అదృశ్యమైన బాలిక శవమై తేలింది
పింప్రి, న్యూస్‌లైన్: లోనావాలాలోని కుమార్ రిసార్ట్‌లో రెండు రోజుల క్రితం జరిగిన ఓ పెళ్లిలో అదృశ్యమైన ఏడేళ్ల బాలిక మంగళవారం శవమై కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... రాయిగడ్ జిల్లా ఇందాపూర్‌ుకు చెందిన ఓ జైన్ కుటుంబం ఈ నెల 15న ఇక్కడ జరిగిన వివాహానికి హాజరైంది. ఆ రోజు సాయంత్రం నుంచి వారి ఏడేళ్ల కుమార్తె కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం ఉదయం తల్లిదండ్రులు లోనావాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మంగళవారం సాయంత్రం కుమార్ రిసార్ట్ టైపై ఓసోలార్ బోర్డు కింద బాలిక శవం కనిపించింది. ఆమె మెడను పదునైన ఆయుధంతో కోసి హత్య చేశారని పోలీసులు చెప్పారు. బాలికపై అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానంవ్యక్తం చేశారు. బాలిక మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని, శవ పరీక్షకు తరలించి, దర్యాప్తులు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకొని రిసార్ట్‌పై రాళ్లు రువ్వారు.
స్థానికుల ఆగ్రహం
బాలిక హత్యకు నిరసనగా బుధవారం లోనావాలాలో స్థానికులు స్వచ్ఛందంగా బంద్ పాటించి, రాస్తారోకో నిర్వహించారు. కుమార్ రిసార్ట్ భవనంపై రాళ్ల వర్షం కురిపించారు. ప్రజలను శాంతింపజేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో లాఠీ చార్జీ చేశారు. బాలికపై అత్యాచారం జరిగినట్టు అనుమానాలు వ్యక్తం కావడంతో, ఆగ్రహం చెందిన ప్రజలు లోనావాలా నగరంతో పాటు మావల్, ఖపోలి పరసరాల నుంచి భారీ సంఖ్యల ఉదయం నుంచే ఇక్కడికి చేరుకోవడం ప్రారంభించారు. పోలీసుల లాఠీ చార్జీలో పలువురు మహిళలు గాయపడ్డారు.