kurnool collectorate
-
కర్నూలు కలెక్టరెట్ ఎదుట రైతులు ధర్నా
-
కర్నూలు కలెక్టరెట్ ఎదుట జర్నలిస్టు సంఘాల ఆందోళన
-
కర్నూలు కలెక్టరేట్ ఎదుట విద్యార్ధి జేఏసీ ఆందోళన
-
శోభరాణి ఆత్మహత్యకు నిరసనగా కలెక్టరేట్ వద్ద ఆందోళన
సాక్షి, కర్నూలు: ఆళ్లగడ్డలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ లో సూపర్వైజర్గా పనిచేస్తున్న శోభారాణి శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తన భార్య ఆత్మహత్యకు సంక్షేమ శాఖ సీపీడీఓ పద్మావతి కారకురాలని మృతురాలి భర్త ఆరోపించిన విషయం తెలిసిందే. ఆరోగ్యం బాగలేకపోయినా తీవ్ర పని ఒత్తిడికి గురిచేశారని ఆయన ఆరోపించాడు. మెమోలు ఇచ్చి మనోవేదనకు గురిచేయడం వల్లే శోభారాణి బలవన్మరణం చెందిందని తెలిపాడు. కాగా, శోభారాణిని మానసిక వేదనకు గురిచేసి, ఆమె ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఐసీడీఎస్ (అంగన్వాడీ) ఉద్యోగ సంఘాలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టాయి. శోభారాణి కుటుంబానికి రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియాగా చెల్లించాలని, ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. -
కలెక్టరేట్ వద్ద విద్యార్ధి సంఘాల ఆందోళన
-
18 ఏళ్లు దాటినా 8 ఏళ్ల పిల్లాడిలా!
నెలకు రూ.46వేలు ఖర్చు పెడితే ఫలితం ఆరు నెలలుగా కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణ కర్నూలు : ఈ ఫొటోలో తండ్రి పక్కన కనిపిస్తున్న పిల్లాడి పేరు వీరకుమార్. చూడ్డానికి 8 ఏళ్ల వయస్సు గలవానిగా కనిపిస్తాడు. కానీ ఇతని వయస్సు ప్రస్తుతం 18 ఏళ్లు. అరుదుగా వచ్చే ఎదుగుదలలోపం వ్యాధి ఈ బాలున్ని వేధిస్తోంది. నెలకు రూ.46వేల ఖరీదు చేసే ఇన్జెక్షన్లు వేస్తే గానీ ఫలితం ఉండని పరిస్థితి. ఇందుకోసం కలెక్టరేట్ చుట్టూ ఆరు నెలలుగా ప్రదక్షిణ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. కోడుమూరు మండలం గోరంట్ల గ్రామానికి చెందిన ఆర్. రాముడు, సుంకులమ్మ దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. ఇతనికి వర్షాధారపొలం ఉంది. వర్షం రాకపోతే దంపతులిద్దరూ వ్యవసాయకూలీలుగా మారిపోతారు. ఇలాంటి జీవితాన్ని గడుపుతున్న వీరికి ఆర్. వీరకుమార్ ఏకైక కుమారుడు. అతనికి పుట్టకతోనే పిట్యుటరీ గ్రంథి సమస్య ఏర్పడింది. ఇది సరిగ్గా పనిచేయకపోవడంతో ఎదుగుదల లోపం ఏర్పడింది. చిన్నతనం నుంచి పలువురు వైద్యులను కలిసి చికిత్స చేయిస్తూనే ఉన్నారు. చివరికి పెద్దాసుపత్రి వైద్యులు ఓ సలహా ఇచ్చారు. ఈ బాలునికి 25 ఏళ్లు వచ్చేవరకు ప్రతి నెలా రెండు హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తే ఎదుగుదల వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఆరు నెలల వరకు తన వద్ద ఉన్న డబ్బుతో ఇంజెక్షన్లను కొని ఇప్పించారు. ఆ తర్వాత డబ్బు లేకపోవడంతో పెద్దాసుపత్రి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి రూ.13,104ల విలువజేసే హార్మోన్ ఇంజెక్షన్ వేయించాలి. నెలకు రూ.26వేలకు పైగానే ఈ బాలుని కోసం ఖర్చు చేయాలి. ఇంత ఖర్చు చేయాలంటే తమ పరిధిలో లేదని, జిల్లా కలెక్టర్‌ను కలవాలని ఆసుపత్రి అధికారులు చేతులెత్తేశారు. దీంతో రాముడు తన కుమారున్ని వెంటపెట్టుకుని ప్రతి సారి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. 18 ఏళ్లు వచ్చినా 8 ఏళ్ల పిల్లోడిగా కనిపించే తన కుమారున్ని చూసి జాలి చూపాలని ఆయన అధికారులను వేడుకుంటున్నారు. నెలకు రూ.26వేలు ఖర్చు చేసే స్థోమత తనకు లేదని, అధికారులు హార్మోన్ ఇంజెక్షన్లు వేయించాలని వేడుకుంటున్నారు. -
మే ఒకటి నుంచి ఈ-పాస్
సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో 6వేల రేషన్ దుకాణాల్లో ‘ఈ-పాస్’ పరికరాల ద్వారా ప్రయోగాత్మకంగా చేపట్టిన సరుకుల పంపిణీని మే ఒకటో తేదీ నుంచి కచ్చితంగా అమలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునిత తెలిపారు. ఈ-పాస్ పరికరాల పనితీరు, నిర్వహణపై శనివారం కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. జిల్లాలోని పది మండలాలకు చెందిన డీలర్లు ఈ సమావేశంలో పాల్గొని ‘ఈ-పాస్’ పరికరాల పనితీరు, సర్వర్, సిగ్నల్ సమస్యలు మంత్రికి తెలియజేశారు. కమిషన్ ప్రాతిపదికన రేషన్‌దుకాణాలను నిర్వహించడం సాధ్యం కావడం లేదని, కాబట్టి రూ. 15 వేలు వేతనంగా అందించే ఏర్పాటు చేయాలని విన్నవించారు. మండలస్థాయి నిల్వ కేంద్రాల(ఎంఎల్ఎస్ పాయింట్లు) నుంచి రేషన్ డీలర్లకు సరఫరా చేస్తున్న సరుకుల తూకాల్లో తేడాలు ఉంటున్నాయని, ఈ నేపథ్యంలో ఈ-పాస్ ద్వారా కచ్చితమైన తూకంలో సరుకులు పంపిణీ చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేషన్ సరుకుల పంపిణీని ఈ-పాస్ పద్ధతిలో చేపట్టిందని, అయితే పరికరాల్లో సమస్యలు తలెత్తాయని, అందువల్లే చాలా జిల్లాల్లో సరైన సమయంలో సరుకులు పంపిణీ చేయలేకపోయాని తెలిపారు. చాలా చోట్ల 10 శాతం మించి సరుకుల పంపిణీ జరగలేదన్నారు. దీంతో సరుకులు అందక పేద ప్రజలు ఇబ్బదులకు గురవుతున్నారన్న విషయం తెలిసే.. ఈ-పాస్ యంత్రాలు పనిచేయని చోట లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకుని సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించామన్నారు. ప్రస్తుతం ఈ-పాస్‌లో తలెత్తిన సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని, రేషన్ దుకాణాల్లో సిగ్నల్ వ్యవస్థ బలోపేతానికి విప్ యాంటీనా పెడతామన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, జాయింట్ కలెక్టర్ హరికిరణ్‌తోపాటు పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
బోగస్ ఓటర్లు 1,28,847
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంతో కీలకమైనది. అర్హులైన వారికి ఈ హక్కును కల్పించేందుకు అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. అయితే వీరి కళ్లు గప్పి బోగస్ ఓటర్లు కుప్పలు తెప్పలుగా నమోదు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు రెండు, మూడు ఓట్లు కలిగి ఉన్నారు. జిల్లాలో ఇటీవల ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 1,28,847 మంది ఉన్నట్లు వెల్లడైంది. బోగస్ ఓటర్లను తొలగింపు సజావుగా సాగకపోవడానికి రాజకీయ పార్టీ పాత్ర కూడా ఎక్కువగా ఉంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్ఏలను నియమించాల్సి ఉంది. వీరు బోగస్ ఓటర్లను గుర్తించి వాటిని తొలగించడంలో అధికారులకు సహకరించాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయ పార్టీలు వీటివైపు దృష్టి సారించడం లేదు. బీఎల్ఏలను నియమించిన దాఖలాలు కూడా లేవు. బోగస్‌లు ఇలా నమోదు.. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 18 ఏళ్లు పైబడిన జనాభా 27,11,140 ఉంది. ఓటర్ల సంఖ్య దీనికి మించలేదు. ముసాయిదా జాబితా ప్రకారం ప్రస్తుతం జిల్లాలో 28,39,987 మంది ఓటర్లు ఉన్నారు. అంటే బోగస్ ఓటర్లు 1,28,847 మంది ఉన్నట్లు స్పష్టమవుతోంది. చనిపోయిన ఓటర్లను తొలగించకుండా జాబితాలో ఉంచడం, మహిళలకు ఇటు పుట్టింటిలోను, అటు అత్తింటిలోని ఓటర్లుగా ఉండటంతో బోగస్ నమోదవుతోంది. శాశ్వతంగా గ్రామాలు వదిలి వెళ్లి మరోచోట స్థిరపడిన వారి పేర్లు రెండు చోట్ల జాబితాలో ఉంటున్నాయి. తొలగింపులో జాప్యం.. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరిగే సమయంలోప్రతీ ఆదివారాన్ని ఎన్నికల కమిషన్ స్పెషల్ క్యాంపైన్ డేగా ప్రకటించింది. ఆ రోజున అన్ని పోలింగ్ కేంద్రాలను తెరచి ఉంచాలి. పోలింగ్ కేంద్రంలో ముసాయిదా ఓటర్ల జాబితా ఫారం-6 దరఖాస్తులు ఉండాలి. రాజకీయ పార్టీల బీఎల్ఏలు కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి బోగస్ ఓటర్లను గుర్తించాల్సి ఉంది. రాజకీయ పార్టీలే పట్టించుకోకపోవడంతో బీఎల్ఓలు కూడా ఆదివారాల్లో పోలింగ్ కేంద్రాలకు అంతంత మాత్రంగానే వెళుతున్నట్లు సమాచారం. యువత దూరం... 18-19 ఏళ్ల జనాభా 1,55,010 ఉంది. అయితే ఓటర్లు మాత్రం 82,205 మంది మాత్రమే ఉన్నారు. ఓటర్లుగా 72,805 మంది యువత ఓటర్లుగా నమోదు కాలేదు. వీరిలో విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణలో భాగంగా వీరందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని లక్ష్యంగా తీసుకున్నారు. 60 ఏళ్లపై బడిన వారిలోను అనాసక్తి.. 60 ఏళ్లు పైబడిన వారిలోను ఓటర్లుగా నమోదయ్యేందుకు ఆసక్తి చూపడం లేదు. జనాభాతో పోలిస్తే ఓటర్లు తక్కువగా ఉన్నారు. 60 నుంచి 69 ఏళ్ల మధ్య వారి జనాభా 2,25,332 ఉంటే ఓటర్లు మాత్రం 3,27,664 మంది ఉన్నారు. 70 నుంచి 79 ఏళ్ల వయస్సు మధ్య వారి జనాభ 85,323 మంది ఉండగా ఓటర్లు మాత్రం 73,612 మంది ఉన్నారు. 80 ఏళ్లుపైబడిన జనాభ 52,833 మంది ఉండగా ఓటర్లు మాత్రం 17,057 మంది ఉన్నారు. ఓటరుగా నమోదయ్యేందుకు 58376 దరఖాస్తులు.. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 2వ తేదీ వరకు ఓటర్లుగా నమోదయ్యేందుకు ఫారం-6 దరఖాస్తులు 58376 వచ్చాయి. ఫారం-7 దరఖాస్తులు 2126, ఫారం-8 దరఖాస్తులు 6025, ఫారం-8ఏ దరఖాస్తులు 451 వరకు వచ్చాయి. కాగా ఓటరు నమోదు కోసం దరఖాస్తులు తీసుకునే గడువును ఎన్నికల కమీషన్ ఈనెల 17 వరకు పొడిగించినట్లు సమాచారం. వయస్సు జనాభా ఓటర్లు 20-29 7,97,301 9,08,507 30- 39 6,33,913 7,28,105 40 -49 4,66,014 5,17,524 50 - 59 2,95,414 3,27,664 మొత్తంగా జనాభా కంటే ఓటర్లే అధికంగా ఉన్నట్లు వెల్లడవుతోంది. -
ధరల పెరుగుదలపై సీపీఎం పోరు
కర్నూలు(న్యూసిటీ), న్యూస్‌లైన్ : పెరిగిపోతున్న ధరలు, వాటికి ఊతం ఇచ్చేలా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సీపీఎం పోరు మొదలెట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు కలెక్టరేట్ ఎదుట భారీ ప్రదర్శన నిర్వహించారు. కూరగాయలు, ఉల్లిగడ్డల దండలను మెడలో వేసుకుని స్థానిక పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చారు. మహిళలు డప్పులు కొడుతూ పాటల రూపంలో నిరశన తెలిపారు. పాణ్యం జోన్ అధ్యక్షుడు జి.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఏ.గఫూర్ మాట్లాడుతూ పెరిగిపోతున్న నిత్యావసర సరుకుల ధరలతో సామాన్యులు కుదేలై పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల, డాలర్‌తో మారకం విలువ తగ్గుతుండడం, క్షీణిస్తున్న ఆర్థికాభివృద్ధి కారణంగా జనం భారంగా బతుకీడుస్తున్నారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోతే కాంగ్రెస్ పార్టీని ప్రజలే భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర జిల్లాల్లో 35 రోజులుగా జ నం రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, అఖిల భారత ప్రజా తంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మలమ్మ మాట్లాడారు. నగర అధ్యక్షుడు డి.గౌస్ దేశాయ్, జిల్లా నాయకులు రామాంజనేయులు, రమేష్‌కుమార్, జేఎన్.శేషయ్య, నాగేశ్వరరావు, కార్మికులు ధర్నాలో పాల్గొన్నారు.