Lace
-
CM YS Jagan: జరీ అంచుపై సీఎం జగనన్న ఫొటో
సాక్షి, నగరి: నగరి చేనేత పరిశ్రమను ప్రగతి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా చూపుతున్న శ్రద్ధకు కృతజ్ఞతగా నగరి చేనేత కార్మికులు వారి చిత్రాలను హాఫ్‌సిల్క్ శారీ జరీ బోర్డర్‌పై నేశారు. నేత పరిశ్రమను సాంకేతికత వైపు మళ్లించేందుకు ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఆమె భర్త, రాయలసీమ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కేసెల్వమణి హిందూపూర్ నేత పరిశ్రమ వారితో చర్చించి నగరి మునిసిపాలిటీకి అధునాతన డిజైన్లలో చీరలు నేసే జకార్డ్ యంత్రాలు తెప్పించారు. ఈ ఆధునిక యంత్రాల్లో చీర నేయడాన్ని ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం ప్రారంభించారు. చదవండి: Disha App: ‘దిశ’ యాప్ కేరాఫ్ మన అన్న.. -
అల్లికళ తప్పుతోంది!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పై లేసులను చూశారా.. ఎంత అందంగా ఉండి మనస్సును ఆకట్టుకుంటోందో.. దీని వెనుక గాలిలో గమ్మత్తుగా చేతులు తిప్పే మహిళల అద్భుత ప్రతిభ దాగి ఉంది. తదేకంగా దృష్టి కేంద్రీకరించి రూపొందించే ఈ కళాత్మక లేసు అల్లికలకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంతో ప్రసిద్ధి. కాగా ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రూపొందించే అల్లికలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే క్రమంగా చాలామంది.. ముఖ్యంగా ఈ తరంవారు ఈ కళకు దూరమవుతున్నారు. పనికి తగ్గ ఫలితం దక్కకపోవడం వారిని నిరుత్సాహపరుస్తోంది. నరసాపురం తరువాత దేశంలో ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల్లో మాత్రమే పరిమితంగా లేసు పరిశ్రమ ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే అరుదైన లేసు అల్లికల కళ పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. బామ్మల వారసత్వంగా.. రెండు జిల్లాల్లోని 250 గ్రామాల్లో సుమారు 95 వేల మంది మహిళలు లేసు అల్లికలు చేస్తున్నట్టు అంచనా. గత 50 ఏళ్లుగా తమ బామ్మల వారసత్వంగా ఈ అరుదైన కళను కొనసాగిస్తున్నారు. దాదాపు 2,000 కుటుంబాలు ప్రత్యక్షంగా లేసు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. వీరిలో లేసు అల్లే మహిళల నుంచి ఆర్డర్లు తీసుకునే కమీషన్‌దారులు కూడా ఉన్నారు. ఇక అంతర్జాతీయ లేసు ఎగుమతిదారులు నరసాపురం ప్రాంతంలో 50 మంది దాకా ఉన్నారు. లేసు పార్కును ప్రారంభించిన వైఎస్సార్ కేంద్ర జౌళిశాఖ నేతృత్వంలో కేంద్ర హస్త కళల అభివృద్ధి సంస్థ ద్వారా 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నరసాపురం మండలం సీతారామపురంలో లేసు పార్కును ఏర్పాటు చేయించారు. ఆయన స్వయంగా ఈ పార్కును ప్రారంభించారు. ప్రస్తుతం లేసుపార్కుకు అనుసంధానంగా 50 సొసైటీలు, 