Lakshmy Ramakrishnan
-
ధనుష్ జంటను కలపండంటూ ట్వీట్, సమంతను మధ్యలోకి లాగిన నటి!
కోలీవుడ్ స్టార్ జంట ధనుష్- ఐశ్వర్య విడాకుల నిర్ణయాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. చిలకా గోరింకల్లా కలిసుండే మీరు ఇలా విడిపోవడం సరికాదని, విడాకులు వెనక్కు తీసుకోవాలని పలువురు అభిమానులు కోరుతున్నారు. 18 ఏళ్ల వివాహ బంధాన్ని ఫుల్స్టాప్ పెట్టి మీ మధ్య రిలేషన్‌ను ముక్కలు చేసుకోవద్దని సూచిస్తున్నారు. విడిపోతున్నామంటూ వీరు చేసిన ప్రకటనతో తీవ్ర భావోద్వేగానికి లోనైన ఓ అభిమాని చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. 'అమ్మ లక్ష్మీ రామకృష్ణన్ మీరే వారిని ఎలాగైనా కలపాలి' అని కోరాడు. దీనిపై నటి లక్ష్మీ రామకృష్ణన్ స్పందిస్తూ.. వారిద్దరూ పరస్పర గౌరవభావంతో విడిపోతున్నారని తెలిపింది. బహిరంగంగా ఒకరిపై ఒకరు నోరు పారేసుకుంటూ లేదా చట్టబద్ధంగా విడాకులు రావడానికి ముందే వేరొకరితో రొమాన్స్ చేస్తూ ఒకరినొకరు మానసికంగా కించపరచడం లేదని పేర్కొంది. దయచేసి వారిని ఒంటరిగా వదిలేయమని అభ్యర్థించింది. దీనికి సదరు అభిమాని బదులిస్తూ.. 'వారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను, కానీ వారు సైలెంట్‌గా విడిపోతే బాగుండేది. ఇలా ప్రచారం చేయడమే అస్సలు బాగోలేదు. దీనివల్ల అభిమానులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఒకప్పుడు విడాకులు అంటే అసాధారణమైన విషయంగా ఉండేది. కానీ సెలబ్రిటీల వల్ల ఇప్పుడవి సర్వసాధారణమైపోయాయి' అని ట్వీట్ చేశాడు. దీనికి లక్ష్మీ మరోసారి బదులిస్తూ హీరోయిన్ సమంతను ఉదాహరణగా పేర్కొంది. 'ఇక్కడ సమస్య ఏంటంటే.. ఒకవేళ వాళ్లు విడిపోతున్న విషయాన్ని బయటకు వెల్లడించకపోతే.. కనీసం వారి అనుమతి తీసుకోకుండానే ఇష్టమొచ్చినట్లు వార్తలు రాస్తారు. వారిపై తప్పుడు ప్రచారం జరుగుతుంది. అంతదాకా ఎందుకు? సమంత- నాగచైతన్య గౌరవప్రదంగా విడిపోతున్నట్లు ప్రకటించినప్పటికీ ఆమె చాలా దారుణమైన విషయాలను భరించాల్సి వచ్చింది' అని చెప్పుకొచ్చింది. ఇది చూసిన పలువురు నెటిజన్లు వీరి విడాకుల చర్చలోకి సమంతను ఎందుకు లాగుతున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. Amma @LakshmyRamki ithellam unga kannukku theriyatha .. rendu perayaum kootittu poi serthu vainga — Libin (@libinj6) January 17, 2022 The problem is that, if they don’t announce, distorted news will come out, without their permission, wrong information might be passed on. But even after a very graceful and dignified announcement @Samanthaprabhu2 had to endure v cruel stuff. — Lakshmy Ramakrishnan (@LakshmyRamki) January 18, 2022 -
చెన్నై వరదలపై సీనియర్ నటి సినిమా
