పరుపుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
రంగారెడ్డి జిల్లా: షామీర్పేట్ మండలం మలక్పేట్ గ్రామ పరిధిలోని ఓ పరుపుల ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీబాలాజీ ఫోమ్స్ కంపెనీలోని స్పాంజి తయారీలో వాడే రసాయనాలు ప్రమాదవశాత్తు అంటుకుని మండాయి. అగ్నికీలలు పక్కనే ఉన్న కార్మికుల క్వార్టర్లలోకి కూడా వ్యాపించాయి. మంటలు వ్యాపించి ఫ్యాక్టరీలో ఉంచిన స్పాంజి మొత్తం ఆహుతయింది. యంత్రాలు మాత్రమే మిగిలాయి. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
దీంతో అక్కడి కార్మికుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.