హుస్సేన్ సాగర్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం
హుస్సేన్‌సాగర్‌లో దూకి ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. సమయానికి లేక్ పోలీసులు అక్కడే ఉండటంతో వెంటనే రక్షించారు. తాగుబోతు భర్త అమానుషంగా చితకబాదడంతో భరించలేకే ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని బాధితురాలు కళ్యాణి తెలిపింది. భోలక్‌పూర్ మేకలమండికి చెందిన కల్యాణి భర్త చిన్ని రాజు వేధింపులు భరించలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని లేక్ పోలీస్‌స్టేషన్ సీఐ శ్రీదేవి తెలిపారు. కౌన్సెలింగ్ నిర్వహించి ఇంటికి పంపించివేసినట్లు తెలిసింది.