బిరియాని కోసం 42 బస్సులకు నిప్పు!
బెంగళూరు: కావేరి జలాల గొడవ సందర్భంగా నగరంలో సెప్టెంబర్ 12న తమిళనాడుకు చెందిన కేపీఎన్ ట్రావెల్స్ బస్సుల్ని తగులబెట్టిన ఘటనలో భాగ్య(22) అనే యువతితోపాటు 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బస్సులకు నిప్పుపెట్టేలా భాగ్య తనతోపాటు ఉన్న వారిని ప్రేరేపించినట్లు అనుమానిస్తున్నారు. ఘటనలో 42 బస్సులు కాలి బూడిదయ్యాయి. మటన్ బిరియాని, రూ.100 ఇస్తామని చెప్పి భాగ్యను నిరసనకారులు ఆందోళనకు పిలుచుకెళ్లారని ఆమె తల్లి చెప్పారు. అల్లరిమూక కేపీఎన్ సిబ్బందిపైనా డీజిల్ పోసి చంపేస్తామని బెదిరించడంతో వారేమీ చేయలేక, విధ్వంసం మొత్తాన్ని మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. వీడియోల్ని పరిశీలించిన పోలీసులు నిందితులను గుర్తించారు.