'పోలీస్ విభాగంలో ఇమడలేకపోయారు'
సంగారెడ్డి : ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కుకునూర్‌పల్లి ఎస్ఐ ఎస్సై రామకృష్ణారెడ్డి(38) పోలీసు విభాగంలో ఇమడ లేకపోయారని విచారణాధికారి ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. ఆర్మీ నుంచి వచ్చిన రామకృష్ణారెడ్డి చదువు అంతంత మాత్రమే కావడంతో విధి నిర్వహణలో ఇబ్బంది పడ్డారని తెలిపారు. అతడికి కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయన్నారు.
మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి... రామకృష్ణారెడ్డి తనకు తాను కాల్చుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రతాప్ రెడ్డి చెప్పారు. డీఎస్పీ, సీఐ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మంగళవారం రాత్రి రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. నిజామాబాద్ ఏఎస్పీ ప్రతాప్‌రెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. దీంతో రామకృష్ణారెడ్డి మృతిపై విచారణ జరిపిన ఆయన ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నారు.