29,000 మంది సభ్యులు ఉన్నారు. మహిళల్లో మార్కెట్ స్కిల్స్ పెంచడం, అధునాతన డిజైన్ల తయారీకి శిక్షణ ఇవ్వడం, ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే సామర్థ్యాన్ని పెంచడానికి లేసుపార్కు ఏర్పాటు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులు ఈ పార్కును నిర్లక్ష్యం చేయడంతో ఆశించిన లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. చైనా నుంచి గట్టిపోటీ ఎదురవుతుండడంతో నరసాపురం లేసు పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. చైనాలో యంత్రాలపై లెక్కకు మించిన డిజైన్లు, నాణ్యతతో కూడిన అల్లికలను ఉత్పత్తి చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చైనా ఇచ్చినంత తక్కువ ధరకు నరసాపురం ఎగుమతి దారులు అల్లికలను ఇవ్వలేకపోతున్నారు. కుంగదీస్తున్న పన్నుల మోత లేసు పరిశ్రమ హస్తకళలకు సంబంధించింది కావడంతో గతంలో ఎలాంటి సుంకాలు ఉండేవి కావు. ఇప్పుడు లేసు ఎగుమతులపై 5 శాతం జీఎస్టీ విధించారు. పైగా ఎగుమతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. పదేళ్ల క్రితం వరకు ప్రతిఏటా రూ.300 కోట్ల విలువైన లేసు ఉత్పత్తులు నరసాపురం నుంచి ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం ఏటా కేవలం రూ.100 నుంచి రూ.150 కోట్ల మేర వ్యాపారం సాగుతోంది. 2006లో ఒక్క లేసు పార్కు ద్వారానే రూ.100 కోట్ల వ్యాపారం సాగింది. ప్రస్తుతం అది రూ.50 కోట్లకు పడిపోయింది. లేసు పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని మహిళలు, ఎగుమతి దారులు కోరుతున్నారు. శ్రమకు తగ్గ వేతనం దక్కేలా చూడాలి నేను చిన్నప్పటి నుంచి లేసు అల్లికలు కుడుతున్నాను. లేసు కుట్టడం చాలా కష్టమైన పని. కంటి చూపును ఒకేచోట కేంద్రీకరించాలి. దాంతో కళ్ల జబ్బులు వస్తాయి. మా శ్రమకు తగ్గ వేతనం దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే ముందుముందు ఎవరూ లేసు అల్లికలు కుట్టరు. ఇప్పటి పిల్లలు ఈ వృత్తిలోకి రావడం లేదు. – చిలుకూరి అంజలి, శిరగాలపల్లి, యలమంచిలి మండలం కేవలం వ్యాపారం మాత్రమే కాదు లేసుపార్కు కేవలం వ్యాపారం కోసమే పెట్టింది కాదు. మారుతున్న ఫ్యాషన్లకు అనుగుణంగా మహిళలకు ఇక్కడ శిక్షణ ఇస్తాం. వారిలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. అల్లికలు సాగించే మహిళలే నేరుగా ఎగుమతులు చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మన లేసు పరిశ్రమకు చైనా నుంచి పోటీ ఎదురవుతోంది. – జక్కంపూడి నాయుడు, లేసుపార్కు మేనేజర్ -
ఆధార్ ఓ ఎలక్ట్రానిక్ పగ్గం
