శిశు సంక్షేమ శాఖకు కొత్తరూపు
విభజనలో నాలుగు జిల్లాలకు 18 ప్రాజెక్టులు
మరికొన్ని అంగన్వాడీ సెంటర్ల ఏర్పాటు
కొన్ని కేంద్రాలు పక్క జిల్లాలకు..
డైరెక్టరేట్‌కు చేరిన ఉద్యోగుల జాబితా
హన్మకొండ చౌరస్తా : జిల్లాల పునర్విభజన నేపథ్యంలో భాగంగా ఉద్యోగులు .. ప్రాజెక్టులు.. సెంటర్ల.. విభజన ప్రక్రియపై మహిళా, శిశు సంక్షేమ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. వరంగల్ జిల్లా కేంద్రంగా ప్రస్తుతం 18 ప్రాజెక్టులు కొనసాగుతుండగా.. కొత్తగా ఏర్పాటుకానున్న వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలకు ప్రాజెక్టులు, సెంటర్ల పంపకాల నివేదికను జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు కార్యాలయం ఇటీవల ప్రభుత్వానికి అందజేసింది. తాజాగా ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయంలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల జాబితా, కంప్యూటర్లు, వాహనాలు, ఇతర వివరాలను డైరెక్టరేట్‌కు పంపించేందుకు నివేదికను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
వరంగల్ పీడీ పరిధిలో..
ప్రస్తుతం వరంగల్ పీడీ పరిధిలోని 18 ప్రాజెక్టుల్లో 4196 అంగన్వాడీ ప్రధాన సెంటర్లు, 327 మినీ సెంటర్లు కొనసాగుతున్నాయి. సీడీపీఓల పర్యవేక్షణలో అంగన్వాడీ సెంటర్లు కొనసాగుతున్నాయి. అయితే జిల్లాల విభజనలో భాగంగా కొన్ని అంగన్వాడీ సెంటర్లు సిద్ధిపేట, యాదాద్రి జిల్లాల్లోకి వెళ్తుండగా.. కరీంనగర్, ఖమ్మం జిల్లాల పరిధిలోని కొన్ని అంగన్వాడీ సెంటర్లు కొత్త జి ల్లాల్లో విలీనమవుతున్నాయి. దీంతో శిశు సంక్షేమ శాఖ భౌగోళిక స్వరూపం కొత్త రూపాన్ని సంతరించుకుంది. కాగా, కొత్తగా ఏర్పడనున్న నాలుగు జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్ల నియామకంలో ప్రస్తుతం సీడీపీఓలుగా కొనసాగుతున్న వారిలో సీనియారిటీ ప్రాతిపదికన ఇన్చార్జి పీడీ లు నియమించే అవకాశం ఉన్నట్లు శాఖలోని సీనియర్ ఉద్యోగులు చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం పీడీ ఆఫీస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను ఎవరిని ఏ జిల్లాకు పంపించాలనే అంశంపై డైరెక్టరేట్దే తుది నిర్ణయమని తెలుస్తుంది. ఈ శాఖ ద్వారా బాలింత, గర్భిణులు, చిన్నారులకు అందజేస్తున్న పౌష్టికాహారం, ఇతర సంక్షేమ పథకాలకు అంతరాయం కలుగకుండా విభజన ఉంటుందని పీడీ ఆఫీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ సెంటర్ల వివరాలివీ..
చేర్యాల ప్రాజెక్టు : దీని పరిధిలో ప్రస్తుతం చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, నర్మెట మండలాలు కొనసాగుతున్నాయి. విభజనలో చేర్యాల మండలంలోని 79 అంగన్వాడీ కేంద్రాలు, మద్దూరు మండలంలోని 52 మెయిన్, 2 మినీ కేంద్రాలు సిద్ధిపేట జిల్లాలో విలీనమవుతుం డగా, బచ్చన్నపేట మండలంలో నిర్వహిస్తున్న 50 అంగన్వాడీ కేంద్రాలు యాదాద్రి జిల్లాలోకి వెళ్లనున్నాయి. నర్మెట మండలంలోని 72 మె యిన్, 7 మినీ సెంటర్లు హన్మకొండ జిల్లాలో కొనసాగనున్నాయి.
చిట్యాల : ఈ ప్రాజెక్టు పరిధిలో చిట్యాల మండలంలోని 95 మెయిన్, 3 మినీ కేంద్రాలు, మొగుళ్లపల్లి మండలంలోని 66 మెయిన్, 1 మినీ, భూపాలపల్లి మండలంలోని 85 మెయిన్, 26 మినీ కేంద్రాలు భూపాలపల్లి జిల్లాలో కొనసాగనున్నాయి. వీటితోపాటు ప్రస్తుతం కరీంనగర్లో కొనసాగుతున్న మలహల్రావు, కాటారం, మహదేవపూర్, మహాముత్తారం మండలం భూపాలపల్లి జిల్లాలో విలీనం కానున్న తరుణంలో ఆయా మండలాల పరిధిలోని అంగన్వాడీ సెంటర్లు చిట్యాల ప్రాజెక్టులోనే కొనసాగనున్నాయి.
ఏటూరునాగారం : ఈ ప్రాజెక్టు పరిధిలోని ఏటూరునాగారం మండలంలోని 96 మెయిన్, 6 మినీ కేంద్రాలు, తాడ్వాయి మండలంలోని 68 మెయిన్, 2 మినీ కేంద్రాలు భూపాలపల్లి జిల్లాలో కొనసాగనున్నాయి.
డోర్నకల్ : ఈ ప్రాజెక్టు పరిధిలోని డోర్నకల్ మండలంలోని 97 మెయిన్, 11 మినీ కేంద్రాలు కురవి మండలంలోని 110 మెయిన్, 12 మినీ సెంటర్లు మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతుండగా.. కొత్తగా ఖమ్మం జి ల్లాలోని గార్ల మండలంలోని సెంటర్లు ఇదే ప్రాజెక్టు పరి ధిలో మహబూబాబాద్ జిల్లాలో విలీనం కానున్నాయి.
గూడూరు : ఈ ప్రాజెక్టులోని గూడూరు మండలంలోని 106 మెయిన్, 20 మినీ కేంద్రాలు, కొత్తగూడ మండలంలోని 82 కేంద్రాలు మహబూబాబాద్జిల్లాలో విలీనంకాగా..ఖానాపురం మండలంలో కొనసాగుతున్న43 మె యిన్, 2మినీ కేంద్రాలు వరంగల్ జిల్లాలో కొనసాగనున్నాయి.
హన్మకొండ : ఈ ప్రాజెక్టులోని హన్మకొండ మండలంలోని 77 మెయిన్, 4 మినీ కేంద్రాలు నూతనంగా ఏర్పడనున్న హన్మకొండ జిల్లాలో విలీనం కానుం డగా.. ప్రస్తుతం ఇదే ప్రాజెక్టు పరిధిలో కొనసాగుతున్న హసన్‌పర్తి మండలంలోని 76 మెయిన్, 2 మినీ సెంటర్లు ఆత్మకూరు మం డలంలోని 78 మెయిన్, 3 మినీ అంగన్వాడీ సెంటర్లు, గీసుగొండ పరిధిలోని 68 మెయిన్, 2 మినీ సెంటర్లు వరంగల్ జిల్లాలో కొనసాగనున్నాయి. వీటికి తోడు కొత్తగా హన్మకొండ ప్రాజెక్టులో హుజురాబాద్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల పరిధిలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలు విలీనం కానున్నాయి.
జనగామ : దీని పరిధిలోని జనగామ మండలంలోని 75 మెయిన్, 4 మినీ కేంద్రాలు లింగాలఘణపురంలోని 48 మెయిన్, 4 మినీ సెంటర్లు యాదాద్రి జిల్లాలోకి, రఘునాథపల్లి మండలంలోని 74 మెయిన్, 5 మినీ కేంద్రాలు హన్మకొండ జిల్లాలో కొనసాగేలా అధికారులు ప్రతిపాదించారు.
కొడకండ్ల : ఈ ప్రాజెక్టు పరిధిలోని కొడకండ్ల మండలంలోని 69 మెయిన్, 6 మినీ సెంటర్లు, పాలకుర్తిలోని 63 మెయిన్, 8 మినీ సెంటర్లు, దేవరుప్పల మండలంలోని 62 మెయిన్, 1 మినీ సెంటర్ హన్మకొండ జిల్లాలో కొనసాగనున్నాయి.
మహబూబాబాద్ : కొత్త జిల్లాగా ఏర్పాటుకానున్న మహబూబాబాద్ ప్రాజెక్టు పరిధిలోని మహబూబాబాద్ మండలంలోని 160 మెయిన్, 7 మినీ సెంటర్లు, నెల్లికుదురులోని108 మెయిన్, 12 మినీ సెంటర్లు, కేసముద్రంలోని 93 మెయిన్ 9 మినీ సెంటర్లు ఈ జిల్లాలోనే కొనసాగునున్నాయి.
