ఆ హత్యలు బంధువుల పనే
సాక్షి, ఏలూరు : కృష్ణా జిల్లా పెద అవుటపల్లి జాతీయ రహదారిపై గత నెల 24న పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన తండ్రీకొడుకుల్ని తుపాకులతో కాల్చి చంపిన కేసును ఢిల్లీ పోలీసుల సహకారంతో విజయవాడ పోలీసులు ఛేదించారు. పినకడిమికి చెందిన గంధం నాగేశ్వరరావు, అతని కుమారులు మారయ్య, పగిడి మారయ్యలను హత్యలు చేరయిం చింది అతని బంధువులేనని తేల్చారు. స్థానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా తలెత్తిన వివాదం ఏలూరులోని జేకే ప్యాలెస్ యజ మాని భూతం దుర్గారావు హత్యకు దారితీయగా, అందుకు ప్రతీకారంగా ఈ ముగ్గురినీ హత్య చేరుుం చినట్టు స్పష్టమైంది.
దొరికిన నిందితులు
తండ్రీకొడుకుల్ని హతమార్చిన కేసులో ఢిల్లీకి చెందిన ఏడుగురు కిరాయి హంతకులను మంగళవారం అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ప్రతాప్‌సింగ్, ధర్మవీర్, నితిన్, నీరజ్, మంజీత్, సతీష్‌కుమార్, పంకజ్ అనే వారు ఉన్నారు. అందరూ ఊహించినట్టుగానే హత్యలకు పాల్పడింది హతుల బంధువులేనని తేలింది. ఈ ఏడాది ఏప్రిల్ 6న జేకే ప్యాలెస్ యజమాని భూతం దుర్గారావు హత్యకు గురికాగా, అతని అన్న గోవిందు, తమ్ముడు శ్రీనివాస్, మేనల్లుడు పురాణం గణేష్ ప్రత్యర్థుల హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఇదీ బంధుత్వం
భూతం దుర్గారావు అన్న గోవిందు పెద్ద కుమార్తె ఉమాదేవికి దుర్గారావు హత్య కేసులో నిందితుడైన కూరపాటి నాగరాజు కుమారుడితో వివాహం చేశారు. నాగరాజు సోదరిని గంధం నాగేశ్వరావు వివాహం చేసుకున్నారు. ఈ రకంగా అందరూ బంధువులయ్యారు. ఐదేళ్ల క్రితం తలెత్తిన కుటుంబ కలహాల వల్ల భూతం దుర్గారావు అతని సోదరులు ఓ వర్గంగా, నాగరాజు, నాగేశ్వరావు, వారి కుమారులు మరో వర్గంగా విడిపోయారు. స్థానికసంస్థల ఎన్నికల్లో తలెత్తిన వివాదం దుర్గారావు హత్యకు దారితీ యగా, ప్రతీకారంగా గంధం నాగేశ్వరరావు, అతడి కుమారులను ప్రత్యర్థి వర్గంవారు హతమార్చారని పోలీసుల విచారణలో వెల్లడైంది.
లండన్ నుంచే కుట్ర
పోలీసుల విచారణలో వెలుగుచూసిన వాస్తవాల ప్రకారం.. దుర్గారావు అన్న గోవిందు లండన్‌లో ఉంటున్నాడు. అతని తమ్ముడు శ్రీనివాస్ పినకడిమిలో ఉంటున్నాడు. గోవిందు లండన్ నుంచే హత్యలకు ప్రణాళిక రచించగా, అతని తమ్ముడు శ్రీనివాస్ అమలు చేశాడు. ప్రణాళిక ప్రకారం రూ.కోటి సుపారీ ఇచ్చి ఢిల్లీనుంచి కిరాయి హంతకులను పురమాయించుకున్నారు. హత్య జరిగిన రోజు గంధం నాగేశ్వరావు ఇంటినుంచి బయలుదేరగా, భూతం శ్రీనివాస్, పురాణం గణేష్ వారిని అనుసరించారు. అప్పటికి మూడురోజుల ముందునుంచే షూటర్లు జిల్లాలో మకాం వేసిఉన్నారు. లండన్‌లో ఉన్న గోవిందుకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూనే ఉన్నారు. చివరకు ముగ్గుర్నీ హత్య చేసి ఢిల్లీ వెళ్లిపోయారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా షూటర్లు పోలీసులకు చిక్కారు.
గ్రామంలో ఉద్రిక్తత
నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంతో పినకడిమి గ్రామంలో మరో సారి వాతావరణం వేడెక్కింది. ప్రిల్‌లో భూతం దుర్గారావు హత్య జరిగినప్పుడు ఆ కేసులో నిందితుల ఇళ్లపై బాధితులు దాడికి పాల్పడి సామగ్రి ధ్వంసం చేశారు. అప్పటి నిందితులు ఇప్పుడు బాధితులు కాగా, అప్పటి బాధితులు ఇప్పుడు నిందితులయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయూందోళనలు వ్యక్తమవుతున్నాయి.