బజార్లో తిట్టాడని ఊపిరితీశారు!
కుందుర్పి : ఓ వృద్ధుడు తమను బజార్లో తిట్టాడని కోపోద్రిక్తులైన ఎనిమిది మంది చీరతో బిగించి ఊపిరితీశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు కళ్యాణదుర్గం సీఐ శివప్రపసాద్ తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. కుందుర్పికి చెందిన హరిజన అంజినప్ప (65)కు అన్నదమ్ములతో భూ వివాదం ఉంది. ఆదివారం సాయంత్రం ఇదే విషయంపై తనకు తాను తిట్టుకుంటున్నాడు.
అయితే తమనే తిడుతున్నాడన్న భావించిన పక్కింటి తిప్పేస్వామి, తిప్పయ్యతోపాటు ఆరుగురు మహిళలు దాడికి దిగి.. చీరతో గొంతుకు బిగించారు. భార్య జయమ్మ విడిపించడానికి వచ్చేలోపు అంజినప్ప స్పృహ కోల్పోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా ప్రాణాలు వదిలాడు. మృతుడి భార్య, కుమారుల ఫిర్యాదు మేరకు ఎనిమిది మంది హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.