భక్తులారా.. జరభద్రం..!
విజయపురిసౌత్ :
విజయపురిసౌత్‌లోని కృష్ణవేణి ఘాట్ సమీపంలో జలాశయం లోతు ఎక్కువగా ఉంటుంది. సాగర్ సందర్శించే పర్యాటకులు సరదాగా నీటిలో స్నానం చేయటానికి దిగి ఎంతోమంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రాంతంలో 2013వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నలుగురు నీటిలో మునిగి మృతి చెందారు. దిగువ కృష్ణానదిలో పడిపోయిన బ్రిడ్జి వద్ద స్నానానికి దిగి గత మూడేళ్లలో ముగ్గురు అనంతలోకాలకు వెళ్లారు.
దీనికి సమీపంలోనే దేశాలమ్మగుడి వద్ద పుష్కర ‡ఘాట్‌ను ఏర్పాటు చేశారు. సాగర్మాత దేవాలయం వద్ద స్నానాలకు దిగి నాలుగేళ్లలో ఏడుగురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కళ్లు తెరవకుండా ఘాట్ల భద్రతను గాలికొదిలింది. దీనికి ఈ చిత్రాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి.