'ఆ నాయకుడిని అరెస్ట్ చేయండి'
రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించిందని.. అన్న పాపానికి ఓ గిరిజనున్ని దారుణంగా హతమార్చిన సంఘటనపై అన్ని వైపుల నుంచి విమర్షలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నాయకుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు.
విజయనగరం జిల్లా సాలూరు మండలం ఇటుకల వలస గ్రామానికి చెందిన పాలిక లచ్చయ్య(35) గ్రామంలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతను ప్రశ్నించాడని.. పనులను దక్కించుకున్న టీడీపీ నాయకుడు ఆగ్రహించి అతనిపై చెక్కతో దాడి చేశాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఈ ఘటన పై సర్వత్ర చర్చ జరుగుతున్న తరుణంలో.. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనకు బాధ్యుడైన టీడీపీ నాయకుడు సారికొండ మందయ్య కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. విచారణలో భాగంగా ఈ రోజు గ్రామాన్ని సందర్శంచిన స్పెషల్ టీం బాధ్యులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పింది.