చెన్నై: సీనియర్ నటి, దర్శకురాలు లక్షీ రామకృష్ణన్ మరోసారి మెగాఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నారు. గతేడాది సంభవించిన చెన్నై వరదలపై తమిళ సినిమా రూపొందించేందుకు సిద్ధమతున్నారు. ఇప్పటికే ఆమె ప్రిప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు. జూలై నుంచి షూటింగ్ ప్రారంభించే అవకాశముంది. 'ఈ ఏడాది ఆరంభం నుంచి స్క్రిప్ట్ పై పనిచేస్తున్నా. వరదల గురించి మాత్రమే సినిమాలో చూపించాలనుకోవడం లేదు. చెన్నై మహా నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ప్రజలకు ఎదురైన అనుభవాలు, భావోద్వేగాలు.. విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు స్పందించిన తీరును తెరకెక్కించనున్నామ'ని లక్ష్మీ రామకృష్ణన్ తెలిపారు. ఒక వ్యక్తి లేదా హీరో గురించి ఈ సినిమా ఉండదని, మానవీయ కోణంలో చూపించనున్నామని చెప్పారు. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించారు. ప్రధాన పాత్రల కోసం అశోక్ సెల్వన్, ప్రియా ఆనంద్, నజర్ లను సంప్రదించామని అన్నారు. వర్షాకాలంలో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నట్టు చెప్పారు. -
ప్రముఖ హీరో కోసం వేచి ఉండలేకే...
ప్రముఖ హీరో కోసం వేచి ఉండే సహనం తనకులేదంటున్నారు మహిళా దర్శకురాలు, నటి లక్ష్మీ రామకృష్ణన్. నటిగా బిజీగా ఉంటూనే మరో పక్క తన ఆలోచనలను తెరపై ఆవిష్కరించడానికి మెగాఫోన్ పట్టారు. తొలి ప్రయత్నంగా ఆరోహణం చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రానికి సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు, అభిమానుల ఆదరణ లభించింది. ప్రస్తుతం నెరింగివా ముత్తమిడాదే అనే పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మెడిమిక్స్ సమర్పణలో ఏవీఎం ప్రొడక్షన్స్ పతాకంపై అనూప్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవ నటుడు షబిర్ హీరోగా పరిచయం అవుతుండగా హీరోయిన్గా పియా బాజ్‌పాయ్ నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో శ్రుతి హరిహరణ్, తంబి రామయ్య, విజి చంద్రశేఖర్ తదితరులు నటిస్తున్నారు. ఎ.వినోద్ భారతి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి మెట్లి బ్రూస్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర షూటింగ్ పూర్తి అయిన ఈ నెరింగివా ముత్తమిడాదే చిత్ర వివరాలను దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్ తెలుపుతూ దర్శకురాలిగా తన తొలి చిత్రం ఆరోహణం చిత్రానికి మంచి ప్రశంసలు లభించాయన్నారు. ఆ ఉత్సాహం, ధైర్యంతోనే మలి యత్నంగా నెరింగివా ముత్త మిడాదే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. చిత్రంలో హీరో షబిర్‌తో పాటు ఒక లారీ కూడా ముఖ్య పాత్రగా ఉంటుందన్నారు. పియా బాజ్‌పాయ్, తంబి రామయ్య, విజి చంద్రశేఖర్ పాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నారు. ఆ పాత్రలకు వాళ్లు జీవం పోశారనే చెప్పాలన్నారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్ర కథను తాను ఒక ప్రముఖ హీరోను దృష్టిలో పట్టుకుని తయారు చేసుకున్నానని చెప్పారు. అయితే ఆయన కాల్షీట్స్ కోసం వేచి ఉండే సహనం లేక నవ హీరోతో రూపొందించానని తెలిపారు. నెరింగివా ముత్త మిడాదే నాలుగు కథలతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం అని చెప్పారు. అంతే కాకుండా జాతీయ స్థాయిలో సంచలనాత్మకమయిన ఒక అంశం ఇతి వృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. చిత్రాన్ని వచ్చే నెల తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు లక్ష్మీ రామకృష్ణన్ వెల్లడించారు.