టు 29న నిర్మాత సూర్యదేవర నాగవంశీ విడుదల చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్ర విజయోత్సవానికి దర్శకులు నాగ్ అశ్విన్, వెంకీ అట్లూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా బడ్జెట్ తక్కువని మీరు అనుకోవచ్చు. కానీ, మలయాళ పరిశ్రమలో ఈ బడ్జెట్ చాలా ఎక్కువ. అయితే నేను బడ్జెట్ గురించి ఆలోచించలేదు. డైరెక్టర్, డీఓపీ మధ్య బాండింగ్ బాగుంటే మంచి సినిమాలు చేయొచ్చు’’ అని చెప్పారు. రూ.30 కోట్లు ఎక్కువనాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘అందరిలాగే నేను కూడా ఈ సినిమా రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా ప్రారంభించినప్పుడు మలయాళంలో రూ.30 కోట్లు అనేది చాలా ఎక్కువ. నిర్మాతగా ధైర్యం చేసిన దుల్కర్ సల్మాన్‌ని అభినందించాలి’’ అన్నారు వెంకీ అట్లూరి. ‘‘ఇలాంటి సూపర్ హీరో సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు నాగవంశీ. కల్యాణీ ప్రియదర్శన్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి, మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని తెలిపారు. ‘‘తెలుగు ప్రేక్షకులు మా సినిమాపై కురిపిస్తున్న ప్రేమకు హ్యాపీగా ఉంది’’ అన్నారు డొమినిక్ అరుణ్. తండ్రి రియాక్షన్ ఇదే!ఈ చిత్రాన్ని తమిళనాడులో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేసింది. గురువారం మధ్యాహ్నం చైన్నెలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ మాట్లాడుతూ.. యాక్షన్ హీరోగా నటించనున్నట్లు తండ్రి ప్రియదర్శన్‌కు చెప్పగా నువ్వా.. యాక్షన్ హీరో పాత్రలోనా! అని ఆశ్చర్యపోయారన్నారు. ఆ తరువాత చెయ్యి, కాళ్లు, చేతులు విరగ్గొట్టుకోకుండా ఉంటే సరి అని అన్నారన్నారు.చదవండి: కమెడియన్‌కు పక్షవాతం.. నటుడి ఆర్థిక సాయం -
మలయాళ సినిమా కొత్త లోక సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
మహానటి రికార్డుని బ్రేక్ చేసిన 'కొత్త లోక'..! 7 రోజుల్లోనే 100 కోట్లు
-
'కొత్త లోక' మూవీ సక్సెస్‌మీట్‌లో కల్యాణి ప్రియదర్శన్, దుల్కర్ (ఫోటోలు)
-
కన్నడ ప్రేక్షకులకు క్షమాపణలు: 'కొత్త లోక' నిర్మాతలు
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నిర్మించిన తాజా సినిమా ‘కొత్త లోక’ (Kotha Lokah) టాలీవుడ్లో కూడా విజయవంతంగా రన్ అవుతుంది. ఇందులో కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) సూపర్ యోధగా నటించి మెప్పించింది. ఫాంటసీ థ్రిల్లర్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీంతో ఏకంగా రూ.100 కోట్ల క్లబ్లో ఈ మూవీ చేరింది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కన్నడ ప్రేక్షకులకు దుల్కర్ సల్మాన్ క్షమాపణలు చెప్పారు.'లోక చాప్టర్1: చంద్ర' చిత్రంలో ఒక సంభాషణ కన్నడ ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసిందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై చిత్ర నిర్మాతలు క్షమాపణలు చెప్పారు. 'ఈ సినిమాలో ఒక పాత్ర చెప్పిన సంభాషణ కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని మాకు సమాచారం వచ్చింది. దీనికి మేము చింతిస్తున్నాము. పొరపాటున జరిగినప్పటికీ మేము బాధ్యత వహిస్తున్నాం. ఈ సంభాషణను వీలైనంత త్వరగా తొలగిస్తాం లేదా సవరిస్తాం. మా వల్ల జరిగిన తప్పుకి హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాం' అని తెలిపారు. -
