L & T companies
-
ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ విలీనం
ముంబై: డిజిటల్ సర్వీసుల్లో భారీ ఆర్డర్ల కోసం పోటీపడే దిశగా ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ (ఎల్టీఐ), మైండ్‌ట్రీలను విలీనం చేస్తున్నట్లు ఇంజనీరింగ్, నిర్మాణ రంగాల దిగ్గజం ఎల్అండ్టీ గ్రూప్ వెల్లడించింది. విలీన సంస్థ పేరు ఎల్టీఐమైండ్ట్రీగా ఉంటుందని వివరించింది. 3.5 బిలియన్ డాలర్ల ఆదాయంతో టెక్ మహీంద్రా తర్వాత రెవెన్యూపరంగా దేశీయంగా ఆరో అతి పెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థగా ఎల్టీఐ ఉండనుంది. అవసరమైన అనుమతులన్నీ వచ్చాక వచ్చే పదకొండు నెలల్లో ప్రక్రియ పూర్తి కాగలదని ఎల్అండ్టీ గ్రూప్ పేర్కొంది. విలీన సంస్థకు దేబాశీష్ చటర్జీ సారథ్యం వహిస్తారు. ఎల్టీఐ సీఈవో సంజయ్ జలోనా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు ఎల్అండ్టీ చైర్మన్ ఏఎం నాయక్ చెప్పారు. 2 కంపెనీల్లో ఎల్అండ్టీకి మెజారిటీ వాటాలు ఉన్నా యి. పూర్తిగా స్టాక్స్ రూపంలో ఉండే ఈ డీల్ ప్రకా రం మైండ్‌ట్రీ షేర్‌హోల్డర్ల దగ్గరున్న ప్రతి 100 షేర్ల కు 73 ఎల్టీఐ షేర్లు లభిస్తాయి. ఎల్టీఐమైండ్ట్రీలో ఎల్అండ్టీకి 68.73% వాటాలు ఉంటాయి. టార్గెట్ 10 బిలియన్ డాలర్లు 100 మిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే భారీ డీల్స్ కోసం పోటీపడేందుకు ఈ విలీనం ఉపయోగపడగలదని నాయక్ తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీలకు లభిస్తున్న ప్రాజెక్టుల విలువ దాదాపు 25 మిలియన్ డాలర్ల స్థాయిలోనే ఉంటోందని ఆయన చెప్పారు. ఆదాయ పరిమాణం తక్కువగా ఉండటం వల్ల పెద్ద కాంట్రాక్టులకు బిడ్ చేయడం సాధ్యపడటం లేదని నాయక్ తెలిపారు. వచ్చే అయిదేళ్లలో విలీన సంస్థ ఆదాయాలు 10 బిలియన్ డాలర్లకు చేరుకోగలదన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇది 3.5 బిలియన్ డాలర్లుగా ఉంది. 80వేల పైచిలుకు సిబ్బంది విలీన సంస్థలో 80,000 మంది పైగా సిబ్బంది ఉంటారు. విలీనంతో తాము కొత్తగా 15–20% మందిని కొత్తగా రిక్రూట్ చేసుకోవాల్సి రానున్నట్లు నాయక్ తెలిపారు. ఎల్అండ్టీలో ఐటీ విభాగంగా 2000లో ఎల్టీఐ ఏర్పాటైంది. 2019లో మైండ్‌ట్రీలో ఎల్అండ్టీ గ్రూప్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. చదవండి: ఫ్రెషర్లకు అదిరిపోయే శుభవార్త..! కాగ్నిజెంట్‌లో భారీగా నియామకాలు! -
విలీన బాటలో దిగ్గజ ఐటీ కంపెనీలు?
