కాంగ్రెస్ పార్టీలో 11 ఏళ్లుగా శ్రమించా
కంప్లి : గత 11 ఏళ్లుగా కాంగ్రెస్లో కష్టపడ్డానని అయితే కొంత మంది కుతంత్రాల వల్ల పార్టీకి విరుద్ధంగా స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేశానే తప్పా కాంగ్రెస్ పార్టీపై ద్వేషంతో ఎంతమాత్రం కాదని దేవసముద్ర జెడ్పీ క్షేత్ర స్వతంత్య్ర అభ్యర్థి కే.శ్రీనివాసమూర్తి స్పష్టం చేశారు. ఆయనకు బుధవారం తన గెలుపును పురష్కరించుకుని స్థానిక అతిథి గృహంలో మున్సిపల్ కౌన్సిలర్లు డాక్టర్ వీఎల్.బాబు, ఎం.సుధీర్, భట్టా ప్రసాద్ తదితరులు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
సన్మానం అనంతరం ఆయన మాట్లాడుతూ తనపై దేవసముద్ర జెడ్పీ క్షేత్ర పరిధిలోని గ్రామాల్లోని ప్రజల్లో ఇంతటి ఆదరాభిమానం ఉంటుందని ఊహించలేదన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నాగరాజ్, భట్టా ప్రసాద్ మాట్లాడుతూ ఇకపై తాము శ్రీనివాసమూర్తి వెంటే ఉంటామన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు ఎం.మహేష్, రాజాసాబ్, మారెణ్ణ, ప్రముఖులు మూకయ్యస్వామి, కారేకల్లు మనోహభర్, బీ.లక్ష్మణ, కేటీ.బసవరాజ్, రేణుకప్పలు తదితరులు పాల్గొన్నారు.