'కొత్త లోక' సరికొత్త రికార్డ్.. దీనిదే అగ్రస్థానం
హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అనగానే చాలామంది ప్రేక్షకులకు చిన్నచూపు. హా ఏముందిలే అని అనుకుంటారు. కానీ అప్పట్లోనే విజయశాంతి లాంటి హీరోయిన్స్.. 'కర్తవ్యం' లాంటి సినిమాలు చేశారు. బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ తర్వాత కాలంలో హీరోలు, కమర్షియల్ చిత్రాల హవా పెరిగేసరికి ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ రావడం బాగా తగ్గిపోయింది. కానీ గత దశాబ్ద కాలంలో మాత్రం దక్షిణాదిలో అడపాదడపా వస్తూనే ఉన్నాయి.గత కొన్నేళ్లలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అనగానే అనుష్క గుర్తొస్తుంది. 'అరుంధతి'తో ట్రెండ్ సెట్ చేసిన ఈ బ్యూటీ.. తర్వాత రుద్రమదేవి, భాగమతి తదతరత చిత్రాలతో తన సకెస్స్‌ని కొనసాగించింది. తర్వాత కాలంలో పలువురు సౌత్ హీరోయిన్లు.. ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ తీసినప్పటికీ అనుష్క దరిదాపుల్లోకి చేరుకోలేకపోయారు. కానీ 'మహానటి' మూవీతో కీర్తి సురేశ్ ఆ ఫీట్ సాధించింది. ఈ మూవీకి ఏకంగా రూ.84 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.(ఇదీ చదవండి: 2 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్)2018లో 'మహానటి' రాగా ఆ రికార్డ్ అలానే ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు 'కొత్త లోక' సినిమా సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం.. రిలీజైన 7 రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్ మార్క్ అందుకుంది. సాధారణంగా చూస్తే ఇదేమంత ఎక్కువ మొత్తంలా అనిపించకపోవచ్చు. కానీ మిడ్ రేంజ్ హీరోయిన్ అయిన కల్యాణి ప్రియదర్శన్‌ని లీడ్ రోల్లో పెట్టి తీసిన సూపర్ హీరో సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు అంటే కచ్చితంగా విశేషమే.ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయిన 'కొత్త లోక'.. ఇప్పుడు రూ.100 కోట్ల మార్క్ కూడా దాటేసినట్లు తెలుస్తోంది. తద్వారా మహానటి, రుద్రమదేవి, భాగమతి, అరుంధతి చిత్రాల కంటే ఎక్కువ వసూళ్లు సాధించిన సౌత్ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీగా నిలిచింది. థియేట్రికల్ రన్ పూర్తయ్యేసరికి ఇది ఇంకెన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కూలీ' విలన్.. దుబాయి వెళ్లడానికి నో పర్మిషన్) -
'కొత్త లోక'.. ఏకంగా ఐదు పార్ట్స్