ముంబై: సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీలు ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ లిమిటెడ్ విలీనం కానున్నట్లు తెలుస్తోంది. మౌలిక రంగ ఇంజినీరింగ్ దిగ్గజం ఎల్అండ్టీ గ్రూప్‌నకు చెందిన ఈ రెండు సంస్థలు విలీనమైతే 22 బిలియన్ డాలర్ల(రూ. 1,65,000 కోట్లు) విలువైన ఐటీ కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు అంచనా. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ లిమిటెడ్ బోర్డులు విలీనానికి అనుగుణంగా షేర్ల మార్పిడి అంశాన్ని పరిశీలించనున్నట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కొద్ది రోజులుగా మాతృ సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) లిస్టెడ్ ఐటీ కంపెనీలు రెండింటి విలీనానికున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేసినట్లు వెల్లడించాయి. తద్వారా గ్లోబల్ డిజిటల్ దిగ్గజాలతో విలీన సంస్థ పోటీపడేందుకు వీలుంటుందని మౌలిక రంగ దిగ్గజం ఎల్అండ్టీ భావిస్తున్నట్లు తెలియజేశాయి. వచ్చే వారమే? మౌలిక దిగ్గజం ఎల్అండ్టీ లిమిటెడ్ నియంత్రణలోని ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ లిమిటెడ్ విలీనానికి షేర్ల మార్పిడి అంశంపై వచ్చే వారం మొదట్లోనే బోర్డులు చర్చించే వీలున్నట్లు తెలుస్తోంది. ఐటీ సేవల కంపెనీ మైండ్‌ట్రీను 2019లో ఎల్అండ్టీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మైండ్‌ట్రీలో ఎల్అండ్టీకి 61 శాతం వాటా ఉంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తాజాగా రూ. 65,287 కోట్లు (8.7 బిలియన్ డాలర్లు)స్థాయికి చేరింది. ఇక ఎల్అండ్టీకి 74 శాతం వాటా కలిగిన ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ విలువ రూ. 1,02,825 కోట్లు(13.7 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. వెరసి విలీన సంస్థ మార్కెట్ క్యాప్ 22 బిలియన్ డాలర్లను అధిగమించనున్నట్లు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. క్లయింట్ల విషయంలో.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ విలీనమైతే క్లయింట్లు లేదా బిజినెస్‌లో పరస్పర అతిక్రమణ నామమాత్రంగానే ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సర్వీసులకు అధిక ధరలు పొందేందుకు, వ్యయాల నియంత్రణకు రెండు సంస్థల మధ్య ఒప్పందం దారి చూపుతుందని అంచనా వేశాయి. అయితే విలీనం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లే వీలున్నట్లే.. ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉన్నదని మీడియా వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాగా.. ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు ఎల్అండ్టీ ప్రతినిధి ఒకరు నిరాకరించగా.. మైండ్‌ట్రీ, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ నుంచి స్పందన కరువైనట్లు తెలియజేశాయి. మైండ్‌ట్రీ క్యూ4(జనవరి–మార్చి) త్రైమాసిక ఫలితాలను సోమవారం(18న) విడుదల చేయగా.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్పనితీరు నేడు(19న) వెల్లడికానుంది. కోవిడ్–19 ఎఫెక్ట్ కొద్ది నెలలుగా ప్రపంచస్థాయిలో విస్తరించిన కోవిడ్–19 మహమ్మారితో డిజిటైజేషన్‌కు డిమాండు బాగా పెరిగినట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు. దీంతో సాఫ్ట్వేర్ సేవల కంపెనీలకు బిజినెస్ అవకాశాలు భారీగా విస్తరిస్తున్నట్లు తెలియజేశారు. ఐటీ ఔట్సోర్సింగ్ దిగ్గజాలు సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్, మెషీన్‌లెర్నింగ్ సపోర్ట్ తదితర నవతరం సేవలు అందించేందుకు పోటీ పడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సేవలకు పెరుగుతున్న డిమాండును అందుకునేందుకు ఐటీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. షేర్లు డీలా: మైండ్‌ట్రీ షేరు ఎన్ఎస్ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 3,965 వద్ద నిలవగా.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 2.5 శాతం నష్టంతో రూ. 5,890 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో మైండ్‌ట్రీ రూ. 4,020–3,834 మధ్య ఊగిసలాడింది. మైండ్‌ట్రీ లాభం జూమ్ న్యూఢిల్లీ: ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ మైండ్‌ట్రీ లిమిటెడ్ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 49% జంప్‌చేసి రూ. 473 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2020–21) క్యూ4లో రూ. 317 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 37 శాతంపైగా ఎగసి రూ. 2,897 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 2,109 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఇక పూర్తి ఏడాదికి మైండ్‌ట్రీ కన్సాలిడేటెడ్ నికర లాభం 49% వృద్ధితో రూ. 1,653 కోట్లకు చేరింది. ఆదాయం రూ. 7,968 కోట్ల నుంచి రూ. 10,525 కోట్లకు ఎగసింది. ఇది 31% అధికం. షేరుకి రూ. 27 చొప్పున తుది డివిడెండును కంపెనీ ప్రకటించింది. కాగా, మెండ్‌ట్రీ, ఎల్అండ్టీ టెక్ మధ్య విలీన వార్తలపై స్పందిస్తూ ఇవన్నీ ఊహాగానాలేనంటూ మైండ్‌ట్రీ సీఈవో, ఎండీ దేవశిష్ చటర్జీ దేవశిష్ కొట్టిపారేశారు. చదవండి: -
