KR Vijaya
-
అప్పట్లోనే సొంతంగా హెలికాప్టర్ కొన్న ఏకైక హీరోయిన్ కేఆర్ విజయ.. ఇప్పుడెలా ఉందంటే!
సీనియర్ నటి కేఆర్ విజయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో స్టార్ హీరోయిన్గా రాణించిన ఆమె దేవత పాత్రలతో ఎక్కువగా గుర్తింపు పొందారు. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆమె దివంగత నటుడు సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరావు లెజెండ్స్‌తో పాటు సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు వంటి అగ్ర నటుల సరసన నటించి మెప్పించారు. స్టార్ నటిగా కొనసాగుతున్న క్రమంలోనే ఓ బడా వ్యాపావేత్తనుపెళ్లి చేసుకున్న ఆమె బాగా సెటిలైపోయారు. చదవండి: అప్పుడు విష్ణుకు సన్నిహితంగా.. ఇప్పుడు మనోజ్ అనుచరుడిగా.. అసలు ఎవరీ సారథి? భర్త చనిపోవడంతో కూతురితో కలిసి చెన్నైలో నివసిస్తున్న కేఆర్ విజయ గతంలో ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించింది. తాజాగా ఆమె పాత వీడియో మరోసారి వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా తన గురించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. కాగా పెళ్లి అనంతరం ఓ మహారాణిలా లైఫ్ లీడ్ చేసిన ఆమె వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారట. అప్పట్లోనే ఆమెకు సొంతంగా హెలికాప్టర్ ఉండేదని, దానిని ఆమె భర్తే నడిపేవారని చెప్పారు. కేరళ, హైదరాబాద్, తమిళనాడు ఇలా ఎక్కడ సినిమా షూటింగ్స్ ఉన్నా సొంత హెలికాప్టర్లోనే ప్రయాణించేవారట. చదవండి: స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం అప్పట్లో ఏ హీరో కూడా సొంత హెలికాప్టర్ లేకపోవడం గమనార్హం. ఆమె భర్తకు వివిధ రకాలు బిజినెస్ ఉండేవని, ఈ క్రమంలో మద్రాస్ సమీపంలో ఏకంగా 67 ఎకరాలు తోట కోనుగోలు చేసినట్లు చెప్పారు. అంతేకాదు ఆమె రాజభవనం లాంటి లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నారట. దీనిపై హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేదని అప్పట్లో విజయ రాజా వైభోగం గురించి ఇండస్ట్రీలో అంతా చర్చించుకునేవారట. ఇంటిలో స్విమ్మింగ్ పూల్తో పాటు.. అన్ని రకాల వసతులు ఉండేవట. ఆమె ఇంటిలోని లగ్జరీ వసతులు చూసి అప్పట్లోని స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోయేవారట. ఇక తన భర్త మరణాంతరం బిజినెస్ వ్యవహారాలను కొంతకాలం పాటు ఆమె చూసుకున్నారట. ప్రస్తుతం వ్యాపారాలను తన కూతురు చూసుకుంటున్నట్లు కేఆర్ విజయ తెలిపారు. -
చిత్రసీమ
