హ్యాట్రిక్ కొట్టిన కేటీఆర్
కరీంనగర్ : సిరిసిల్ల టీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ హ్యాట్రిక్ కొట్టారు. నియోజకవర్గ ప్రజలు కారుకే పట్టం కట్టడంతో సిరిసిల్లలో కేటీఆర్ వరుసగా మూడోసారి విజయం సాధించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 171 ఓట్ల తేడాతో గెలిచిన కేటీఆర్ ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో 68 వేలకు పైగా మెజార్టీ సాధించడం విశేషం.
కాగా ఒకప్పుడు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోటగా వుండేది. చెన్నమనేని రాజేశ్వరరావు సీపీఐ నుంచి నాలుగుసార్లు, టీడీపీ నుంచి ఒకసారి గెలిచారు. ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టులు నాలుగుసార్లు, జనశక్తి ఒకసారి, కాంగ్రెస్ మూడుసార్లు, టీడీపీ ఒకసారి, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకసారి విజయం సాధించారు.