Hyderabad: ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ విస్తరణ.. కొత్తగా మరో డెలివరీ సెంటర్
ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ నగరం దూసుకుపోతుంది. మానవ వనరుల లభ్యత, ప్రభుత్వ విధానాలు, భౌగోళిక అనుకూలత కారణంగా ఐటీ కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను క్రమంగా విస్తరించుకుంటూ పోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే హైదరాబాద్‌లో పాగా వేసిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (ఎల్టీఐ) సంస్థ తాజాగా మరో ఆఫీస్‌ని ప్రారంభించింది. 3000ల మంది ఉద్యోగులు మాదాపూర్‌లో స్కైవ్యూ క్యాంపస్ భవనంలో 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాత సౌకర్యాలతో నూతన డెలివరీ సెంటర్‌ని మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కొత్త క్యాంపస్‌లో మూడు వేల మంది ఉద్యోగులు పని చేయనున్నారు. ఇక్కడి నుంచే డిజిటల్, డేటా, క్లౌడ్ సొల్యుషన్స్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు సేవలు అందివ్వనుంది ఎల్టీఐ సంస్థ. ఐఎస్బీతో ఒప్పందం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్‌తో ఎల్టీఐ ఒప్పందం చేసుకుంది. రాబోయే న్యూఎంటర్‌ప్రైజెస్‌లలో డిజిటల్ రెడీనెస్ యొక్క ప్రాముఖ్యతపై ఈ రెండు సంస్థలు కలిసి పని చేయనున్నాయి. హైదరాబాద్‌లో నూతన క్యాంపస్ ప్రారంభించినందుకు ఎల్‌టీఐని మంత్రి కేటీఆర్ అభినందించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానాల కారణంగా ప్రసిద్ధి చెందిన సంస్థలు హైదరాబాద్‌లో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని ఆయన అన్నారు. -
‘మెట్రో’ మార్పుల భారం రూ.600 కోట్లు
‘మెట్రో’ మార్పుల భారం రూ.600 కోట్లు 4.2 కిలోమీటర్ల నుంచి 7.4 కిలోమీటర్లకు పెరిగిన ట్రాక్ లక్డీకాపూల్, సుల్తాన్‌బజార్‌లలో తగ్గుదల.. పాతబస్తీలో పెరుగుదల ప్రత్యామ్నాయమార్గాలను సూచిస్తూ ప్రభుత్వం అధికారిక లేఖ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి అందించిన సీఎస్ సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు మార్గంలో మూడు మార్పులు చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయమార్గాలను సూచిస్తూ ఎల్అండ్టీ యాజమాన్యానికి అధికారికంగా లేఖ పంపించింది. మెట్రో అలైన్మెంట్ కారణంగా దాదాపు రూ.600 కోట్ల భారం పడనుంది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. రాజధానిలో మొత్తం మూడుమార్గాల్లో 72 కిలోమీటర్ల మేర మెట్రోను నిర్మించేందుకు ఎల్అండ్టీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి విదితమే. చారిత్రాత్మక కట్టడాలు, ప్రార్థనా మందిరాలు, ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న చిహ్నాలకు విఘాతం కలగకుండా ‘మైట్రో’లో మార్పులు చేసిన నేపథ్యంలో అది 75.2 కిలోమీటర్లకు పెరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడుచోట్ల మార్పుల్లో అసెంబ్లీ, సుల్తాన్‌బజార్ వద్ద మార్పులతో స్పల్పంగా ట్రాక్ తగ్గితే.. పాతబస్తీ అలైన్మెంట్ మార్పుతో మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ పెరగనుంది. అధికారంలోకి రాకముందే మెట్రో అలైన్మెంట్ మార్చాలంటూ టీఆర్ఎస్ గట్టిగా పట్టుబట్టింది. అధికారంలోకి వచ్చాక.. దీనిపై మరింత పట్టుదలతో ఉండడంతో.. ఎల్అండ్టీకి ప్రభుత్వానికి మధ్య కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. మెట్రోరైలు మార్పులకు సంబంధించి ఈనెల 15న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ, మెట్రోరైలు ఎండీ ఎన్వీస్రెడ్డితో సహా ఎల్అండ్టీ సంస్థల గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎ ఎం నాయక్, ఎల్అండ్టీ మెట్రోరైలు చైర్మన్ దేవస్థలి, ఎండీ వీబీ గాడ్గిల్‌లతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అలైన్మెంట్ మార్పు గురించి వివరించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీతో సమావేశం తరువాత పాతబస్తీ అలైన్‌మెంట్‌పై తుది నిర్ణయం తీసుకున్నారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు ఉన్న మొదటి కారిడార్‌లో అసెంబ్లీ వద్ద ఒక మార్పు ఉండగా, జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ఉన్న రెండో కారిడార్‌లో రెండుచోట్ల అలైన్మెంట్ మార్పు ఉంటుంది.