Lagadapati Rajgopal
-
తెలంగాణ శాసనమండలికి లగడపాటి
సాక్షి, హైదరాబాద్: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గురువారం తెలంగాణ శాసనమండలి వచ్చారు. తన కొడుకు పెళ్లి త్వరలో జరుగుతున్నందున పలువురు ఎమ్మెల్సీలకు పెళ్లికి ఆహ్వానించేందకు ఆయన మండలికి చేరారు. అక్కడ పలువురు ఎమ్మెల్సీలను కలిసి శుభలేఖలు అందజేశారు. కేసీఆర్తో భేటీ కాగా లగడపాటి బుధవారమే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాలంటూ శుభలేఖను అందించారు. కేసీఆర్ కూడా లగడపాటిని సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్, లగడపాటి కలుసుకోవడం ఇదే తొలిసారి. ఉద్యమ నేపధ్యంలో ఒకరినొకరు తీవ్ర విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ పెప్పర్ స్ప్రే కొట్టి కలకలం రేపిన లగబపాటి రాష్ట్ర విభనను వ్యతిరేకించారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. -
చంద్రబాబుతో లగడపాటి సమావేశం
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ముఖ్యమంత్రి రమ్మన్నారు, అందుకే వచ్చానని అన్నారు. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదన్నారు. తాను చంద్రబాబును వ్యక్తిగతంగానే కలిశానని, ఏం మాట్లాడానో బయటికి చెప్పలేనన్నారు. పవర్ ప్లాంట్ ఒప్పందాల గురించి మాట్లాడారా అని మీడియా ప్రశ్నించగా, వ్యక్తిగతంగానే కలిశానంటూ సమాధానం దాటవేశారు. రాజకీయాలకు దూరం అని గతంలోనే చెప్పాను...దానికే కట్టుబడి ఉన్నానని లగడపాటి స్పష్టం చేశారు. సీఎంతో నంద్యాల సహా ఏ రాజకీయ అంశం గురించీ మాట్లాడలేదని తెలిపారు. రాజకీయ అంశాలు అయితే ఇంట్లోనో...పార్టీ కార్యాలయంలోనే కలిసే వాడినని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు సఖ్యతతో మెలగడం శుభపరిణామమని అన్నారు. కాగా గతంలోనూ లగడపాటి ....చంద్రబాబుతో సమావేశం అయిన విషయం తెలిసిందే. -
''రాజకీయ సన్యాసుల సర్వేలను నమ్మొద్దు''
-
కిరణ్ పార్టీకి నైతిక మద్దతు: లగడపాటి
మాజీ సీఎం కిరణ్ కొత్త పార్టీ పెడితే నైతికంగా తన మద్దతుంటుందని లోక్సభ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం శనివారం తొలిసారిగా విజయవాడ వచ్చిన లగడపాటి మాట్లాడుతూ.... రాజకీయాల్లో యువనాయకులను ప్రోత్సహించాలన్నారు. రాజగోపాల్ ఫౌండేషన్ ద్వారా సీమాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు లగడపాటి పునరుద్ఘాటించారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం తనదైన శైలిలో ముందుకు వెళ్తుండటంతో సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ లోక్సభ సభ్యులు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, హర్షకుమార్, సాయి ప్రతాప్, ఉండవల్లి అరుణ్ కుమార్, రాయపాటి సాంబశివరావులు సొంత పార్టీపై లోక్సభలో అవిశ్వాసం పెట్టారు. దీంతో ఆగ్రహించిన అధిష్టానం అయా ఎంపీలను కాంగ్రెస్ నుంచి బహిష్కరించింది. అయితే లోక్సభలో విభజన బిల్లు ఆమోదం పొందడంతో తాను రాజకీయా సన్యాసం తీసుకుంటున్నట్లు లగడపాటి ప్రకటించిన సంగతి తెలిసిందే. -
చేతులెత్తిసిన లగడపాటి
-
మావద్ద మరికొన్ని అస్త్రాలున్నాయి: లగడపాటి