మహిళల వాష్‌రూమ్‌లో రాహుల్!
వడోదర: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చిక్కుల్లో పడ్డారు. నవసర్జన్ మూడు రోజుల యాత్రలో భాగంగా గుజరాత్‌లోని ఛోటా ఉదయ్‌పూర్ జిల్లాలో దర్బార్ హాల్లో గిరిజన విద్యార్థుల సమావేశానికి హాజరైన రాహుల్.. పొరపాటున పురుషుల వాష్‌రూమ్‌కు బదులుగా మహిళలకు కేటాయించిన వాష్‌రూమ్‌లోకి వెళ్లారు. రాహుల్ మహిళల వాష్‌రూమ్ నుంచి బయటకొస్తున్న వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
భద్రతా సిబ్బందితో పాటు రాహుల్ గుజరాతీలో ‘మహిళో మాతే సౌచాలయ్’(మహిళల వాష్‌రూమ్) అని ఉన్న బోర్డును అర్థం చేసుకోలేకపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని స్థానికులు తెలిపారు. రాహుల్ మహిళల వాష్‌రూమ్ పక్కనుంచి వెళ్లారే తప్ప అందులోకి ప్రవేశించలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ దోసీ స్పష్టం చేశారు. రాహుల్ పర్యటనకు గుజరాత్ ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే తట్టుకోలేని బీజేపీ కుట్ర పన్నుతోందని విమర్శించారు. కేవలం రాహుల్ కాకుండా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు మహిళల వాష్‌రూమ్‌లోకి వెళ్లారనిస్థానికులు చెప్పారు. కాగా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్‌ని నియామకంపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(యూపీసీసీ) ఏకగీవ్ర తీర్మానం చేసింది.