ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లో బీటెక్ ఫైనలియర్ విద్యార్థి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తుపల్లిలోని సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మెకానికల్ చివరి సంవత్సరం చదువుతున్న కొత్తపల్లి లక్ష్మీసాయి (23) గురువారం మధ్యాహ్నం హాస్టల్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడు దేలూరుపాడు మండలం రుద్రకోట గ్రామానికి చెందినవాడని తెలుస్తోంది. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.