కూడేరు ఏఎస్ఐ హఠాన్మరణం
అనంతపురం సెంట్రల్: కూడేరు ఏఎస్ఐ పరుశురాం(58) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. ఉదయం ఇంట్లో ఉన్న ఆయనకు ఛాతీనొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడికెళ్లిన కొద్దిసేపటికే ఆయన మృతి చెందారు. మృతదేహాన్ని ఉమానగర్‌లోని నివాసానికి తీసికెళ్లారు.
ఈయనకు భార్య మల్లీశ్వరితో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్పీ రాజశేఖరబాబు ఏఎస్ఐ మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. ఏఎస్ఐ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
పరుశురాం పార్థివదేహానికి ఆత్మకూరు సీఐ శివనారాయణస్వామి, ఎస్ఐలు రాజు, ధర ణికిశోర్, శ్రీనివాసులు, పోలీసుల అధికారుల సంఘం అధ్యక్షులు త్రిలోక్‌నాథ్, కార్యదర్శి గోరంట్ల మాధవ్, సభ్యులు రాజశేఖర్, సూర్యనారాయణ, హరినాథ్ తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం జేఎన్‌టియూ సమీపంలోని శ్మశానవాటికలో పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.