‘కుప్టి'... ఖర్చు తక్కువ, ఫలం ఎక్కువ
కుప్టి ప్రాంత నీటి లభ్యత దక్షిణ భారతంలోనే అత్యధికం. అతి తక్కువ దూరంలో అతి ఎక్కువ ఫాల్‌తో, అత్యధిక విద్యుదుత్పత్తికి అనువైన ఇలాంటి ప్రాంతం దేశంలోనే లేదు. ఇంత అద్భుతమైన ప్రాజెక్టు పాలకులకు ఇంతకాలంగా పట్టకపోవడం దురదృష్టకరం.
నూతన తెలంగాణ రాష్ట్రం ఎదు ర్కొంటున్న తీవ్ర విద్యుత్ కొరత, కరువు సమస్యల పరిష్కా రానికి కుప్టి ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడుతుంది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం, కుప్టి గ్రామంలో బహుముఖ ప్రయోజనాలను అందించే ఈ ప్రాజెక్టును నిర్మించాలని గత ప్రభుత్వ హయాంలో నిపుణుల బృందం సూచించింది. కుంటాల జలపాతానికి ఎగువన ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ప్రాంతపు ఖాయమైన నీటిలభ్యత దక్షిణ భారతం లోనే ఎక్కువ. ఏటా కనీసం 18.7 టీఎంసీల నీరు లభి స్తుంది. ప్రాజెక్టు వల్ల కనీసం 6.51 టీఎంసీల నీటిని బహు విధాలా ఉపయోగించుకోవచ్చు. సెకనుకు 500 క్యూసె క్కుల నీటిని వదిలితే, గంటకు 3 మెగావాట్లు, రోజుకు 70 మెగావాట్ల ప్రకృతికి హానిచేయని పరిశుభ్రమైన జల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. నవంబర్ లేదా డిసెం బర్ నుండి 150 రోజులపాటు ఈ స్థాయి విద్యుదుత్పత్తికి (మొత్తం 10,500 మెగావాట్లు) హామీ ఉంటుంది. పైగా ఈ ప్రాజెక్టుకు అవసరమైన నీటికంటే ఇక్కడ 3 రెట్లు ఎక్కు వ నీటి లభ్యతకు (18.7 టీఎంసీలు) హామీ ఉంటుంది. కాబట్టి ఆగస్టు నుండి 3 నెలలపాటు అదనంగా మరొక 6,300 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. ప్రాజె క్టు నిర్మాణ వ్యయానికి (100 నుండి 150 కోట్ల రూపా యలు) సరిపడే విద్యుదుత్పత్తి 8 ఏళ్లలోనే లభిస్తుంది.
గత ఏడాది ఈ ప్రాంతం నుండి 50 క్యూసెక్కుల నీరు సముద్రం పాలైందంటేనే ఇక్కడ గరిష్ట నీటి లభ్యత ఎంత ఎక్కువో అర్థమౌతుంది. సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తున కుప్టి ప్రాజెక్టును నిర్మిస్తే... సువిశాలమైన ఈ క్యాచ్మెంట్ ఏరియాలో లభించే చివరి నీటి బొట్టును సైతం నిలువ చేసి, విద్యుదుత్పత్తితో పాటూ, సాగునీటి, తాగునీటి అవసరాలకు వినియోగించవచ్చు. కుప్టి - కుం టాల నీటి ప్రవాహం దిగువకు ఎంత ఉధృతితో ప్రవహి స్తుందంటే... ఆ వరదకు పూర్తిగా ఎండి, ఖాళీయైన కడెం ప్రాజెక్టు గంటలో నిండిపోవడమే కాదు, గేట్లు ఎత్తేయ కపోతే గండి పడి, ఉపద్రవానికి దారితీస్తుంది. దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన మెరుపు వరదలకు గురయ్యే ప్రాజెక్టుల్లో కడెం ఒకటి. 1972 నుండి 2014 వరకు ఆ ప్రాజెక్టుకు 1,400 టీఎంసీల నీళ్లు వస్తే 800 టీఎంసీలు వృథాగా గోదావరి ద్వారా సముద్రంలో కలిశాయి. 1,700 మి.మీ. (2013) వర్షపాతంతో సుభిక్షంగా ఉండాల్సిన బోథ్-ప్రాణహిత ప్రాంతంలో వందలాదిగా రైతులు ఆత్మ హత్యలకు పాల్పడాల్సివచ్చింది. శ్రీరాంసాగర్ పూర్తి నిలు వ సామర్థ్యం కంటే ఎక్కువ నీటిలభ్యత ఉండే ఈ ప్రాం తం నుండి ఈ కరువు ఏడాదిలో కూడా ఒక పంటకు సరి పడే నీరు అనేక రోజుల పాటు వృథా అయింది.
