యువ వైద్యురాలు దారుణహత్య
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో యువ వైద్యురాలు(24) దారుణహత్యకు గురైంది. నగర శివారులోని విలే పార్లే ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. మృతురాలు ఫిజియోథెరపిస్టుగా పోలీసులు గుర్తించారు. సోమవారం రాత్రి పార్టీ నుంచి కొంత మంది స్నేహితులతో కలిసి తన ఇంటికి తిరిగివచ్చింది.
తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. ఒంటిపై దుస్తులు లేకుండా పడివున్న శవాన్ని గుర్తించారు. అత్యాచారానికి పాల్పడి ఆమెను హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.