సృజన.. సృష్టిలో చిత్రాలన్నిటినీ పోగేసేదాకా ఊరుకోదు. కన్వాస్, బ్రష్ రెస్ట్ తీసుకుంటే కంప్యూటర్, ఫొటోషాప్ వర్క్ మోడ్‌లోకి వెళ్తాయి. సాంస్కృతిక పునరుజ్జీవన కాలానికి, ‘పెరియారుమ్ పెరుమాళ్’ సినిమా పోస్టర్‌కు ముడి పెడ్తాయి. విన్సెంట్ వాంగో ప్రపంచ ప్రఖ్యాత పెయింటింగ్ ‘‘వీట్ ఫీల్డ్ విత్ సైప్రెసెస్’లో అమాయకమైన చిరునవ్వుతో సిల్క్‌స్మిత ప్రత్యక్షమవుతుంది. ఎడ్వర్డ్ మూంక్ ‘ది స్క్రీమ్’కి ‘అధే కంగళ్’ సినిమా జతకూడుతుంది. కత్సుషిక హొకుసై వేసిన ‘ది గ్రేట్ వేవ్ ఆఫ్ కనగవా’’లోకి ‘ఉలగమ్ సుట్రుమ్ వాలిబన్’ హీరో ఎమ్జీ రాంచంద్రన్ దూరిపోతాడు. ఎడ్వర్డ్ హోపర్ ‘ఆటోమాట్’ ముందు వెటరన్ నటి కేఆర్ విజయ ప్రత్యక్షమవుతారు చేతిలో టీ కప్పుతో. ఇలా ఆ కాలం చిత్రాలతో బయోస్కోప్ బొమ్మలను జత చేసి విచిత్రాలు చేస్తున్న ఆ ఆర్టిస్ట్ పేరు చార్ల్స్ బ్రిటో. చైన్నై కుర్రాడు. ఇంజనీరింగ్ చదివాడు. సినిమా ఫీల్డ్‌లో కెరీర్ వెదుక్కున్నాడు. ‘రెవలేషన్స్’ అనే ఇండీ, తమిళ్ సినిమాతోపాటు కొన్ని షార్ట్ ఫిల్మ్స్కీ పనిచేశాడు. ఆర్ట్ మీదున్న ఆసక్తితో తర్వాత జేఎన్‌యూలోని ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్తటిక్స్‌లో మాస్టర్స్ చేశాడు. ఓ వైపు సినిమాలకు పనిచేస్తూనే ఇలా మాష్ అప్ ఆర్ట్‌తో మ్యాజిక్స్ చేస్తున్నాడు. ‘‘మాష్ అప్‌కి నేనేం కొత్తకాదు. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో చాలా మంది ఆర్టిస్ట్‌లు మాష్ అప్ చేస్తున్నారు. నేనైతే ‘తబ్రేజ్’ వర్క్స్‌తో ఇన్స్పైర్ అయ్యా. ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాను కూడా. తబ్రేజ్ వర్క్స్‌ని బయట కొనుక్కుంటున్నారు కూడా. నాకూ అలాంటి రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. వాళ్ల పర్సనల్ ఫొటోగ్రాఫ్స్‌ని ఇలా వరల్డ్ ఫేమస్ పెయింటింగ్స్‌తో మాష్ అప్ చేసి ఇవ్వమని. సో.. నేను కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నాను’’ అంటున్నాడు చార్ల్స్ . ఒక దర్శకుడైతే ఏకంగా మూడువందల మాష్ అప్స్ చేసివ్వమని అడిగాడట. ‘‘నా మాష్ అప్స్‌కి వచ్చిన డిమాండ్ నాకే ఆశ్చర్యంగా ఉంది. అందుకని ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కూడా తెరిచా. ఫొటోగ్రాఫర్స్, సినిమా డైరెక్టర్స్ నుంచి ఒకటే కాల్స్ వస్తున్నాయి’’ అని చెప్పాడు చార్ల్స్ బ్రిటో. చెప్పినట్టుగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ మాష్ అప్స్ అన్నీ వైరల్ అవుతున్నాయట. -
చీమలు నడుస్తుంటే రాళ్లే అరిగిపోతాయి!