న్యూఢిల్లీ: ఆధార్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పగ్గం లాంటిదనీ, జంతువులను తాళ్లతో కట్టేసినట్లు ప్రభుత్వం ఆధార్‌తో ప్రజలను బంధిస్తోందని న్యాయవాది శ్యాం దివన్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆధార్ రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ వచ్చిన పిటిషన్లపై బుధవారం విచారణ ప్రారంభించింది. పిటిషనర్ల తరఫున శ్యాం వాదనలు వినిపించారు. ‘ఆధార్ ఒక ఎలక్ట్రానిక్ పగ్గం లాంటిది. ఇది సెంట్రల్ డేటాబేస్కు కనెక్ట్ అయ్యి ఉంటుంది. పౌరుల రోజువారీ కార్యకలాపాలను, అలవాట్లను గమనించే అవకాశం ఇవ్వడం ద్వారా మెల్లగా ప్రజల్లో అసమ్మతిని అణచివేసి, ప్రభుత్వానికి అనుకూలంగా వారి ప్రవర్తనలో మార్పు తీసుకురాగలదు. ప్రతి దానికీ ఆధార్‌ను లింక్ చేయడం వల్ల ఏ పని చేయాలన్నా అది అవసరమవుతుంది. ఆధార్ నంబర్ లేకుండా బతకలేమనే స్థితి వస్తుంది. అప్పుడు ప్రభుత్వంలోని వారికి ఎవరిపైనైనా ఆగ్రహం వస్తే వారి ఆధార్ నంబర్‌ను స్విచాఫ్ చేస్తే చాలు. సామాజికంగా ఆ వ్యక్తి మరణించినంత పనవుతుంది. ఇలా ఇది ప్రజల్లో అసమ్మతి అనేదే లేకుండా చేస్తుంది’ అంటూ శ్యాం వాదించారు. తదుపరి వాదనలు గురువారం కొనసాగనున్నాయి. -
టాప్ టు బాటమ్ .. లేస్
న్యూలుక్ పాత డ్రెస్సులను కొత్తగానే కాదు కొత్త డ్రెస్సులకు మరిన్ని హంగులు అద్దడంలో ‘లేస్’లది ప్రత్యేక పాత్ర. సాదా సీదా డ్రెస్సులను అబ్బురపరచే డిజైన్ల అమరికతో రూపుకట్టాలంటే ‘లేస్’ఉండాల్సిందే! మొదట్లో లినెన్, సిల్క్, గోల్డ్, సిల్వర్ దారాలనే లేస్ డిజైన్లలో ఉపయోగించేవారు. ప్రస్తుతం నూలుదారాలతోనూ లేసుల తయారీ వచ్చేసింది. యంత్రాల మీద సింథటిక్ ఫైబర్ లేసులు లక్షలాది డిజైన్లతో అందంగా రూపుకడుతున్నాయి. ప్రపంచమంతా సందడి చేస్తున్న ‘లేసు’లు 19వ శతాబ్దిలో ఉత్తర అమెరికాలో మొదలైనట్టు, అటు తర్వాతే ప్రపంచమంతా ఈ డిజైన్స్ పట్ల ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. అనార్కలీ, ఫ్రాక్, మిడీ, టీ షర్ట్... ఏదైనా ఇప్పటికే వాడేసి ఉన్నా దానికి నచ్చిన లేస్‌లను మెడ, ఛాతి, చేతుల భాగంలో జత చేసి చూడండి. ఓ కొత్త రూపుతో డిజైనర్ డ్రెస్ మీ సొంతం అవుతుంది. ఈవెనింగ్ పార్టీవేర్ డ్రెస్ కావాలనుకుంటే మిడ్ ప్రాక్ మీదకు లేస్ బ్లౌజ్ లేదా షగ్ ్రవేసుకుంటే చాలు స్టైలిష్‌గా కనిపిస్తారు. లేస్లతో తయారుచేసిన బేర్‌ఫుట్ శాండల్స్ మోడల్స్ నేడు ఎన్నో వెరైటీలు వచ్చాయి. వీటిని ధరించాక శాండల్స్ లేదా చెప్పులు వేసుకుంటే పాదాల అందం రెట్టింపు అవుతుంది. ప్లెయిన్ ఆరెంజ్ ఫ్రాక్‌కి కాంట్రాస్ట్ కలర్ లేస్‌ని కుడితే ఎక్కడ ఉన్నా ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. ప్లెయిన్ షర్ట్‌లకు కాలర్, జేబులు, ముంజేతుల దగ్గర లేస్‌లను జత చేస్తే ఆధునికమైన ఆకర్షణ. పాత బెల్‌బాటమ్ కింది భాగం నుంచి మోకాళ్ల వరకు లేస్‌ను జత చేస్తే ఓ కొత్త డిజైన్ ఆకట్టుకుంటుంది. ప్లెయిన్ టీ షర్ట్ ధరించినప్పుడు మెడలో వెడల్పాటి లేస్‌ను ధరిస్తే నెక్ డిజైన్‌గా కంటికి ఇంపైన ఆకర్షణ.