అస్సాం సీఎం ముఖ్యకార్యదర్శిగా కుమార భాను
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం టీ బోర్డు చైర్మన్‌గా పనిచేస్తున్న కుమార భాను అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ముఖ్యకార్యదర్శిగా నియమితులయ్యారు. అస్సాం ఐఏఎస్ కేడర్‌కు చెందిన భాను గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కార్యదర్శిగా పనిచేసిన విషయం విదితమే. ప్రస్తుతం తరుణ్ గొగోయ్ కోరిక మేరకు కుమార భాను టీ బోర్డు చైర్మన్ పదవిని వదులుకుని ఆయన వుుఖ్యకార్యదర్శిగా వెళ్లారు.