సి.పుల్లయ్య దర్శకత్వంలో ఎన్టీ రామారావు నందివర్ధన మహారాజుగా, కేఆర్ విజయ చిత్రలేఖగా, చిత్తూరు నాగయ్య గురువుగా, ఛాయాదేవి ఆనందంగా, పద్మనాభం, అల్లురామలింగయ్య, సారథి....శిష్యుల పాత్రలలో నటించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. ఈ సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ఎప్పుడూ కలిసికట్టుగా ఉండని, ఒక మాటమీద నిలబడని శిష్యులు ఆరోజు కలిసికట్టుగా, ఐకమత్యంగా భోరుమంటున్నారు. గురువుగారు ఆందోళనగా అక్కడికి వచ్చారు. ‘‘ఏం జరిగిందిరా?’’ ఏడుపు.....! ‘‘ఏం జరిగిందో చెప్పండ్రా!!’’ మళ్లీ ఏడుపు...!! గురువుగారి సహనం నశించింది. ‘‘ఏడ్చాకయినా చెప్పండి...చెప్పాకయినా ఏడవండి’’ అని గద్దించాడు. మళ్లీ ఏడుపు...!!! ‘‘ఒరేయ్ ఫణీ, నువ్వయినా చెప్పి తగలడరా’’ అడిగారు గురువుగారు కాస్త దీనంగా. ఫణి నోరు విప్పాడు: ‘‘మాలో ఒకరు ఏట్లో పడి కొట్టుకుపోయారు...’’ ‘‘కొట్టుకుపోవడం ఏమిటీ నీ బొందా!’’ తిట్టారు గురువుగారు. ఎందుకంటే తన ఏడుగురు శిష్యులూ నిక్షేపంలా కళ్లెదుటే కనిపిస్తున్నారు! ఫణి లెక్కించడం మొదలుపెట్టాడు... ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, ఆరు....‘‘అయ్యో! ఆరు మందే ఉన్నారు. ఒకడు ఏట్లో కొట్టుకుపోయాడు’’ అని ఘొల్లుమన్నాడు ఫణి. అతనికి కోరస్ ఇచ్చారు మిగిలిన వాళ్లు. ‘‘ఒరేయ్ వాజమ్మా....మొదట నిన్ను నీవు లెక్కించు...ఆ తరువాత తక్కిన వారిని లెక్కించు’’ అని చెప్పారు గురువుగారు. ‘‘అలాగే గురువుగారు’’ అని మళ్లీ లెక్కించడం మొదలుపెట్టాడు.... ‘‘ఒక్కటీ....రెండూ....ఆరూ...ఏడూ....ఎనిమిది...అయ్యో....ఎనిమిది మంది ఉన్నారు’’ అని మళ్లీ ఏడ్వడం మొదలు పెట్టాడు శిష్యుడుగారు. ఈసారి ఫణి తన తోటి విద్యార్థులనే కాకుండా గురువుగారిని కూడా లెక్క వేశాడు! ‘‘ఇవ్వాళ భోజనం కాస్త బరువైందిరా విశ్రమిస్తాను’’ అన్నారు గురువుగారు. ‘‘అలాగే గురువుగారు, మీకు పరుపు వేస్తాం. కాళ్లు కూడా పడతాం’’ అన్నారు శిష్యులు. పరుపు వేశారు. గురువుగారు విశ్రమించి నిద్రలోకి జారుకున్నారు. గురువుగారి కాళ్లు పట్టడం దగ్గర ఇద్దరు శిష్యులకు తగాదా మొదలైంది. ‘‘ఈ కాలు నాది’’ ‘‘కాదు నాది’’ ‘‘నా కాలు బంగారు కాలు...నీ కాలు ఇత్తడి కాలు’’ ‘‘ఒరేయ్ నీ కాలే ఇత్తడి....నా కాలు బంగారం’’ ‘‘నా కాలు జోలికి వస్తే నీ కాలు మునక్కాయలా నరికేస్తా’’ ‘‘నా కాలు జోలికి వస్తే నీకు నరకం చూపిస్తా....