ఈ హీరో ఎవరో తెలుసా?
మంచి ముఖవర్చస్సు, అంతే మంచి క్రాఫు, పువ్వుల పువ్వుల చొక్కా, జీన్సు ప్యాంటు వేసుకున్న ఈ కుర్రాడిని ఎప్పుడైనా చూశారా? ఏదో పల్లెటూరులో ఉన్న ఫొటో స్టూడియోకు వెళ్లి ఇంత స్టైలుగా ఫొటో తీయించుకున్నాడంటే తప్పకుండా సినిమాల్లో చాన్సుల కోసమే అయి ఉంటుంది కదూ. అవును.. మీరనుకున్నది నిజమే. ఈయన హీరోయే. మరి ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా? కొన్ని సినిమాల్లో హీరోగాను, మరికొన్ని సినిమాల్లో హీరోకు ముఖ్యమైన స్నేహితుడిగాను నటించాడు. ఇప్పటికైనా కొంచెం గుర్తుకొచ్చిందా?
లేదంటారా.. అయితే ఇక చెప్పక తప్పదు. వినాయకుడు, విలేజ్లో వినాయకుడు లాంటి సినిమాల హీరో కృష్ణుడు. ఓ ప్రమాదానికి గురైన తర్వాత మందుల వాడకం కారణంగా అనుకోని పరిస్థితుల్లో ఆయన ఒళ్లు విపరీతంగా పెరిగిపోయింది. నిజానికి అలా పెరగక ముందు కృష్ణుడు ఇలాగే ఉండేవాడు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు ప్రాంతంలోని ఓ ఫొటో స్టూడియోలో తీయించుకున్న ఫొటో ఇది.