కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్ర బృందం సందడి
విశాఖ-కల్చరల్: కృష్ణగాడి వీరప్రేమ గాధ టీమ్ రేడియో మిర్చిలో సందడి చేశారు. ఈ చిత్రం విజయోత్సవ యాత్రని పురస్కరించుకొని మంగళవారం నగరంలో యూనిట్ బృందం పర్యటించారు. హీరో నాని ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని డెరైక్టర్ హాను చాలా బాగా తీశారని, ప్రతి ఒక్క అంశంలో తన శైలిలో ప్రత్యేకత కనిపించే విధంగా చిత్రీకరించారని తెలిపారు. ఈ సినిమా విజయానికి ఆయనే ప్రధాన కారణమని చెప్పారు. విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని, విశాఖవాసులు తన సినిమాను తప్పక ఆదరిస్తారనిధీమావ్యక్తంచేశారు.అనంతరం శ్రోతలతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో చిత్ర బృందంతోపాటు మయగాడు ఫేమ్ కావ్య, అవిలు పాల్గొన్నారు.