krishna murhty
-
బాలరాముణ్ణి దర్శించుకున్న గాయని కవితా కృష్ణమూర్తి!
అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు ప్రతిష్ఠితుడయ్యాక రామభక్తులంతా రామ్‌లల్లాను దర్శించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి కూడా ప్రతిరోజూ లక్షలాది మంది రామభక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. తాజాగా ప్రముఖ గాయకురాలు, పద్మశ్రీ కవితా కృష్ణమూర్తి అయోధ్యకు వచ్చి బాలరాముణ్ణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్యకు వచ్చి, ఇక్కడ పాటలు పాడే అదృష్టం తనకు దక్కిందని, ఇందుకు దేవునికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. అయోధ్య అభివృద్ధిపై సంతోషం వ్యక్తం చేసిన ఆమె రానున్న ఐదేళ్లలో అయోధ్య ను కొత్త కోణంలో చూడనున్నామన్నారు. ఇక్కడికి కళాకారులు తరలి రావడం సంతోషంగా ఉందన్నారు. -
తమ్ముడు రాయితో కొట్టాడని.. అర్ధరాత్రివేళ కిరాతకంగా మారిన అన్న..
సాక్షి, అనంతపురం: శెట్టూరు మండలంలోని కనుకూరు గ్రామానికి చెందిన గొల్ల కృష్ణమూర్తి(27) సొంత అన్న చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నపాటి గొడవ ఈ హత్యకు దారితీయడం గమనార్హం. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... గ్రామానికి చెందిన గొల్ల గోపాల్, మల్లక్క దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దకుమారుడు గొల్ల రవి, రెండో కుమారుడు కృష్ణమూర్తి, కుమార్తె భారతి ఉన్నారు. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు కుమారులు అప్పుడప్పుడు చిన్నపాటి గొడవలు పడేవారు. వెంటనే కలసిపోయేవారు. గురువారం ఉదయం పెద్ద కుమారుడైన రవి తన తమ్ముడి సెల్‌ఫోన్‌ను చెప్పకుండా తీసుకుని కళ్యాణదుర్గం వెళ్లాడు. విషయం తెలుసుకున్న తమ్ముడు కృష్ణమూర్తి కళ్యాణదుర్గం వెళ్లి.. సెల్‌ఫోన్ ఇవ్వాలంటూ అన్నతో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే రాయితీసుకుని అన్న తలపై కొట్టడంతో స్వల్ప గాయమైంది. స్థానికులు గమనించి ఇద్దరినీ దండించడంతో గొడవ సద్దుమణిగింది. గాయపడిన రవిని తమ్ముడు కృష్ణమూర్తి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. తర్వాత ఇద్దరూ ఒకే ద్విచక్ర వాహనంలో ఇంటికి చేరుకున్నారు. అయితే తమ్ముడిపై కోపం పెంచుకున్న అన్న రవి గురువారం అర్ధరాత్రి ఒకే ఇంట్లో నిద్రిస్తున్న తమ్ముడిని గొడ్డలితో విచక్షణరహితంగా నరికి చంపాడు. శుక్రవారం ఉదయం ఇంట్లోకి వచ్చిన తల్లి మల్లక్క రక్తపు మడుగులో ఉన్న కుమారుడిని చూసి కేకలు వేసింది. హత్య విషయం తెలుసుకొన్న గ్రామస్తులు నివ్వెరపోయారు. కళ్యాణదుర్గం సీఐ నాగరాజు, బ్రహ్మసముద్రం ఎస్ఐ పరుశురాముడు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా..నిందితుడు రవి శెట్టూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. తల్లడిల్లిన తల్లిదండ్రులు.. కృష్ణమూర్తి హత్యతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబ భారమంతా తనే మోసేవాడు. తన సంపాదనతోనే చెల్లి పెళ్లి కూడా చేశాడు. తండ్రి గోపాల్‌కు మతిస్థిమితం లేదు. అన్న రవి కుటుంబ బాధ్యతలు పట్టించుకునేవాడు కాదు. కుటుంబాన్ని నెట్టుకొచ్చే కుమారుడు దారుణ హత్యకు గురికావడం, మరో కుమారుడు నిందితుడిగా జైలుపాలు కావడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. ఇవి చదవండి: సైకో కిల్లర్ అరెస్టు -
నిలదీద్దాం
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి ప్రజల బాగోగులు చూడాలన్న తపన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజల సమస్యలను గాలికొదిలేసి అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజధాని పేరుతో భూములు కొనుగోలు చేస్తూ రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. లక్ష ఎకరాలలో రాజధాని ఎక్కడా నిర్మించలేదని రాజధాని పేరిట అక్రమాలు, అన్యాయాలకు పాల్పడేందుకే అధికారపార్టీ ఈ ఎత్తుగడ వేసిందన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు వంద వాగ్దానాలు చేశారని, అధికారంలోకి వచ్చాక ఐదు సంతకాలు చేశారన్నారు. ఆరునెలలు కావొస్తున్నా వాటిలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని తెలిపారు. రాష్ట్రంలో 1.29 కోట్ల రైతు ఖాతాలు ఉంటే అందులో లక్షలోపు రుణం తీసుకొన్న ఖాతాలు 1.22 కోట్లు ఉన్నాయన్నారు. వీటన్నింటికీ రుణం మాఫీ చేయాలంటే రూ.88 వేల కోట్లు అవసరమైతే ప్రభుత్వం బడ్జెట్లో కేవలం ఐదువేల కోట్లు మాత్రమే నిధులు కేటాయించిందన్నారు. దీన్నిబట్టే ప్రభుత్వం అసలు ఉద్దేశం ఏమిటో అర్థమవుతుందన్నారు. బాబు వస్తే జాబు గ్యారెంటీ అని ప్రచారం చేసి తీరా అధికారంలోకి వచ్చాక అనేకమంది ఉద్యోగాలు ఊడగొట్టారన్నారు. వెరిఫికేషన్ పేరుతో 10 లక్ష ల పింఛన్లు, 23 లక్షల రేషన్‌కార్డులను తొలగించారని ఆరోపించారు. నేను మారానని చంద్రబాబు పదే పదే చెబితే నమ్మి ఓట్లేసిన రైతులను, డ్వాక్రామహిళలను నట్టేట ముంచారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లే కపోయినా ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూనే ఉందన్నారు. ఇందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈనెల 5వ తేదీ కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. చంద్రబాబు హామీలు నమ్మి దగాపడ్డ రైతులు, మహిళలు, పింఛన్‌దారులంతా భారీగా ధర్నాకు తరలివచ్చి ఈ ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాసీమ బాబు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు నిత్యానందరెడ్డి, పులి సునీల్‌కుమార్, ఎస్ఎండీ షఫీ, చల్లా రాజశేఖర్, ఖాజారహమతుల్లా, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.