థ్రిల్లర్మూవీ ‘ఎల్ 7’
అక్కయ్యపాలెం: రాహుల్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఎల్ 7’ సినిమా ఫాంటసీ, థ్రిల్లర్, హర్రర్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాత ఓబుల సుబ్బారెడ్డి అన్నారు. నగరంలోని ఒక హోటల్లో చిత్ర యూనిట్ ప్రమోషన్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో మనిషిని పోలినవారు ఏడుగురు ఉంటారని, ఒకే పోలిక ఉన్న 7 గురు తారసపడితే ఏ విధంగా ఉంటుందో చిత్ర దర్శకుడు ముకుంద్ పాండే అద్భుతంగా తెరకెక్కించారని తెలిపారు. సినిమా ప్రమోషన్లో భాగంగా చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా రక్త దాన శిబిరాల ద్వారా ఇప్పటి వరకు వెయ్యికి పైగా యూనిట్ల రక్తం సేకరించి రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకుకు అందజేశామని తెలిపారు. సినిమా హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ విశాఖలో చదివిన రోజుల్లో జగదాంబ థియేటర్లో సినిమాలు ఎక్కువగా చూసే వాడినని, అపుడే సినిమాలలో నటించాలన్న కోరిక ఏర్పడిందన్నారు. కథ, వీకెండ్‌లవ్, తుంగభద్ర, నవ మన్మ«థుడు సినిమాలలో నటించానన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ముకుంద్ పాండే, నటీనటులు మనాలి రాథోడ్, సవేరి, అపూర్వ పాల్గొన్నారు.