9నుంచి కేయూ పీజీ సెట్
వరంగల్: కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే కేయూ పీజీ సెట్-2017 ప్రవేశ పరీక్షలు జూన్ 9వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ వడ్డె రవీందర్ ప్రకటించారు. ఈ పరీక్షలు జూన్ 16వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు.
ప్రతిరోజు రెండు సెషన్లలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని, వరంగల్, కరీంనగర్‌తోపాటు ఈసారి ఖమ్మంలో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈసారి అన్ని కోర్సులకు కలిసి మొత్తం 37,020 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు వెల్లడించారు.