భద్రాద్రిలోవైభవంగా కుంకుమ పూజలు
భద్రాచలం(ఖమ్మం): భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శనివారం సామూహిక కుంకుమ పూజలు వైభవంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో స్వర్ణ లక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం జరిపించారు.
మధ్యాహ్నం బేడా మండపంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. సుమారు 600 మంది భక్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు. సోమవారం స్వామి వారికి ముత్తంగి సేవ నిర్వహించనున్నట్లుగా ప్రధానార్చకులు తెలిపారు.
రామకోటి సమర్పించిన వైఎస్సార్ జిల్లా భక్తులు
సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వైఎస్సార్ జిల్లాకు చెందిన 60 మంది భక్తులు రామకోటి పుస్తకాలను అందజేశారు.
బియ్యం గింజలపై ‘శ్రీరామనామం’
ఈ నెల 28న జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో తలంబ్రాలలో కలిపేందుకని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన బిందు మాధవరావు, శేషమాంబ దంపతులు బియ్యం గింజలపై శ్రీరామ నామం రాసి వాటిని ఆలయ అధికారులకు అందజేశారు.