పచ్చడి పచ్చడి చేస్తా’’గురువు గారి రెండు కాళ్లును చెరొకటి పంచుకున్న శిష్యులు ఒకరి మీద ఒకరు సవాలు విసురుకున్నారు. కారాలు మిరియాలు నూరారు. ఆ తరువాత.... ‘‘నా కాలు జోలికి వస్తావా? నీ కాలిని ఏం చేస్తానో చూడు’’ అంటూ ఒకడు పెద్ద సుత్తి పట్టుకొచ్చాడు. ‘‘నా కాలు జోలికి వస్తావా? నీ కాలిని ఏంచేస్తానో చూడు’’ అంటూ మరొకడు పెద్ద రాయి పట్టుకొచ్చాడు.అలికిడికి చప్పున మేల్కొన్నారు గురువుగారు. ‘‘అయ్యో...మీకేం వచ్చిందిరా....ఒరేయ్... నా కాళ్లు నరికేస్తార్రా...’’ భయపడిపోయారు గురువుగారు. ‘‘వాళ్ల కాళ్లు వాళ్లే నరికేసుకుంటే అనుభవిస్తారు’’ అన్నాడు ఒక శిష్యుడు పెద్దరికంగా! (వాళ్ల కాళ్లా పాడా! అవి గురువుగారి కాళ్లు అయితేనూ) ఈ హడావిడి అంతా చూసి గురువుగారి ధర్మపత్ని పరుగెత్తుకు వచ్చి...‘‘ఒరేయ్...ఒరేయ్...మీకేం వచ్చిందిరా పోయే కాలం....ఏమిట్రా ఈ ఘోరం’’ అంటూ గట్టిగా అరిచింది.‘‘గురుసేవ అండీ’’ అన్నాడు ఒకడు.‘‘మిమ్మల్ని తగలెయ్య...నిష్కారణంగా ఆయన ప్రాణాలు తీసేటట్టు ఉన్నారు’’ అన్నది గురుపత్ని.‘‘హమ్మయ్య బతికానురా బాబూ....నువ్వు రావడానికి ఒక క్షణం ఆలస్యమై ఉంటే నా కాళ్లు తీసేసి ఉండేవాళ్లు’’ అన్నారు గురువుగారు.‘‘వీళ్ల చేతులు విరిగిపోనూ.... ఎలా కొట్టేశారండీ’’ అన్నది భర్త కాళ్ల వైపు చూస్తూ.ఆ కోపంలోనే...‘‘ఇలాంటి బుద్ధిహీనులు ఇంట్లో ఎందుకు...తరిమేయండి బయటికి’’ అని అరిచింది.గురువుగారి ముఖంలో మాత్రం మచ్చుకు కూడా కోపం కనిపించలేదు.అదే శాంతం!‘‘వాళ్లు బుద్ధిహీనులని నాకు తెలుసునే. అందుకే ఇంత ముద్ద పడేస్తున్నాం. లేకపోతే వాళ్లు ఎక్కడికి పోగలరు! ఎలా బతకగలరు చెప్పు!’’ అన్నారు గురువుగారు శాంతంగా. ‘‘చాల్లే ఊరుకుందురూ...మీ చాదస్తంగానీ ఈ మూర్ఖులకు చదువొస్తుందా!’’ అన్నది గురుపత్ని మూతి తిప్పుతూ.‘‘చీమలు నడుస్తుంటే రాళ్లే అరిగిపోతాయి ఆనందం. ఒకొక్క ముక్కే నేర్చుకుంటారు పాపం. పోన్లెద్దూ. మనకు మటుకు ఎవరు ఉన్నారు చెప్పు! ఒక్క ఆడపిల్లే కదా. ఇలాంటి అమాయకులకు కాస్త అన్నం పెడితే ఎంత పుణ్యమో తెలుసా!’’ అన్నారు గురువుగారు.గురువుగారి మాటలతో కాస్త శాంతించింది ఆనందం.ఇంతలో... ఒక పాము సర్రుమని వెళుతుంది!‘‘పాము...పాము’’ అని అరిచింది గురుపత్ని.‘‘చూశావా....చూశావా...వాళ్లు కొడితే కొట్టారుగానీ ఈ వేళ నా ప్రాణం కాపాడారు ఆనందం. వాళ్ల గందరగోళానికి భయపడి ఆ పాము ఇంతవరకు బయటకు రాలేదుగానీ, లేకపోతే ఈపాటికి నీ గతేం కాను నా గతేం కాను చెప్పు!’’ అన్నారు గురువుగారు.‘‘అవునండీ, వాళ్ల తెలివి తక్కువపనితో ఒక విధంగా మనకు ఉపకారం చేశారు’’ అన్నది ఆనందం. -
నీ చరణమ్ములే నమ్మితినమ్మ!
