Lakshmy Ramakrishnan Reacts To Fan Tweet On Dhanush Divorce, Includes Samantha - Sakshi
Sakshi News home page

Dhanush Divorce: ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య విడాకులు, స‌మంత‌ను ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన్న న‌టి

Published Thu, Jan 20 2022 12:24 PM | Last Updated on Thu, Jan 20 2022 1:28 PM

Lakshmy Ramakrishnan Reacts To Fan Tweet On Dhanush Divorce And Mentioned Samantha - Sakshi

కోలీవుడ్ స్టార్ జంట ధ‌నుష్‌- ఐశ్వ‌ర్య విడాకుల నిర్ణ‌యాన్ని ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేక‌పోతున్నారు. చిల‌కా గోరింక‌ల్లా క‌లిసుండే మీరు ఇలా విడిపోవ‌డం స‌రికాద‌ని, విడాకులు వెన‌క్కు తీసుకోవాల‌ని ప‌లువురు అభిమానులు కోరుతున్నారు. 18 ఏళ్ల వివాహ బంధాన్ని ఫుల్‌స్టాప్ పెట్టి మీ మ‌ధ్య రిలేష‌న్‌ను ముక్క‌లు చేసుకోవ‌ద్ద‌ని సూచిస్తున్నారు. విడిపోతున్నామంటూ వీరు చేసిన ప్ర‌క‌ట‌న‌తో తీవ్ర భావోద్వేగానికి లోనైన ఓ అభిమాని చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. 'అమ్మ ల‌క్ష్మీ రామ‌కృష్ణ‌న్ మీరే వారిని ఎలాగైనా క‌ల‌పాలి' అని కోరాడు.

దీనిపై న‌టి ల‌క్ష్మీ రామ‌కృష్ణ‌న్ స్పందిస్తూ.. వారిద్ద‌రూ ప‌ర‌స్ప‌ర గౌర‌వ‌భావంతో విడిపోతున్నార‌ని తెలిపింది. బ‌హిరంగంగా ఒక‌రిపై ఒక‌రు నోరు పారేసుకుంటూ లేదా చ‌ట్ట‌బ‌ద్ధంగా విడాకులు రావ‌డానికి ముందే వేరొక‌రితో రొమాన్స్ చేస్తూ ఒక‌రినొక‌రు మాన‌సికంగా కించ‌ప‌ర‌చ‌డం లేద‌ని పేర్కొంది. ద‌య‌చేసి వారిని ఒంట‌రిగా వ‌దిలేయ‌మ‌ని అభ్య‌ర్థించింది. దీనికి స‌ద‌రు అభిమాని బ‌దులిస్తూ.. 'వారి నిర్ణ‌యాన్ని నేను గౌర‌విస్తాను, కానీ వారు సైలెంట్‌గా విడిపోతే బాగుండేది. ఇలా ప్ర‌చారం చేయ‌డ‌మే అస్స‌లు బాగోలేదు. దీనివ‌ల్ల అభిమానుల‌కు త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఒక‌ప్పుడు విడాకులు అంటే అసాధార‌ణ‌మైన విష‌యంగా ఉండేది. కానీ సెల‌బ్రిటీల వ‌ల్ల ఇప్పుడ‌వి స‌ర్వ‌సాధారణ‌మైపోయాయి' అని ట్వీట్ చేశాడు.

దీనికి ల‌క్ష్మీ మ‌రోసారి బ‌దులిస్తూ హీరోయిన్ స‌మంత‌ను ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొంది. 'ఇక్క‌డ స‌మ‌స్య ఏంటంటే.. ఒక‌వేళ వాళ్లు విడిపోతున్న విష‌యాన్ని బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌క‌పోతే.. క‌నీసం వారి అనుమ‌తి తీసుకోకుండానే ఇష్ట‌మొచ్చిన‌ట్లు వార్త‌లు రాస్తారు. వారిపై త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతుంది. అంత‌దాకా ఎందుకు? స‌మంత‌- నాగ‌చైత‌న్య గౌర‌వ‌ప్ర‌దంగా విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ఆమె చాలా దారుణ‌మైన విష‌యాల‌ను భ‌రించాల్సి వ‌చ్చింది' అని చెప్పుకొచ్చింది. ఇది చూసిన ప‌లువురు నెటిజ‌న్లు వీరి విడాకుల చ‌ర్చ‌లోకి స‌మంత‌ను ఎందుకు లాగుతున్నారంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement