ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిపై దాడి
వరంగల్ : వరంగల్ జిల్లా పరకాల మండలం కౌకుండలో ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడి ఇంటిపై యువతి కుటుంబ సభ్యులు గతరాత్రి దాడి చేశారు. రెండు ఇళ్లకు నిప్పు పెట్టారు. గత కొంతకాలంగా యువకుడు ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్నాడు. అయితే యువతి అందుకు నిరాకరించి, విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దాంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డాడు. కాగా యువతి కుటుంబ సభ్యుల దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.