కార్టూనిస్ట్ మోహన్‌కు పతంజలి స్ఫూర్తి అవార్డు
విజయనగరం: ప్రముఖ వ్యంగ్య రచయిత, కార్టూనిస్టు మోహన్‌కు దివంగత జర్నలిస్టు, సంపాదకులు కె.ఎన్.వై.పతంజలి స్ఫూర్తి అవార్డును అందజేయనున్నట్టు పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి తెలిపారు. శనివారం విజయన గరంలోని గురజాడ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పతంజలి జయంతి రోజైన మార్చి 29న మోహన్‌కు ఈ అవార్డు అందజేయనున్నట్టు తెలిపారు. మార్చి 11, 29 తేదీల్లో కె.ఎన్.వై.పతంజలి వర్ధంతి, జయంతి సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 11న సభకు ఎన్.వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు.