Kukiland in Manipur
-
మణిపూర్‌లో ‘కుకీ’ల కొత్త డిమాండ్.. బీజేపీ నిర్ణయమేంటి?
ఇంఫాల్: మణిపూర్‌లో కొండ ప్రాంతాలతో కూడిన పలు జిల్లాల్లో సోమావారం కుకీ జో తెగ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన రాల్యీలు చేపట్టాయి. మణిపూర్‌లో తెగల మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణలకు ముగింపు పలికి.. తామను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని కుకీ తెగ ప్రజలు డిమాండ్ చేశారు.మణిపూర్‌లో తరచూ చెలరేగుతున్న జాతుల మధ్య ఘర్షణలకు పరిష్కారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 239ఏ ప్రకారం తమకు అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కుకీ తెగ ప్రజలు పెద్దఎత్తున చురచంద్‌పూర్, కాంగ్పోక్పి, చందేల్, ఫెర్జాల్-జిరిబామ్, తెంగ్నౌపాల్ పర్వత జిల్లాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన మంత్రి మణిపూర్ సందర్శించి.. తాము ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులను చూసి సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేశారు.తమ డిమాండ్‌ను వేగవంతం చేయాలని కోరుతూ.. కుకీ జో తెగ సంఘాలు జిల్లా అధికారుల ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మెమోరాండం సమరర్పించినట్లు తెలిపారు. చురచంద్‌పూర్ జిల్లా బీజేపీ ఎమ్యెల్యే పౌలియన్‌లాల్ హాకిప్ మీడియాతో మాట్లాడారు. ‘ కుకీ జో ఎమ్మెల్యేలు ప్రధాని మోదీని కలవాలని ఏడాది క్రితం విజ్ఞప్తి చేశాం. కానీ ఇప్పటికీ మాకు అనుమతి లభించలేదు. ఇక.. ఇప్పడు ప్రధాని మోదీ మా తెగల ఘర్షణకు పరిష్కారం చూపాలనుకుంటే ఇక్కడికే( మణిపూర్) రావాలి’అని అన్నారు. వీరికి వ్యతిరేకంగా ఇంఫాల్ వ్యాలీలో మైతేయి తెగకు సంబంధించిన మహిళా సంఘాలు మార్చ్ నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం కుకీ మిలిటెంట్లకు మద్దతుగా ఉండొద్దని.. ‘ప్రత్యేక పరిపాలన వద్దు. గ్రామ వాలంటీర్ల అరెస్టు చేయొద్దు’ అనే నినాదాలతో భారీ సంఖ్యలో మహిళలు డిమాండ్ చేశారు. ఇక.. మే 3, 2023 నుంచి మణిపూర్‌లోని వ్యాలీ ప్రాంతాల్లో నివసించే మైతేయి తెగ, పర్వత ప్రాంతాల్లో ఉండే కుకీ జో తెగల మధ్య అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అల్లర్లతో ఇరు తెగల మధ్య తీవ్రమైన హింస చెలరేగటంతో 220 మంది మృతి చెందారు. ఈ ఘర్షణల్లో వేలమంది గాయపడ్డారు. ఘర్షణలు తట్టుకోలేక వేలమంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. -
మణిపూర్‌లో ఆరని కాష్టం.. మళ్ళీ అల్లర్లు
ఇంఫాల్: నాలుగు నెలల క్రితం మణిపూర్‌లో రగిలిన హింస తాలూకు కాష్టం ఇంకా మండుతూనే ఉంది. తాజాగా వారం రోజుల క్రితం ఆగస్టు 29న మరోసారి ఇంఫాల్‌లో హింసాకాండ రగులుకుంది. ఈ హింసలో మరో 8 మంది మరణించగా 20 మంది గాయపడ్డారు. దీంతో ఇంఫాల్‌లో మిగిలిన కుకీ కుటుంబాలను బలవంతంగా కొండ ప్రాంతాలకు తరలించాయి సాయుధ దళాలు. మెయిటీలు అత్యధికంగా నివసించే పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని లంబులానే ప్రాంతం నుండి అక్కడ మిగిలి ఉన్న స్వల్ప సంఖ్యాకులైన కుకీలను బలవంతంగా కొండప్రాంతానికి తరలించాయి అక్కడి భద్రతా దళాలు. శుక్రవారం అర్ధరాత్రి సాయుధ దళాలు తమ ఇంటిని తలుపులను బలంగా కొట్టి నిద్రలో ఉన్నవారికి ఎక్కడికి వెళ్ళేది చెప్పకుండా తరలించారని అన్నారు అక్కడ నివసించే ఓ పెద్దాయన. లంబులానే ప్రాంతం నుండి తరలించబడింది రెవరెండ్ ప్రిమ్ వైఫే, హెజాంగ్ కిప్జెన్ తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 1,2 తేదీల్లో అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా కేంద్ర భద్రతా దళాలు కనీసం తమ వస్తువులను వెంట తెచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా కట్టుబట్టలతోనే తమను బలవంతంగా బయటకు లాక్కుని వచ్చారని అక్కడే ఉన్న బులెట్ ప్రూఫ్ వాహనాల్లోకి ఎక్కించి కుకీలు ఎక్కువగా నివసించే కంగ్పోక్పి జిల్లాలోని మోట్‌బంగ్ ప్రాంతానికి తరలించారని అన్నారు. కేంద్ర భద్రతా దళాలు మాకు భద్రతా కల్పించాల్సింది పోయి ఇలా బలవంతంగా మమ్మల్ని తరలించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాము. భారతదేశం లాంటి మహోన్నత దేశం సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడటంలో విఫలమై సంఘ వ్యతిరేక శక్తుల ప్రలోభాలకు లొంగిపోయి పౌరులకు భద్రత కల్పించడంలో మన వ్యవస్థ దారుణంగా విఫలమైందని అన్నారు. ఈ బలవంతపు తరలింపులో భద్రతా దళాలు మొత్తం 10 కుటుంబాలకు చెందిన 24 మందిని తరలించామని భద్రతా దళాలు చెబుతున్నాయి. ఆగస్టు 27న లంబులానే ప్రాంతంలో అల్లరి మూకలు మూడు పాతబడ్డ ఇళ్లను దహనం చేశారని మిగిలిన వారికి కూడా ప్రమాదం పొంచి ఉందని సమాచారం రావడంతో వారిని హుటాహుటిన అక్కడి నుండి సురక్షితమైన ప్రాంతానికి తరలించామని తెలిపారు. మెయిటీలకు గిరిజన తెగగా గుర్తింపునిచ్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించిన నేపథ్యంలో మే 3న మణిపూర్‌లో అల్లర్లు చెలరేగాయి. నెలరోజులకు పైగా కొనసాగిన ఈ హింసాకాండలో 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా సుమారు 50000 మంది తమ ఇళ్లను విడిచిపోయారు. రాష్ట్రమంతటా ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగినట్టే అనిపించినా ఈ మధ్యనే పశ్చిమ ఇంఫాల్‌లో మళ్ళీ అల్లర్లు జరగడంతో ఇంఫాల్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇది కూడా చదవండి: సర్జికల్ స్ట్రైక్ హీరో చేతికి మణిపూర్ అల్లర్ల బాధ్యతలు -
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. ముగ్గురి మృతి
ఇంఫాల్: మణిపూర్‌లో రెండు వారాల తర్వాత మళ్లీ హింస చెలరేగింది. తుంగ్ఖుల్ నాగా జనాభా అధికంగా ఉండే ఉఖ్రూల్ రీజియన్‌లోని తోవాయి కుకీ అనే గ్రామంలోముగ్గురిని కాల్చి చంపింది అల్లరి మూక. ఉఖ్రూల్ ఎస్సీ నింగ్షెమ్ వషుమ్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం వేకువ ఝామున 4.30.గం. ప్రాంతంలో తోవాయి కుకీ గ్రామానికి కాపలాగా ఉన్న ముగ్గురిని ఆయుధాలతో వచ్చిన కొందరు దుండగులు కాల్చి చంపారు. ఈలోపు కొందరు గ్రామస్తులు అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలోని చెక్‌పోస్ట్‌కు వచ్చి భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. సిబ్బంది ఆ గ్రామానికి చేరుకునేలోపే దుండగులు పరారయ్యారు. వాళ్ల కోసం గాలింపు చేపట్టడంతో పాటు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. మణిపూర్‌లో కొనసాగుతున్న గిరిజన-గిరిజనేతర వర్గపోరులో భాగంగానే ఈ కాల్పులు జరిగాయని ఎస్సీ ధృవీకరించారు. కాల్పులు జరిగింది మారుమూల గ్రామంలో కావడం, భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించలేకపోయామని ఎస్సీ వెల్లడించారు. ఇక మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో గత రెండు నెలలుగా గ్రామస్తులే తమ యువతను కాపలాగా ఉంచుతూ వస్తున్నారు. ఈ ఘటన ప్రభావం చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించకుండా భద్రతా బలగాలు మోహరించాయి. -
SC: మాకు అపారమైన అధికారం ఉన్నా సరే..
సాక్షి, ఢిల్లీ: గత రెండు నెలలుగా అల్లర్లు, హింసతో రగిలిపోతున్న మణిపూర్ పరిణామాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. న్యాయస్థానాన్ని వేదికగా ఉపయోగించుకొని మరింత ఉద్రిక్తతలు పెంచలేరంటూ పిటిషనర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. మణిపూర్‌లో శాంతి భద్రతల పరిరక్షణకై ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంలో దాఖలైన పలు పిటిషన్లపై.. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టి కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతి భద్రతలు తమ పరిధిలోని అంశం కాదని.. అవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ పీఎస్ నరసింహా ఈ పిటిషన్లను విచారణ చేపట్టారు. ఈ క్రమంలో కూకీ తెగ తరపున సీనియర్ న్యాయవాది కోలిన్ గోంజల్వేస్ బెంచ్ ముందు వాదనలు వినిపిస్తూ.. ‘‘దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని, ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితుల్ని సాధారణ స్థితికి తేవాలని కోరారు. అంతేకాదు ఇది ప్రభుత్వమే జరిపిస్తున్న అల్లర్లంటూ సంచలన ఆరోపణలు చేశారాయన. ఈ క్రమంలో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందిస్తూ.. మణిపూర్‌లో ఉద్రిక్తతలను మరింత పెంచడానికి కోర్టును మీరు ఉపయోగించుకోలేరంటూ వ్యాఖ్యానించారాయన. ‘‘అఫ్కోర్స్.. సుప్రీం కోర్టుకు అపారమైన అధికారమే ఉంది. కానీ, దానిని ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగిస్తాం. ఒక రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ మా పని కాదు. అది అక్కడి ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వానిదేనని అన్నారు. ఇదిలా ఉంటే.. అడ్వొకేట్ కోలిన్ గోంజల్వేస్ మణిపూర్‌లోని బీజేపీ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయుధ వర్గాలను ప్రభుత్వమే వెన్నుతట్టి ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో మళ్లీ జోక్యం చేసుకున్న సీజేఐ.. ఇది తీవ్ర సంక్షోభమేనని, చేతనైంతలోనే తామ చేసేది చేయగలమని, అంతేగానీ శాంతి భద్రతల పరిరక్షణ మాత్రం పర్యవేక్షించలేమని, అవసరం అనుకుంటే నిర్మాణాత్మక సూచనలతో రావాలని పిటిషనర్ల తరపు అడ్వొకేట్కు సూచించారు. ఈ క్రమంలో రేపు(మంగళవారం) మరోసారి పిటిషన్లపై సీజే బెంచ్ వాదనలు విననుంది. ఇదిలా ఉంటే మే నెల నుంచి ఇప్పటిదాకా.. మణిపూర్‌లో కుకీ-మెయితీ తెగల మధ్య వైరం 150 మంది ప్రాణాలను బలిగొంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఒక నివేదిక సమర్పించాలని మణిపూర్ సీఎస్‌ను సుప్రీం కోర్టు గతవారం ఆదేశించింది. అంతకాదు శరణార్థుల పరిస్థితిపైనా నివేదిక ఇవ్వాలని కోరింది. ఇదీ చదవండి: గులా‘బీ టీమ్’ గందరగోళం ఎట్లా? -
కొత్త రాష్ట్రాల డిమాండ్లు పెరిగాయి: కేంద్ర హోం శాఖ
కొత్త రాష్ట్రాల ఏర్పాటు చేయాలంటూ దేశావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న డిమాండ్లు పెరిగాయని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆయా డిమాండ్లకు సానుకులంగా స్పందిస్తే భారత్‌లో మరో 20కి పైగా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో భారత్‌లో రాష్ట్రాల సంఖ్య 50కి చేరుతుందని పేర్కొంది. ఇప్పటికే మణిపూర్‌లో కూకీలాండ్, తమిళనాడులో కొంగునాడు, కర్ణాటకలో తుళునాడు, ఉత్తర బెంగాల్లో కామత్పూర్ ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్లు చేస్తున్నాయని చెప్పింది. అయితే దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా... అవధి ప్రదేశ్, పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, పశ్చిమాంచల్గా విభజించాలని ఆ రాష్ట్ర నేతలు డిమాండ్ చేస్తున్న సంగతిని ఈ సందర్బంగా కేంద్రహో మంత్రిత్వశాఖ గుర్తు చేసింది. వీటితోపాటు ఉత్తరప్రదేశ్‌లోని అగ్రా డివిజన్, రాజస్థాన్‌లోని భరత్పూర్, గ్వాలియర్లను కలపి బ్రజ్ ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని, అలాగే పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలను కలపి ఓ రాష్ట ఏర్పాటు చేయాలంటూ పలు సంఘాలు, సంస్థలు తమకు వినతి పత్రాలు అందజేశాయని తెలిపింది. అలాగే మహారాష్టలో విదర్భ ప్రాంతాన్ని కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని గత ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతిని ప్రస్తావించింది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేస్తామని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. దాంతో తమకు కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ దేశంలోని అసోం, డార్జిలీంగ్ తదితర ప్రాంతాలలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. కాగా విదర్భ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని మహారాష్టలోని అమరావతి జిల్లా పరిషత్ ఆదివారం తీర్మానం చేయడం గమనార్హం.