lady dead
-
ఆపరేషన్ చేస్తుండగా ఫిట్స్..మహిళా సర్పంచ్ మృతి
దామరగిద్ద (నారాయణపేట): కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తుండగా ఫిట్స్ వచ్చి ఓ మహిళా సర్పంచ్ మృతి చెందింది. నారాయణపేట జిల్లా దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దామరగిద్ద పీహెచ్సీలో డీపీఎల్ సర్జన్ డాక్టర్ హరిచందర్‌రెడ్డి సమక్షంలో మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిబిరం చేపట్టారు. ఈ శిబిరంలో ఆపరేషన్ చేయించుకునేందుకు లింగారెడ్డిపల్లి సర్పంచ్ లక్ష్మి (32) వచ్చింది. అవసరమైన పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను మధ్యాహ్నం రెండు గంటలకు ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. జైలోకిన్ ఇంజెక్షన్ ఇచ్చి, గర్భసంచి ప్రాంతంలో కడుపుపై ట్రాకర్‌ను లోపలికి పంపేందుకు చర్మాన్ని కట్ చేసే సమయంలో లక్ష్మికి ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్లింది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే లక్ష్మి మృతి చెందినట్టు అక్కడి వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు నారాయణపేట పాతబస్టాండ్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళా సర్పంచ్ మృతి చెందిందని, బాధ్యులపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆపరేషన్ చేయకముందే.. లక్ష్మికి సర్జరీ చేసేందుకు అనస్తీయా వైద్యులు జైలోకిన్ ఇంజెక్షన్ ఇచ్చారని, ఆపరేషన్ చేసేందుకు సర్జన్ హరిచందర్‌రెడ్డి చర్మాన్ని కట్ చేయగా.. పేషెంట్ కోమాలోకి వెళ్లిందని డీఎంహెచ్‌వో జయచంద్రమోహన్ తెలిపారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వెంటనే మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించామన్నారు. అయితే, అక్కడికి చేరుకోగానే ఆమె మృతి చెందినట్లు చెప్పారు. లక్ష్మి మృతికి గల కారణం పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందన్నారు. ( చదవండి: విషాదం: ఇద్దరు చిన్నారులు సజీవ దహనం ) -
ఒంటరి యువతిని ఇంట్లో బంధించి..
సాక్షి, యాదాద్రి : యాదాద్రి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని ఇంట్లో బంధించి పురుగుల మందు తాగించడంతో ఆమె మృతిచెందింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారంలో ఓ ఇంట్లోకి కొందరు గుర్తుతెలియని దుండగులు చొరబడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని బంధించారు. అంతటితో ఆగని ఆ దుండగులు యువతికి బలవంతంగా పురుగుల మందు తాగించి అక్కడినుంచి పరారైనట్లు సమాచారం. ఇది గమనించిన స్థానికులు యువతిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఆమె మృతిచెందినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మృగాళ్ల దాష్టీకం.. వైద్యుల నిర్లక్ష్యం
బిడ్డకు జన్మనిచ్చి.. కడతేరిన పిచ్చి‘తల్లి’ గడ్డ కట్టిన రక్తం ఎక్కించడంతో బాలింత మృతి కావలి ఏరియా వైద్యశాలలో ఘటన కొండాపురం : మృగాళ్ల కామ దాహానికి ఆ పిచ్చి ‘తల్లి’ గర్భవతి అయింది. ఆమె గర్భిణి అని తెలుసుకునేలోగా.. తల్లి ప్రాణానికి ముప్పు అని తెలిసి మిన్నకుండిపోయారు. ఆ ‘తల్లి’ ప్రాణాలు కాపాడుకునేందుకు కాన్పు కోసం గత సోమవారం కావలి ఏరియా వైద్యశాలలో చేర్పించారు. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు నిర్లక్ష్యం వహించి.. ఆమెకు గడ్డ కట్టిన రక్తం ఎక్కించారు. తెలుసుకునేలాగో జరగరాని ఘోరం జరిగిపోయింది. వివరాల్లోకి వెళ్లితే.. మండలంలోని పార్లపల్లి దళితవాడకు చెందిన బండ్లమూడి మాలకొండయ్య, నారాయణమ్మ కుమారై ఈశ్వరమ్మ (32) పుట్టుకతోనే మానసిక వికలాంగురాలు. 12 ఏళ్ల క్రితం పొట్టకూటì కోసం కుటుంబమంతా కలిసి ప్రకాశం జిల్లా సింగరాయకొండకు పని నిమిత్తం వెళ్లారు. అక్కడ ఈశ్వరమ్మను కోటేశ్వరరావు అనే వ్యక్తి వివాహం చేసుకుంటానని మోసగించి గర్భవతిని చేశాడు. ఆమెకు దివ్యాంగుడైన మగబిడ్డను ప్రసవించింది. దీంతో కోటేశ్వరరావు ఈశ్వరమ్మను వదిలేశాడు. నాలుగేళ్ల క్రితం తిరిగి పార్లపల్లికి తల్లిదండ్రుతో వచ్చేసింది. ఈశ్వరమ్మను గుర్తుతెలియని కొందరు కామాంధులు గర్భవతిని చేశారు. ఈ క్రమంలో నిండు గర్భిణి అయిన ఈశ్వరమ్మను గత సోమవారం కాన్పు కోసం ఆమె తల్లి నారాయణమ్మ కావలి ఏరిమా వైద్యశాలకు తీసుకెళ్లింది. మూడు రోజుల క్రితం మగబిడ్డను ప్రసవించింది. తల్లి, బిడ్డ బాగానే ఉన్నారు. అయితే ఈశ్వరమ్మకు రక్తం తగ్గిందని, ఎక్కించాలని ఆదివారం సాయంత్రం ఒక నర్సు చెప్పిందని, వెంటనే తమ కుమారైకు రక్తం ఎక్కించారని నారాయణమ్మ తెలిపింది. ఆ రక్తం గడ్డలు గడ్డలుగా ఉందని నర్సుకు చెప్పడంతో బాటిల్ తీసివేసింది. అప్పటికే సగం బాటిల్ వరకు శరీరంలోకి వెళ్లింది. కొద్దిసేపటికి నర్సు వచ్చి మీ అమ్మాయి గుండెల్లో మట్టి చేరిందని, దీంతో చనిపోయిందని చెప్పారని వాపోయింది. రాత్రికి రాత్రే హాస్పిటల్ సిబ్బంది అంబులెన్స్‌ను పిలిపించి ఇంటికి పంపించారని తెలిపింది. విషయం తెలుసుకున్న కొండాపురం తహసీల్దార్ ప్రమీల, ఎస్ఐ రమేష్‌బాబు, ఏఎన్ఎం బుజ్జమ్మ అక్కడి చేరుకుని బిడ్డను, ఈశ్వరమ్మ మృతదేహన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్ఐ తెలిపారు.