ఆర్ఎస్ఎస్ రగడ.. పోలీసులకు గాయాలు
కొల్లాం: కేరళలో శివరాత్రి సందర్భంగా సోమవారం అర్థరాత్రి అల్లర్లు చెలరేగాయి. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, స్థానిక పోలీసులపై రెచ్చిపోయారు. సీఐ, ఎస్సై సహా అయిదురుగు పోలీసులపై భౌతిక దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
శివరాత్రి సందర్భంగా ఊరేగింపుగా వస్తున్న ఆర్ఎస్ ఎస్ ప్రచారక్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో స్థానిక ఆర్ఎస్ఎస్ నేతకు పోలీసులకు అతనికి మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో సదరునేతను అదుపులోకి తీసుకుని కొట్టార్కర పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్ఎస్ఎస్ నేత అనుచరులు కొంతమంది తమ నాయకుడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ దగ్గర బైఠాయించారు. పోలీసులు ప్రతిఘటించడంతో వారు మరింత రెచ్చిపోయారు. తమ వెంట తెచ్చుకున్న ఆయుధాలతో స్టేషన్ పై దాడికి దిగారు. అడ్డుకున్న పోలీసులపై తిరగబడి భౌతికంగా దాడికి పాల్పడ్డారు. దీంతో సీఐ, ఎస్సై సహా అయిదుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు . దీంతో పాటుగా మూడు వాహనాలను ద్వంసం చేశారు.