గత వీకెండ్లో మూడు నాలుగు తెలుగు సినిమాలు రిలీజైతే వాటిలో కొన్నింటికి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మరోవైపు మలయాళ డబ్బింగ్ మూవీ 'కొత్త లోక'కి తెలుగులో ఓ మాదిరి రెస్పాన్స్ వచ్చింది. మెట్రో సిటీల్లో ఆదివారం వరకు మంచి ఆక్యుపెన్సీ చూపించింది. తొలి నుంచి ఇది సూపర్ హీరో తరహా యూనివర్స్ అని చెప్పిన టీమ్.. ఇప్పుడు మరిన్ని ఆసక్తికర విషయాల్ని రివీల్ చేసింది.మనం పురాణాల్లో విన్న యక్షిణి పాత్రని తీసుకుని, దానికి సూపర్ పవర్స్ జోడించి 'కొత్త లోక' సినిమాని తీశారు. కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసింది. బడ్జెట్ కూడా రూ.35-40 కోట్ల మధ్యనే అని టాక్. అయితే ఇంత తక్కువ బడ్జెట్ పెట్టి ఈ రేంజు ఔట్ పుట్ చూపించడంపై ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. సినిమా పాజిటివ్ టాక్ రావడంతో పాటు రూ.60-70 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అంటే లాభాల్లోకి ఎంటరైనట్లే.(ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి సమంత దుబాయి ట్రిప్.. వీడియో వైరల్)తాజాగా ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ గురించి మాట్లాడిన దర్శకుడు డొమినిక్ అరుణ్.. ఈ మూవీ ఫ్రాంచైజీలో మొత్తం ఐదు పార్ట్స్ ఉంటాయని చెప్పుకొచ్చాడు. అలానే 'కొత్త లోక' సినిమా ప్రారంభంలోనే మెయిన్ విలన్ ఎవరనేది హింట్ ఇచ్చామని పేర్కొన్నాడు. ఐదు భాగాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా షూటింగ్ మొదలవకముందే పూర్తి చేశామని క్లారిటీ ఇచ్చాడు.ఈ మూవీలో అతిథి పాత్రలో కనిపించి ఆకట్టుకున్న టొవినో థామస్.. రెండో పార్ట్‌లో లీడ్ రోల్ చేస్తాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే 'కొత్త లోక' తొలి పార్ట్ చివరలో దుల్కర్ సల్మాన్ కూడా కనిపించాడు. రాబోయే పార్ట్స్‌లో ఏదో ఒకదానిలో దుల్కర్ కూడా కచ్చితంగా ఉండటం గ్యారంటీ. ఇప్పటివరకు కమర్షియల్‌గా గుర్తింపు తెచ్చుకున్న కల్యాణి.. ఈ సినిమాతో మరింతగా క్రేజ్ సంపాదిస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: 'ఓజీ' కొత్త గ్లింప్స్ రిలీజ్) -
సూపర్‌స్టార్ సినిమాని దాటేసిన 'కొత్త లోక'.. కలెక్షన్ ఎంతంటే?
గతవారం వినాయక చవితి సందర్భంగా లాంగ్ వీకెండ్ వచ్చింది. కానీ స్టార్ హీరోలు, మిడ్ హీరోల చిత్రాలేవి థియేటర్లలోకి రాలేదు. త్రిబాణధారి బార్బరిక్, అర్జున్ చక్రవర్తి, సుందరకాండ తదితర చిన్న మూవీస్ వచ్చాయి ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. మరోవైపు స్క్రీనింగ్ సమస్యలు ఎదుర్కొని, ఎలాంటి పబ్లిసిటీ లేకుండా విడుదలైన 'కొత్త లోక' అనే డబ్బింగ్ సినిమా.. మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపిస్తోంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఓవరాల్‌గా ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ ఎంత?మలయాళ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు తీస్తుంటారు. ఇప్పుడు సూపర్ హీరో యూనివర్స్ సృష్టించారు. అందులో వచ్చిన తొలి సినిమానే 'లోక'. దీన్ని తెలుగులో 'కొత్త లోక' పేరుతో రిలీజ్ చేశారు. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ మూవీలో కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ చేసింది. పురాణగాథల్లో ఉన్న యక్షిణి పాత్రని తీసుకుని, సూపర్ హీరో కాన్సెప్ట్ జోడించడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే మలయాళంతో పాటు తెలుగులోనూ పాజిటివ్ టాక్ వచ్చింది.