విశాఖ జిల్లాలో తెలుగు తమ్ముళ్ల వీరంగం
విశాఖ : తెలుగు తమ్ముళ్లు మరోసారి రెచ్చిపోయి వీరంగం సృష్టించారు. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో మద్యం బాటిళ్లతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో వైఎస్ విగ్రహం పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనపై స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. టీడీపీ కార్యకర్తల దుశ్చర్యపై మండిపడ్డారు.