మంగపేట : మంగపేట ప్రాజెక్టులోని మంగపేట మండలంలో కొనసాగుతున్న 103 మెయిన్,1 మినీ కేంద్రాలను భూపాలపల్లి జిల్లాలో విలీనం చేయనున్నారు.
మరిపెడ : ఈ ప్రాజెక్టులోని మరిపెడ మండలంలోని 174 మెయిన్ 17 మినీ సెంటర్లు, నర్సింహులపేటలోని 95 మెయిన్, 9 మినీ సెంటర్లు, తొర్రూర్ మండల పరిధిలోని 94 మెయిన్, 14 మినీ కేంద్రాలు మహబూబాబాద్ జిల్లాలో కొనసాగనున్నాయి.
ములుగు : ఈ ప్రాజెక్టు పరిధిలోని ములుగు మండలంలోని 76 మెయిన్, 18 మినీ అంగన్వాడీ సెంటర్లు, గణపురం మండలంలోని 41 మెయిన్, 10 మినీ సెంటర్లు, గోవిందరావుపేట మండలంలోని 48 మెయిన్, 6 మినీ కేంద్రాలు, వెంకటాపూర్ మండలంలోని 47 మెయిన్, 11 మినీ కేంద్రాలను భూపాలపల్లి జిల్లాలో కొనసాగేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
నర్సంపేట : ఈ ప్రాజెక్టు పరిధిలోని నర్సంపేట మండలంలోని 56 మెయిన్,1 మినీ కేంద్రాలను, నల్లబెల్లి మండలంలోని 55 మెయిన్, 2 మినీ కేంద్రాలను, దుగ్గొండిలోని 48 మెయిన్, 1 మినీ కేంద్రాన్ని, చెన్నారావుపేట మండలంలోని 74 మెయిన్, 3 మినీ కేంద్రాలను, నెక్కొండలోని 55 మెయిన్, 2 మినీ కేంద్రాలను వరంగల్ జిల్లాలో కలుపనున్నారు.
పరకాల : దీని పరిధిలోని పరకాల మండలంలోని 100– 1 సెంటర్లు, శాయంపేటలోని 58 అంగన్వాడీ సెంటర్ల ను వరంగల్ జిల్లాలో,రేగొండ మండలంలోని 80 మెయి న్,1మినీకేంద్రం భూపాలపల్లి జిల్లాలో కొనసాగనున్నాయి.
స్టేషన్‌ఘన్‌పూర్ : ఈ ప్రాజెక్టులోని స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని 107 మెయిన్, 7 మినీ కేంద్రాలు, ధర్మసాగర్‌లోని 94–1 కేంద్రాలు, జఫర్గడ్ మండలంలోని 70 కేంద్రాలతో పాటు వేలేరు, చిల్పూరు మండల కేంద్రాల పరిధిలో కొనసాగే అంగన్వాడీ సెంటర్లను హన్మకొండ జిల్లాలో కొనసాగనున్నాయి.
వరంగల్ అర్బన్–1 : ఈ పాజెక్టు పరిధిలోని వరంగల్ మున్సిపల్లోని 100 కేంద్రాలను వరంగల్ జిల్లాలో, హన్మకొండ మున్సిపల్ కార్పొరేషన్లో కొనసాగుతున్న 71 కేంద్రాలు హన్మకొండ జిల్లాలో కొనసాగున్నాయి. కొత్తగా వరంగల్ జిల్లాలో ఖిలావరంగల్ మండల కేంద్రాలు, హన్మకొండ జిల్లాలో కాజీపేట మండలంలోని అంగన్వాడీ సెంటర్లు విలీనం కానున్నాయి.
వరంగల్అర్బన్–2 : ఈ ప్రాజెక్టులోని వరంగల్ మున్సిపల్లో ఉన్న 100 సెంటర్లు వరంగల్ జిల్లాలో, హన్మకొండ మున్సిపల్లోని 60 సెంటర్లు హన్మకొండ జిల్లాలో కొనసాగుతాయి.
వర్ధన్నపేట : వర్ధన్నపేట ప్రాజెక్టులోని వర్ధన్నపేట మండలంలోని 73 మెయిన్, 12 మినీ సెంటర్లు, సంగెం మండలంలోని 55 మెయిన్, 8 మినీ సెంటర్లు, పర్వతగిరి మండలంలోని 52 మెయిన్, 15 మినీ కేంద్రాలు వరంగల్ జిల్లాలో కొనసాగుతుండగా.. రాయపర్తి మండలంలోని 58 మెయిన్, 28 మినీ కేంద్రాలు హన్మకొండ జిల్లాలో కొనసాగనున్నాయి.