సర్వే చేసిన కుప్టి ప్రాజెక్టుకు, కడెం ప్రాజెక్టుకు మధ్య 200 మీటర్ల తీవ్రమైన దిగుడు (ఫాల్)ఉంటుంది. ఆ భారీ నీటి దిగుడులో విద్యుదుత్పత్తితోపాటూ, పైసా ఖర్చు లేకుండా వందలాది గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందిం చగలుగుతాం. అతి తక్కువ దూరంలో అతి ఎక్కువ ఫాల్ (దిగుడు)తో, అత్యధిక జల విద్యుదుత్పత్తికి అనువైన ఇలాంటి ప్రాంతం దేశంలోనే లేదని చెప్పొచ్చు. ఇంత అద్భుతమైన ప్రాజెక్టు ఇంత కాలంగా పాలకులకు పట్టక పోవడం దురదృష్టకరం.
కుప్టి గాక, దానికి 200 మీటర్ల దిగుడులో 25 మీట ర్లకు ఒకటి చొప్పున మరో రెండు జలవిద్యుత్ కేంద్రాల ను... పెంబి సమీపంలోనూ, బాబ్జీపేట వద్ద నిర్మించవ చ్చు. నిత్యం పై నుంచి జలపాతం, క్రింది బ్యాక్ వాటర్ లతో కనులకు విందుచేసే ఆ జల కళ వర్ణనకు అందదు. ఏటా సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో జలకళ లేక కుంతాల జలపాతం వెలవెల పోతుంటుంది. ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఏడాది పొడవునా అది కళకళలాడుతూ పర్యాటకు లను ఆకర్షిస్తుంది. దానిని రాష్ట్రంలోనే ముఖ్య పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చు. ఈ మూడు ప్రాజెక్టులతో లభించే విద్యుత్తు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిండా నీరుంటే జరిగే విద్యుత్తుకు సమానం. ఇవి ఆగస్టు నుంచి మార్చి వరకు ఆదిలాబాద్ జిల్లా నీటి అవసరాలను తీర్చడంతో పాటు 50,400 మెగావాట్ల విద్యుత్తును అందిస్తాయి. కుప్టి ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యేది ఒక్క గ్రామం, 1,600 ఎకరాల భూమి మాత్రమే. ఈ ప్రాజె క్టులో 6.5 టీఎంసీల నీటిని నిలువ చేయగా, మిగతా 12.14 టీఎంసీల నీటిని కడెం ప్రాజెక్టుకు అందించవచ్చు.
అత్యధిక వర్షపాతం ఉన్నా, చుక్క నీరు నిలవని కరువు మండలాలైన ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్లకు ముందుగా ఈ ప్రాజెక్టు నుండి ఎత్తిపోతల ద్వారా సాగు నీరు అందిం చాలి. పైగా ఇది అద్భుతమైన వాటర్ గ్రిడ్‌గా పనిచేసి, దిగువనున్న వందలాది గ్రామాలకు తాగు నీరందించ గలుగుతుంది. 200 మీటర్ల ఎత్తు నుండి దిగువకు పరు గులు తీసే ఈ నీటిని వదలి, అత్యంత వ్యయప్రయా సలతో కడెం ప్రాజెక్టు నుండి ఎగువనున్న ఆదివాసీ గ్రామాలకు నీరందించాలనుకోవడం అవివేకం.
(వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి అధ్యక్షులు)
మొబైల్: 7095474920
నైనాల గోవర్ధన్