(ఇదీ చదవండి: 'కొత్త లోక' రివ్యూ)మలయాళంలో ఆగస్టు 28న రిలీజ్ కాగా.. ఓ రోజు ఆలస్యంగా తెలుగులో విడుదలైంది. ఇప్పటివరకు నాలుగు రోజులు పూర్తి కాగా దాదాపు రూ.40-45 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. కేవలం తెలుగులోనే రూ.3.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని సమాచారం. ప్రస్తుతానికైతే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూపిస్తోంది.మలయాళంలో దీనితో పాటు సూపర్‌స్టార్ మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా కూడా రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ దీనికి రూ.11-15 కోట్లు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే 'కొత్త లోక'నే ముందంజలో ఉంది. అయితే ఈ సినిమాని కేవలం రూ.30-40 కోట్ల బడ్జెట్‌తోనే తీశారట. అంటే లాంగ్ రన్లో ఈ సినిమాకు మంచి లాభాలు రావడం గ్యారంటీ.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకుని బిగ్‌బాస్ జంట సర్ప్రైజ్) -
హీరోయిన్‌కి సూపర్ పవర్స్ ఉంటే.. 'కొత్త లోక' రివ్యూ
మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్.. అఖిల్ 'హలో' మూవీతో హీరోయిన్ అయింది. 'చిత్రలహరి' అనే మరో తెలుగు సినిమా కూడా చేసింది. తర్వాత పూర్తిగా సొంత భాషకే పరిమితమైపోయింది. ఇప్పుడు ఈమె.. ఓ సూపర్ హీరో కాన్సెప్ట్ చిత్రంలో లీడ్ రోల్ చేసింది. అదే 'కొత్త లోక: ఛాప్టర్ 1 చంద్ర'. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ మూవీ.. ఆగస్టు 28న మలయాళంలో రిలీజ్ కాగా, ఓ రోజు ఆలస్యంగా తెలుగులో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?చంద్ర (కల్యాణి ప్రియదర్శన్)కి సూపర్ పవర్స్ ఉంటాయి. ఈ విషయం కొందరికి మాత్రమే తెలుసు. ఓ సందర్భంలో బెంగళూరు వస్తుంది. తన అతీంద్రయ శక్తుల్ని దాచిపెట్టి, సాధారణ అమ్మాయిలా బతుకుతుంది. కేఫ్‌లో పనిచేస్తుంటుంది. ఈమె ఎదురింట్లో సన్నీ(నస్లేన్) ఫ్రెండ్స్‌తో కలిసి నివసిస్తుంటాడు. చంద్రని చూసి సన్నీ ఇష్టపడతాడు. పరిస్థితులు కలిసొచ్చి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఓ రోజు రాత్రి జరిగిన సంఘటనల వల్ల చంద్ర జీవితం తలకిందులవుతుంది. ఇంతకీ చంద్ర ఎవరు? ఆమె గతమేంటి? ఈమెకు ఎస్ఐ నాచియప్ప (శాండీ)తో గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సాధారణంగా సూపర్ హీరో సినిమాలు అనగానే చాలామందికి హాలీవుడ్ గుర్తొస్తుంది. రీసెంట్ టైంలో 'హనుమాన్' పేరుతో తెలుగులోనూ ఓ మూవీ వచ్చింది. ఇప్పుడు మలయాళంలో సూపర్ హీరో జానర్లో ఏకంగా ఓ యూనివర్స్ సృష్టించారు. ఇందులో వచ్చిన తొలి సినిమానే 'లోక'. తెలుగులో దీన్ని 'కొత్త లోక' పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. రెగ్యులర్ రొటీన్ మూవీస్‌తో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా ఉంది. అందుకు తగ్గట్లే థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ కూడా ఇచ్చింది.