టాప్ టు బాటమ్ .. లేస్
న్యూలుక్
పాత డ్రెస్సులను కొత్తగానే కాదు కొత్త డ్రెస్సులకు మరిన్ని హంగులు అద్దడంలో ‘లేస్’లది ప్రత్యేక పాత్ర. సాదా సీదా డ్రెస్సులను అబ్బురపరచే డిజైన్ల అమరికతో రూపుకట్టాలంటే ‘లేస్’ఉండాల్సిందే! మొదట్లో లినెన్, సిల్క్, గోల్డ్, సిల్వర్ దారాలనే లేస్ డిజైన్లలో ఉపయోగించేవారు. ప్రస్తుతం నూలుదారాలతోనూ లేసుల తయారీ వచ్చేసింది. యంత్రాల మీద సింథటిక్ ఫైబర్ లేసులు లక్షలాది డిజైన్లతో అందంగా రూపుకడుతున్నాయి. ప్రపంచమంతా సందడి చేస్తున్న ‘లేసు’లు 19వ శతాబ్దిలో ఉత్తర అమెరికాలో మొదలైనట్టు, అటు తర్వాతే ప్రపంచమంతా ఈ డిజైన్స్ పట్ల ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది.
అనార్కలీ, ఫ్రాక్, మిడీ, టీ షర్ట్... ఏదైనా ఇప్పటికే వాడేసి ఉన్నా దానికి నచ్చిన లేస్‌లను మెడ, ఛాతి, చేతుల భాగంలో జత చేసి చూడండి. ఓ కొత్త రూపుతో డిజైనర్ డ్రెస్ మీ సొంతం అవుతుంది. ఈవెనింగ్ పార్టీవేర్ డ్రెస్ కావాలనుకుంటే మిడ్ ప్రాక్ మీదకు లేస్ బ్లౌజ్ లేదా షగ్ ్రవేసుకుంటే చాలు స్టైలిష్‌గా కనిపిస్తారు.
లేస్‌లతో తయారుచేసిన బేర్‌ఫుట్ శాండల్స్ మోడల్స్ నేడు ఎన్నో వెరైటీలు వచ్చాయి. వీటిని ధరించాక శాండల్స్ లేదా చెప్పులు వేసుకుంటే పాదాల అందం రెట్టింపు అవుతుంది. ప్లెయిన్ ఆరెంజ్ ఫ్రాక్‌కి కాంట్రాస్ట్ కలర్ లేస్‌ని కుడితే ఎక్కడ ఉన్నా ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. ప్లెయిన్ షర్ట్‌లకు కాలర్, జేబులు, ముంజేతుల దగ్గర లేస్‌లను జత చేస్తే ఆధునికమైన ఆకర్షణ. పాత బెల్‌బాటమ్ కింది భాగం నుంచి మోకాళ్ల వరకు లేస్‌ను జత చేస్తే ఓ కొత్త డిజైన్ ఆకట్టుకుంటుంది. ప్లెయిన్ టీ షర్ట్ ధరించినప్పుడు మెడలో వెడల్పాటి లేస్‌ను ధరిస్తే నెక్ డిజైన్‌గా కంటికి ఇంపైన ఆకర్షణ.