కార్మికులపైకి దూసుకెళ్లిన కారు: ఒకరు మృతి
నల్గొండ జిల్లా చిట్యాలలో గురువారం తెల్లవారుజామున పంచాయతీకార్మికులపైకి కారు దూసుకెళ్లింది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనతో ఆగ్రహించిన పంచాయతీ కార్మికులతోపాటు స్థానికులు ఆందోళనకు దిగారు. చిట్యాలలో రోడ్డు ప్రమాదాలకు తీవ్రంగా చోటు చేసుకుంటున్నాయని వారు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు అంతర్గత రోడ్లు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రహదారిపై ఆందోళనలతో ట్రాఫిక్ భారీగా స్థంభించింది. పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్‌ను పునరుద్దరించారు. పోలీసులు మరణించిన మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే గాయపడిన క్షతగాత్రులను కూడా ఆ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.