చెట్టుకు ఉన్న పూలు అందంగా కనిపిస్తాయి. పూలగుత్తిలోని పూలు పొందికగా కనిపిస్తాయి. దండలో ఉన్న పూలు గౌరవంగా కనిపిస్తాయి. తోరణంలోని పూలు సంస్కృతులుగా కనిపిస్తాయి. అమ్మవారి చరణాల చెంత పూలు అశీస్సులుగా కనిపిస్తాయి. కె.ఆర్.విజయ పోషించిన పాత్రలన్నీ.. అమ్మవారి చరణాల దగ్గరి పూలే! మీ జీవితాన్ని ఆధ్యాత్మికత అనుభవాలతో మేళవించితే ఏమనిపిస్తోంది? కేఆర్‌విజయ: ఎలాంటి ప్రాథమిక అర్హతలు లేకుండా సినీరంగంలో ప్రవేశించడం దైవ ప్రేరణే అనిపిస్తుంది. కొంచెం వివరంగా చెబుతారా? నాన్నది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా, అమ్మది కేరళ రాష్ట్రంలోని ట్రిచూరు. నేను ట్రిచూరులోనే పుట్టాను. నాన్న ఆంధ్రాలో రెండు, మూడు క్లాసులు చదివించారు, ఆ తరువాత అమ్మ కేరళకు తీసుకెళ్లింది. అక్కడ కొన్ని తరగతులు చదివాను. తరువాత కేరళలోనే ఉండిపోయాను. ప్రా«థమిక విద్యదశలోనే నన్ను డ్రామాల్లో చేర్పించారు. నటిగా స్టేజీపైనే నా కెరీర్ స్టార్ట్ అయింది. తరువాత తమిళసినిమాల్లోకి ప్రవేశించాను. జన్మతః తెలుగు, మలయాళంకు చెందిన నేను తమిళ సినీ పరిశ్రమలో స్థిరపడటం దైవ సంకల్పమే! ఎందుకంటే నాకు చదువు లేదు,పెద్దగా లోకజ్ఞానం కూడా తెలియనిదాన్ని. కానీ, పెద్దనటిగా పేరు తెచ్చుకున్నాను. సినిమా జీవితం నాకొక స్కూల్. చదువులే కున్నా పరిశ్రమలో మంచి పేరు ప్రతిష్ఠ దక్కింది. సినిమాల్లోకి రావడానికి కారణం తల్లిదండ్రులే, అయినా నన్ను సినిమాల్లో చేర్పించాలనే ఆలోచన వారిలో కల్పించినవాడు దేవుడు. అందుకే నా జీవితం దైవ ప్రేరణ అంటాను. మిమ్మల్ని తల్లిదండ్రులే సినిమాలోకి తీసుకొచ్చారంటే మీ కుటుంబంలో సినీ నేపథ్యమేమైనా ఉందా ? అదే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నాన్న తన స్కూల్ లైఫ్‌లో ఉండగా ఎంకే రాధ వారి కంపెనీలో నాటకాలు వేసేవారట, తరువాత ఆర్మీలో చేరారు. రెండవ ప్రపంచ యుద్దంలో మా నాన్నగారు పాల్గొన్నారు. అమ్మఐదుగురు సోదరులు కూడా ఎయిర్‌ఫోర్సు, మిలిటరీలలో ఉన్నతాధికారులు. అమ్మవైపు, నాన్న వైపు ఎవరికీ సినీ నేపథ్యం లేదు. నేను సినిమానటిని కావడం దైవకృప. జీవితంలో ఎదిగిన తరువాత ఇలాంటి వేదాంత ధోరణి అలవడిందా ? ఆధ్యాత్మిక భావన చిన్ననాటి నుండే అలవడింది. అమ్మ, అమ్మమ్మ, తాతలది ఎంతో సంప్రదాయ కుటుంబం. ఇంట్లో నిత్యదేవతారాధనలు, పూజలు పునస్కారాలు క్రమం తప్పకుండా కొనసాగేవి. మీరు, మీ కుటుంబం నిత్యం ఏ దేవుడిని కొలుస్తారు? మా వారు