యాసిడ్ దాడి నుంచి తప్పించుకున్న మహిళా లాయర్
మోటారుసైకిల్ మీద వచ్చిన ముగ్గురు దుండగులు ముఖం మీద యాసిడ్ విసరగా.. ఓ మహిళా న్యాయవాది ఆ దాడినుంచి తృటిలో తప్పుకొన్నారు. సరిగ్గా ఆమె ఇంటినుంచి బయటకు బయల్దేరుతున్న సమయంలోనే ఈ దాడి జరిగింది. సరిగ్గా వాళ్లు యాసిడ్ పోయగానే ఆమె కిందకు వంగడంతో యాసిడ్ అంతా కింద పడిపోయిందని, లలితాశర్మ (30) అనే న్యాయవాదికి ఎలాంటి గాయాలు కాలేదని ఏఎస్ఐ దిలీప్ సింగ్ తెలిపారు.
ఆమె కోర్టుకు బయల్దేరుతుండగా ఓ నిందితుడు మోటార్ సైకిల్ మీద వచ్చాడని, అతడితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారని చెప్పారు. చిన్నపాటి గాయాలు కావడంతో ఆమెను మహాత్మాగాంధీ ఆస్పత్రికి తరలించామని, నిందితులను ఇప్పటికే గుర్తించినందున వారి కోసం గాలింపు మొదలుపెట్టామని ఆయన అన్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని జిల్లా బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.