‘అత్తారింటికి దారేది’ పైరసీ కేసులో 12 మంది అరెస్ట్
సాక్షి, మచిలీపట్నం: ‘ అత్తారింటికి దారేది’ సినిమా పైరసీపై 12మందిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ కె.వి.శ్రీనివాస్ తెలిపారు. కోట్ల రూపాయలు వెచ్చించి తీసిన ఈ సినిమా పైరసీ సీడీని రూ.50కే అమ్మకాలు సాగించిన తీరుపై సోమవారం పెడన, బందరులో దాడులు చేసి పలు ఇంటర్నెట్, సెల్‌పాయింట్లు నుంచి కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు, మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. మంగళవారం సుమారు 30 మందిని విచారించారు. వారిలో 12 మందిని అనుమానితులను అదుపులోకి తీసుకోవడమేగాక పెడనకు చెందిన ఒకరిని హైదరాబాద్ తీసుకెళ్లారు. పెడనలోని దేవి మొబైల్స్ నిర్వాహకుడు అనిల్‌పై అనుమానంతో దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.