వెలాయుధన్ నాయర్ బిజినెస్‌మేన్‌గా మంచి పేరున్న వ్యక్తి. కూతురు హేమలత. కిందటేడాది నా భర్త అనారోగ్యంతో మరణించారు. మా ఇంట్లో అప్పుడూ ఇప్పుడూ అమ్మవారు, మురుగన్‌ని ఎక్కువగా కొలుస్తాం. అమ్మవారి కొడుకే కదా మురుగన్. ఏ బాధ కలిగినా, సంతోషమైనా అమ్మవారితోనే చెప్పుకుంటాను. అమ్మవారు అంటే ఎందుకంత ఇష్టం ? నా పన్నెండేళ్ల్ల వయస్సులో అమ్మ, అమ్మమ్మలతో కలిసి ప్రతి రోజు అమ్మవారి గుడికి వెళ్లేదాన్ని. అలా అమ్మవారితో ఒక అనుబంధం ఏర్పడింది. అక్కడే శ్రీకృష్ణుడినీ కొలిచేవాళ్లం. సహజంగా అన్ని దేవుళ్లను కొలుస్తాను. ఏదైన సమస్యలు వచ్చినపుడు ‘విఘ్నేశ్వరా... మురుగా..’ అని ప్రార్థించడం అలవాటు. సినిమాల్లో అమ్మవారి పాత్ర అంటే చాలు మీరే గుర్తుకు వస్తారు. అమ్మవారి పాత్రలకు మిమ్మల్నే ఎక్కువగా ఎన్నుకోవడం, ప్రసిద్ది చెందడం ఎలా జరిగింది? తెలుగులో నా తొలి పౌరాణిక పాత్ర శ్రీకృష్ణపాండవీయం. ఎన్టీఆర్ గారు స్వయంగా అడిగారు, ఆ సినిమాలో రుక్మిణి పాత్ర వేశాను. సరిగ్గా అదే సమయంలో తమిళంలో కందన్ కరుణై అనే చిత్రంలో మురుగన్ భార్య దేవనాయగి పాత్ర వేసాను. ‘అమ్మవారి పాత్రలో మీరు చాలా బావుంటార’ని అందరూ చెబుతుండేవారు. దీంతో నిర్మాత, దర్శకులు సైతం అమ్మవారి పాత్రలకు నన్నే తీసుకునేవారు. అమ్మవారిని కొలిచే పరమభక్తులు మీరు. అమ్మవారి పాత్రలు వేసేటపుడు మీ అనుభూతి ఎలా ఉండేది ? చాలా సంతోషంగా ఉండేది. అంతటి ఉన్నతమైన పాత్రకు నన్ను ఎన్నుకోవడం అమ్మవారి కృపే. మేకప్ వేసుకున్నప్పటి నుండి తిరిగి తీసే వరకు మనస్సు చాలా ప్రశాంతంగా ఉండేది. ఆ అమ్మే నాలో కొలువై ఉందా అనిపించేది. అదో అనిర్వచనీయమైన అనుభూతి... మాటల్లో చెప్పలేనిది. అమ్మవారి పాత్రలకు ఏదైనా తర్ఫీదు, జాగ్రత్తలు.. వంటివి తీసుకునేవారా ? అమ్మవారి పాత్రల షూటింగ్‌కు వెళ్లేముందు పూజాగదిలోకి వెళ్లి దణ్ణం పెట్టుకునేదాన్ని. ఆ సమయంలో దేవుని గదిలోని ఫొటోలో అమ్మవారు ఎలా నిలుచుని ఉన్నారు, ఆ ముఖాలలో హావభావాలు ఎలా ఉంటాయో గమనించేదాన్ని. అలాగే, మనసుకు బాధ కలిగించే ఏ ఆలోచనలు పెట్టుకోకుండా, ముఖ్యంగా టెన్షన్ లేకుండా వెళతాను. అమ్మవారి పాత్రల్లో ఒదిగిపోవాలంటే ప్రశాంతమైన ముఖవర్చస్సు ముఖ్యం. దాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలా జాగ్రత్తపడతాను. ప్రతి ఒక్కరికీ ఏదో సమస్య ఉంటుంది. కానీ, నటిగా మేకప్ వేసుకోగానే ఆ సమస్యలన్నింటినీ మూటగట్టి మూలన పడేస్తాను. మేకప్ తీయగానే మళ్లీ ఆ ఆలోచనలన్నీ మైండ్లోకి వచ్చేస్తాయి. (నవ్వుతూ) ఇప్పటి వరకు అమ్మవారి పాత్రలు ఎన్నివేశారు ? అస్సలు గుర్తులేదు. నటిగా భవిష్యత్తు, వర్తమానం గురించే ఆలోచించేదానిని. ఇంకా మంచి పాత్రలు వేయాలి, ప్రేక్షకులను మెప్పించాలనే ఆలోచనే ఇప్పటికీ ఉంటుంది. గతంలో ఏమి జరిగింది, ఏ పాత్రలు వేశాను అని ఆలోచించేందుకు టైమ్ దొరికేది కాదు. మంచైనా, చెడైనా ఓకే అని ముందుకు సాగిపోవడమే నా అలవాటు. అమ్మవారి పా్రత్రలతో పేరొందిన తరువాత నటిగా బాహ్యప్రపంచంలో ఏదైనా అనుభవం ఉందా? ఒక్కటేమిటి ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా నా పట్ల ప్రేక్షకుల్లో అభిమానంతోపాటూ గౌరవమూ పెరిగింది. జనంలోకి ఎవరైనా వెళితే జరగండి.. జరగండి అని తోసేస్తారు, కానీ నన్ను రండి..రండి అంటూ దారిచ్చి ఆహ్వానించేవారు. సినీ నటి వస్తోందని సహజంగా ఎగబడి దూసుకు వచ్చే పరిస్థితులు కాకుండా ఎక్కడికి వెళ్లినా గౌరవంగా వ్యవహరించేవారు. ఇక ఆలయాల్లోకి వెళితే అమ్మవారే వచ్చిందన్నట్లుగా అక్కడి పెద్దలు దగ్గరుండి దర్శనభాగ్యం కల్పించేవారు. ఇటీవల ధర్మస్తలికి పోయినపుడు ఒక వృద్ధురాలు వచ్చి ‘అమ్మా, మిమ్మల్ని రోజూ గర్భగుడిలో చూస్తుంటాను, ఈరోజు నేరుగా చూస్తున్నాను’ అంటూ అక్కున చేర్చుకున్నారు. ఇలా అనేక గౌరవాలను ఇచ్చాయి అమ్మవారి పాత్రలు. ఇలాంటి గౌరవాలు రావాలని నేనేమీ ప్రయత్నాలు చేయలేదు, అదంతా నా అదృష్టం. అమ్మవారి భక్తురాలిగా అంతకంటే ఏం కావాలి. బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ? నా భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు తిరుమలకు వెళ్లాలని కోరాడు. కారులో తిరుమలకు వెళ్లాం. కొండపై మండుటెండ. నా చీర కొంగు ఆయన తలపైన వేసి ఎండలో, బారులు తీరిన క్యూలో నడిపించాను. క్యూలైన్లలో అవస్థలు పడ్డాం. ఒకనాడు తిరుమలకు వెళ్లినపుడు సకలమర్యాదలు చేసి దర్శనం కల్పించిన టీటీడీ సిబ్బంది నా భర్తతోపాటు వృద్ధాప్య దశలో కొండపైకి వెళితే ఎవ్వరూ నన్ను తెలియనట్లుగా వ్యవహరించడం బాధనిపించింది. అమ్మవారిని అంతగా పూజించే మీకు కష్టాలు వచ్చినపుడు ఎలా అనిపించేది ? కష్టాలు వచ్చినపుడు ఓవర్‌గా పూజలు, హోమాలు ఏమీ చేసేదాన్ని కాదు. దేవాలయానికి వెళ్లి మంచైనా చెడైనా నీదే భారమని ప్రార్థించేదాన్ని. ఇప్పటికీ అంతే! ‘మంచైనా, చెడైనా నువ్వే చూసుకోవాలి స్వామీ’ అని మనస్సులో తరచూ ప్రార్థిస్తుంటాను. దేవునిపై భక్తి గురించి మీ నిర్వచనం ? నమ్మకమే కదా జీవితం. దేవుడైనా దెయ్యమైనా నమ్మకం ఉన్నపుడు భక్తి పుడుతుంది, భయం ఏర్పడుతుంది. అమ్మ నిజం, నాన్న నమ్మకం అంటారు. అమ్మ పరిచయం చేసినపుడు నాన్నను ఎలా నమ్ముతామో, మన పెద్దలు చూపిన మార్గంలో దేవుడిని కూడా అలా నమ్మాలి. భగవంతుడు ఎక్కడ ఉన్నా వెళతాను. అది నా కెపాసిటీ కాదు, భగవంతుడే నన్ను ప్రేరేపించి తీసుకెళతాడు. ఒక్కోసారి పక్కనే మహత్తు కలిగిన గుడి ఉంటుంది, కానీ వెళ్లలేం, భగవంతుడు పిలవనిదే వెళ్లలేం, తలరాత ఉండాలి. అంటే దేవుడు ఉన్నాడని గట్టిగా నమ్ముతున్నారా ? దేవుడు లేడనడం పొరపాటు. మనం చూసే దైవం తల్లి, ఈ దైవాన్ని లేదనగలమా. ‘మాతా, పితా గురు దైవం’, వీటిని ఎవ్వరూ కాదనలేరు. దెయ్యానికి ఒక లిమిట్ ఉంది అన్ని చోట్ల జొరబడే శక్తి దెయ్యానికి ఉండదు, కానీ దేవుడు సర్వాంతర్యామి, ఎక్కడికైనా రాగలడు. తల్లి లేకుండా సృష్టే లేదు. తల్లంటేనే అమ్మవారు, అమ్మవారిలా పూజనీయురాలు తల్లి. వీరిద్దరినీ వేరు వేరుగా చూడగలమా. దేవుడు ఉన్నాడనే విషయం కూడా అంతే. నా జీవితమే దైవప్రేరణ మనకు జరిగే మంచైనా చెడైనా దైవ ప్రేరణే అని తేలిగ్గా తీసుకుంటే మానసిక బాధలు, శారీరక కష్టాలు ఉండవు. నా వరకు చూసుకుంటే జీవితమంతా దైవానుగ్రహమే. జన్మతః తెలుగు, మలయాళం కలబోసిన నేను, ఆ రెండింటిలో ఏ భాషకూ చెందకుండా పోయాను. ఆ రెండు భాషలపైనా పట్టులేకుండా ఉన్న దశలో తమిళ సినీపరిశ్రమలో ప్రవేశించి వెలుగొందడం అంటే దైవ ప్రేరణే... అంటున్నారు ప్రముఖ ïసినీనటి కేఆర్ విజయ. వెండితెరపై అమ్మవారి పాత్రలో రాణించిన కేఆర్ విజయ నిజజీవితంలో కూడా అమ్మవారి ఆరాధకురాలు. అమ్మవారు అంటే కేఆర్ విజయ అనేటంతగా ఆ పాత్రలో ఇమిడిపోయిన ఆమె నేను–నాదైవం కోసం తన భావాలను పంచుకున్నారు. - కొట్రా నందగోపాల్, సాక్షి, చెన్నై -
రాగసుధను పెళ్లాడిన రంజిత్
ప్రముఖ తమిళ నటుడు రంజిత్ మరోసారి పెళ్లిపీటలు ఎక్కారు. నటి రాగసుధను ఆయన వివాహం చేసుకున్నారు. నవంబర్ 10న చెన్నైలోని తిరువెర్కాడులో వీరి పెళ్లి జరిగింది. హిందూ సంప్రదాయంలో జరిగిన ఈ పెళ్లికి వధూవరులు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. వధువు రాగసుధ సీనియర్ నటి కేఆర్ విజయ మేనకోడలు కేఆర్ సావిత్రి కుమార్తె. రంజిత్ ఇంతకుముందు నటి ప్రియారామన్ పెళ్లాడారు. 15 ఏళ్లు కాపురం చేశాక ఇటీవలే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. రంజిత్, రాగసుధ వివాహానికి కేఆర్ విజయ, యువరాణి, భానుప్రియ, అర్చన తదితరులు హాజరయ్యారు.