విద్యుదాఘాతంతో రైతు మృతి
కేతేపల్లి (మహబూబ్‌నగర్ జిల్లా): విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఓ రైతు విద్యుత్ షాక్‌తో మృతిచెందిన సంఘటన గురువారం పాన్‌గల్ మండలం కేతేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు,కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ బాలయ్య(45) అనే రైతు తన పంట పొలంలో సాగుచేసిన వరి పంటకు నీరు పారపెట్టేందుకు వెళ్ళాడు. బోరు మోటర్‌ను ఆన్ చేయగా పనిచేయకపోవడంతో మోకానిక్‌ను తీసుకొని మోటర్ దగ్గరకు వెళ్ళారు. రిపేరు చేసే సమయంలో విద్యుత్ షాక్ తగిలి రైతు మృతిచెందాడు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఏబీ స్విచ్‌లు సక్రమంగా లేక రైతుకు షాక్ తగిలి మృతిచెందాడని గ్రామస్తులు,కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతునికి భార్య నీలమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.