kvb puram
-
వాగు మధ్యలో ప్రసవం..
కేవీబీపురం: ఆ గ్రామం ఏర్పడి 70 ఏళ్లు అవుతోంది. గ్రామానికి వెళ్లాలంటే మార్గమధ్యంలో వాగు దాటాల్సిందే. వర్షాలు వస్తే సుమారు 20 అడుగుల వరకు వాగు పారుతుంది. కొద్దిరోజుల వరకు బాహ్య ప్రపంచంతో ఆ గ్రామానికి సంబంధాలు తెగిపోతాయి. చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం అంజూరు పంచాయతీ జయలక్ష్మీపురం గ్రామం పరిస్థితి ఇది. ఈ క్రమంలో ఆదివారం గ్రామానికి చెందిన సునీత (25) అనే గిరిజన గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు వాగు దాటిస్తుండగా మధ్యలోనే ప్రసవించింది. మొదట సునీతకు పురిటినొప్పులు రాగా బంధువులు స్థానిక వలంటీర్ సహాయంతో 108 వాహనానికి సమాచారం అందించారు. అయితే గత రాత్రి కురిసిన వర్షాలకు వాగు నిండుగా ప్రవహిస్తుండటంతో 108 వాహనం వాగు దాటే పరిస్థితి లేదు. స్థానికులు ఆటోలో కొబ్బరి మట్టల సహాయంతో గర్భిణిని గ్రామం నుంచి తీసుకొచ్చి వాగు దాటించే ప్రయత్నం చేశారు. పురిటినొప్పులు అధికమవ్వడంతో వాగు మధ్యలోనే గర్భిణికి కాన్పు చేశారు. ఆపై 108లో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నట్లు సమాచారం. -
'ఎర్ర' ఇన్ఫార్మర్ అంటూ..
చిత్తూరు: ఎర్ర చందనం ఇన్ఫార్మర్ అన్న నెపంతో పి.కాటయ్య అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన క్రాంతి, రమేష్ అనే ఇద్దరు దాడికి యత్నించిన సంఘటన చిత్తూరు జిల్లా కేవీబీ పురం మండలం అంజూరులో చోటు చేసుకుంది. బాధితుడు కాటయ్య కథనం మేరకు ఈ నెల మొదటి వారంలో అంజూరు అడవుల్లో ఆరుగురు వ్యక్తులు ఎర్రచందనం చెట్లను నరుకుతున్నారు. దీనిని గుర్తించిన డీఆర్ఓ పట్టాభి చెట్ల నరుకుతున్న వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇందులో ఐదుగురు పరారీ కాగా యుగంధర్(40) అనే వ్యక్తిని మాత్రం అదుపులోకి తీసుకొన్నారు. పట్టుబడ్డ యుగంధర్‌తో పాటు మిగిలిన ఐదుగురిపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. జైలు శిక్ష అనుభవించిన నిందితులు ఈ నెల 21న బెయిలుపై విడుదలై గ్రామానికి వచ్చారు. తమను గ్రామంలో మోహన్, గురవయ్య అనే ఇద్దరు పోలీసులకు పట్టించారని పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. గ్రామ పెద్దలు ఇన్ఫార్మర్లుగా వ్యవహరించిన మోహన్, గురవయ్యలకు చెరో రూ.5 వేలు చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఇది జరిగి రెండు రోజులు కూడా గడవక ముందే అదే గ్రామానికి చెందిన కాటయ్యపై ఎర్రచందనం కేసులో నిందితులైన రమేష్, క్రాంతిలు దాడికి యత్నించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చావని అంటూ ఈ విషయాన్ని ఫారెస్టు అధికారులే తమకు చెప్పారని.. చంపేస్తామని బెదిరించారు. చుట్టు పక్క ఉన్న స్థానికులు వీరిని అడ్డుకోవడంతో సమస్య సద్దుమణిగింది. ఈ సంఘటనపై కాటయ్య కేవీబీ పురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తన ప్రాణానికి రక్షణ కల్పించాలని కోరాడు. కాటయ్య ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని స్థానిక ఎస్ఐ పరశురాం తెలిపారు. ఈ సంఘటన అంజూరులో కలకలం రేపింది. తనపై జరిగిన దాడి యత్నాన్ని స్థానిక పోలీసులతో పాటు అటవీశాఖ ఉన్నతాధికారులకు, మంత్రికి కాటయ్య ఫిర్యాదు చేశాడు. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
పిచ్చాటూరు: చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం తిమ్మసముద్రం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. శ్రీకాళహస్తి నుంచి పదిమంది ప్రయాణికులతో షేర్ ఆటో కేవీబీపురానికి బయలుదేరింది. కేవీబీపురం మండలం తిమ్మసముద్రం వద్ద పిచ్చాటూరు నుంచి శ్రీకాళహస్తి వైపు వెళుతున్న లారీ రాంగ్ రూట్లో వస్తుండడం గమనించి ఆటోను డ్రైవర్ పక్కకు తిప్పాడు. ఆటో ఒక్కసారిగా పక్కకు రావడంతో లారీ డ్రైవర్ తికమకపడి ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న కేవీబీపురం మండలం కోవనూరుకు చెందిన చెంగయ్యు(25), మఠం గ్రామానికి చెందిన ఉష(35), సబ్బులక్ష్మి(55), దిలీప్(3), జ్ఞానమ్మకండ్రిగకు చెందిన పద్మ(50), కళత్తూరుకు చెందిన భూపతవ్ము(50), ఓళూరు గ్రామానికి చెందిన రాజయ్యు(25) అక్కడికక్కడే వుృతిచెందారు. వురో వుుగ్గురు తీవ్ర గాయూపడ్డారు. మృతుల్లో ఉషా, సుబ్బులక్ష్మి, దిలీప్ ఒకే కుటుంబానికి చెందిన వారు. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కావడంతో వుృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి. క్రేన్ రప్పించి మృతదేహాలను వెలికితీశారు.