చంద్ర ఓ పవర్ ఫుల్ ఫైట్ చేయడంతో సినిమా మొదలవుతుంది. కొన్ని కారణాల వల్ల బెంగళూరు రావడం, ఇక్కడ ఎదురింట్లో ఉండే సన్నీతో పరిచయం.. ఇలా పాత్రలు, పరిస్థితుల్ని చూపిస్తూ వెళ్లారు. ఓ సాధారణ అమ్మాయిలా బతుకుదాం అని వచ్చిన చంద్ర.. ఒకడిని కొట్టడంతో ఈమె లైఫ్‌లోకి ఓ రౌడీ గ్యాంగ్ వస్తుంది. దీంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. అక్కడి నుంచి చంద్ర లైఫ్ ఎలా టర్న్ అయింది. చివరకు ఏమైందనేదే తెలియాలంటే సినిమా చూడాలి.ఈ సినిమా ఫస్టాప్ అంతా ఎంగేజింగ్‌గా ఉంటుంది. హీరోయిన్‌కి ఉన్న సూపర్ పవర్స్, అందుకు తగ్గట్లు అక్కడక్కడ ఫైట్ సీక్వెన్స్ లు ఎంటర్టైన్ చేస్తాయి. సెకండాఫ్ మాత్రం కాస్త బోర్ కొడుతుంది. కానీ చివరకొచ్చేసరికి రెగ్యులర్ చిత్రాలతో పోలిస్తే ఓ డిఫరెంట్ సినిమా చూశామనే ఫీలింగ్ కలిగిస్తుంది. సాధారణంగా ఫిమేల్ సెంట్రిక్ కథలు అనగానే సింపతీనే చూపిస్తుంటారు. ఇందులో అణిచివేతకు ఎదురు నిలబడిన యోధురాలిగా చంద్ర పాత్రని ప్రెజెంట్ చేశారు.యక్షిణి పాత్ర గురించి మనం పురాణాల్లో విన్నాం. అయితే ఆ పాత్రని తీసుకుని సూపర్ హీరో తరహా స్టోరీగా మార్చడం.. బ్యాట్ మ్యాన్ టైపులో చూపించడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సినిమా మొత్తం చూసిన తర్వాత కథని పూర్తి చేయలేదేంటి అనే సందేహం వస్తుంది. అవును అదే నిజం. కేవలం చంద్ర పాత్ర తాలూకు బలాలు, బలహీనతలు చూపించారు. తర్వాత రాబోయే పార్ట్-2 చిత్రానికి లీడ్ వదిలారు. ఇందులో యాక్షన్‌తో పాటు కామెడీ కూడా ఉంది. అది కొన్నిచోట్ల వర్కౌట్ అయింది.ఎవరెలా చేశారు?కల్యాణి ప్రియదర్శిని ఇప్పటివరకు కమర్షియల్ పాత్రలు ఎక్కువగా చేసింది. ఇందులో చంద్ర అనే సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయిగా ఆకట్టుకుంది. ఫైట్స్ ఇరగదీసింది. చంద్ర వెంటపడే అమాయకమైన కుర్రాడిగా నస్లేన్ బాగా చేశాడు. అతడి ఫ్రెండ్స్‌గా చేసిన ఇద్దరు కుర్రాళ్లు కామెడీ బాగానే చేశారు. నాచియప్ప అనే విలన్ తరహా పాత్ర చేసిన శాండీ.. స్వతహాగా కొరియోగ్రాఫర్. కానీ యాక్టింగ్ కూడా బాగా చేశాడు. మిగిలిన వాళ్లు ఆకట్టుకున్నారు. ఇందులోనే 'కూలీ' ఫేమ్ సౌబిన్ షాహిర్, హీరోలు టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో అలా మెరిశారు.టెక్నికల్ అంశాలకొస్తే.. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవల్. రెడ్-బ్లూ కలర్స్‌ని ఉపయోగించిన విధానం బాగుంది. తెలుగు డబ్బింగ్ ఓకే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఈ సినిమాకి తగ్గట్లు ఉంది. డొమినిక్ అరుణ్.. దర్శకుడిగా కంటే రైటర్‌గా ఎక్కువగా ఆకట్టుకున్నాడు. చాలా తక్కువ బడ్జెట్‌తో తీసినా సరే ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉంది. కథలో మైథాలజీ ఉంది. కొత్త పాయింట్ ఉంది. దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు కూడా బాగుంది. రెగ్యులర్ రొటీన్ సినిమాలు కాదు ఏదైనా కొత్తగా చూద్దామనుకుంటే మాత్రం ఇది డోంట్ మిస్.- చందు డొంకాన